MS Dhoni Announcement About His Last T20 Match For CSK.. ఐపీఎల్–2021లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను విజేతగా నిలిపిన కెప్టెన్ కెప్టెన్ ధోని లీగ్ నుంచి తప్పుకోవడం లేదని స్పష్టమైంది. అతను కనీసం మరో సీజన్ జట్టు తరఫున ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున తాను ఆడే చివరి మ్యాచ్ వేదిక చెన్నైనే అవుతుందని ధోని వెల్లడించాడు. అయితే అది వచ్చే ఏడాదేనా లేక ఐదేళ్ల తర్వాతా అనేది చెప్పలేనని... పైగా ఐపీఎల్ కూడా ఏప్రిల్‌లో జరుగుతుంది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఇంకా చాలా సమయం ఉందని ధోని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని టీమ్ యాజమాన్యం ఇండియా సిమెంట్స్ శనివారం విజయోత్సవ వేడుకలను నిర్వహించింది.
చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్- న్యూజిలాండ్ సిరీస్ 'మీనింగ్‌లెస్'
ధోని మాలో ఒకడు: స్టాలిన్
కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే సీజన్లలో కూడా సీఎస్‌కేకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. ‘నన్ను ముఖ్యమంత్రి హోదాలో సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్ ఆహ్వానించారు. కానీ నేను ధోని ఫ్యాన్‌గా వచ్చాను. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి పెద్ద స్థాయికి ఎదిగిన ధోని అంటే నాన్నకు కూడా ఎంతో అభిమానం. అతను జార్ఖండ్ నుంచి వచ్చి ఉండవచ్చు. కానీ మా దృష్టిలో మాత్రం అతను తమిళనాడు ప్రజలలో ఒకడు’ అని స్టాలిన్ వ్యాఖ్యా నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ 2022 ఐపీఎల్ భారత్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు.
A promise from #Thala…#Anbuden awaiting… 💛🦁#WhistlePodu #Yellove pic.twitter.com/zGKvtRliOY
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 20, 2021
Comments
Please login to add a commentAdd a comment