భారత క్రికెట్‌లో 'కెప్టెన్ కూల్' అంటే మనకు టక్కున గుర్తు వచ్చేది టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనినే. అతడు తన కూల్ కెప్టెన్సీ భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ దృష్టిలో కెప్టెన్ కూల్' అంటే ధోని కాదంట.
భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందిచిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసలైన 'కెప్టెన్ కూల్' గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 1983 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని నిన్నటికి(జూన్25) 40 ఏళ్లు పూరైన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోగవాస్కర్ ఈ వాఖ్యలు చేశాడు.
1983 ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఫైనల్‌లో వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను కపిల్ అద్భుతంగా అందుకున్నాడు. అదే మేము వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచేలా చేసింది. ఆ క్యాచ్ ఇప్పటికి ఎవరూ మరిచిపోరు. కపిల్ ఒక డైనమిక్ లీడర్. ఒక కెప్టెన్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అతడిలో ఉండేవి.
ఒక ఆటగాడు క్యాచ్ వదిలినా, మిస్ ఫీల్డ్ చేసినా.. కపిల్ ముఖంపై చిరునవ్వు తప్ప కోపం కనిపించకపోయేది. కపిల్ అసలైన కెప్టెన్ కూల్ అని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా 1983 ప్రపంచకప్‌లో అండర్ డగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్లో పటిష్ట విండీస్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
చదవండి: ధోనితో అట్లుంటది మరి.. గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు..!
Comments
Please login to add a commentAdd a comment