టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (PC: IPL/BCCI)
ప్రపంచంలోని టీ20 లీగ్‌లన్నింటిలో ఐపీఎల్‌ది ప్రత్యేక స్థానం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఇతర లీగ్‌లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తూ.. అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ గత పదిహేనేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందీ ఐపీఎల్.
ఎక్కడా లేని క్రేజ్
పదహారవ ఎడిషన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్ల స్టార్‌డమ్ పెంచడం సహా.. అసోసియేట్ దేశాల క్రికెటర్లకు కూడా కావాల్సినంత గుర్తింపు దక్కేలా చేస్తోంది.
క్రికెట్‌ను కేవలం ఆటలా కాకుండా మతంలా భావించే కోట్లాది మంది అభిమానులున్న భారత్‌లో ఐపీఎల్‌కు దక్కుతున్న ఆదరణ మరే ఇతర దేశాల లీగ్‌లకు కూడా లేదు. అలాంటిది సౌదీ అరేబియా.. ఐపీఎల్‌ను మించేలా ధనిక లీగ్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తామంటూ చేసిన ప్రకటన చేసిందన్న వార్త క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది.
సౌదీ సంచలనం?
ఫార్ములా వన్ రేసులతో పాటు క్రిస్టియానో రొనాల్డో వంటి పాపులర్ స్టార్లను తమ ఫుట్‌బాల్ లీగ్‌లలో ఆడిస్తూ వార్తల్లో నిలుస్తున్న సౌదీ.. క్రికెట్‌పై కూడా దృష్టి సారించినట్లు ఆ వార్తా కథనాల సారాంశం. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూని మించిన లీగ్‌తో సంచలనం సృష్టించాలని సౌదీ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.
అవును.. వాళ్లకు ఆసక్తి ఉందన్న ఐసీసీ
ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే.. ‘‘అవును.. సౌదీ క్రికెట్‌పై ఆసక్తి కనబరుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తిగా ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలను సంప్రదించి.. తమతో కలిసి టీ20 లీగ్‌లో భాగం కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలితో కూడా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వచ్చాయి.
వారికి మాత్రం నో చెప్పలేము
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భారత క్రికెటర్లెవరూ ఇతర దేశాల లీగ్‌లలో ఆడటం లేదు. అయితే, ఫ్రాంఛైజీలు సదరు లీగ్‌లో పాల్గొనాలా లేదా అన్నది ఓనర్ల ఇష్టం. ఫ్రాంఛైజీ ఓనర్లను అయితే మేము ఆపలేం కదా! అది వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం.
ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్‌లలో భాగమయ్యాయి. వారికి మేము నో చెప్పలేదు. ప్రపంచంలోని ఏ లీగ్‌లోనైనా పాల్గొనే స్వేచ్ఛ వారికి ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా భారత క్రికెటర్లను విదేశీ టీ20 లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే.
అంతసీన్ లేదు!
ఒకవేళ ఆటగాళ్లెవరైనా పాల్గొనాలని భావిస్తే మాత్రం బోర్డుతో సంబంధాలన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఫ్రాంఛైజీలు మాత్రం సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్‌లలో పెట్టుబడులు పెట్టినప్పటికీ ఐపీఎల్‌కు క్రేజ్ ముందు ఈ లీగ్‌లు పూర్తిగా తేలిపోతున్నాయి. నిజానికి టీమిండియా క్రికెటర్లు లేకుండా సౌదీ టీ20 లీగ్ ప్రవేశపెట్టినా ఆదరణ విషయంలో ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం ఉండదు.
చదవండి: ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ..
గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ..
Comments
Please login to add a commentAdd a comment