ప్రస్తుతమున్న క్రికెటర్లపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటుంటారని చెప్పాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమేనని... అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నాడు. ఇలా తయారు కావడానికి ప్రధానంగా డబ్బు, పొగరు, అహం అనే మూడు అంశాలే కారణమని తెలిపాడు.
మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల (సంవత్సరాలు) క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు.
''అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండడం సహజమే. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం. నెగటివిటీని పట్టించుకోరు.ఇదే సమయంలో మేం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదనుకుంటారు'' అంటూ తెలిపాడు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు కాసులు కురిపించే ఐపీఎల్‌లో ఒక్క సీజన్ ఆడినా చాలు భారీ మొత్తంలో డబ్బులు దక్కించుకోవచ్చనే భ్రమలో ఆటగాళ్లు బతికేస్తున్నారు. ఏదో ఒకరోజు తిరిగి వారికే దెబ్బకొట్టే అవకాశముందని.. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చదవండి: #SackRahulDravid: 'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే ద్రవిడ్‌ను తొలగించండి'
ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు
Comments
Please login to add a commentAdd a comment