సేమ్‌ సీన్‌ రిపీట్‌.. అప్పుడు కేకేఆర్‌, ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ | Same Scene Repeat IPL 2008 Vs WPL 2023 Matches | Sakshi
Sakshi News home page

WPL 2023: సేమ్‌ సీన్‌ రిపీట్‌.. అప్పుడు కేకేఆర్‌, ఇప్పుడు ముంబై

Published Sat, Mar 4 2023 10:46 PM | Last Updated on Sat, Mar 4 2023 10:56 PM

Same Scene Repeat IPL 2008 Vs WPL 2023 Matches  - Sakshi

మహిళల క్రికెట్‌లో తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023) ఆరంభం అదిరింది. గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోరు నమోదైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ వుమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇప్పటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్థసెంచరీతో మెరవగా.. అమెలియా కెర్‌, హేలీ మాథ్యూస్‌లు రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయింట్స్‌ దారుణ ఆటతీరును కనబరిచింది.

ఇది చూసిన తర్వాత ఒక విషయం గుర్తుకురాక మానదు. అదే 2008 తొలి ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌.  అప్పుడు కేకేఆర్‌, ఆర్‌సీబీ మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 73 బంతుల్లోనే 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 82 పరగులకే కుప్పకూలి 140 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. అజిత్‌ అగార్కర్‌ మూడు వికెట్లు తీశాడు. సేమ్‌ టూ సీన్‌ రిపీట్‌ అయిందంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement