ఐపీఎల్-15 సీజన్ టైటిల్ స్పాన్సర్‌గా వివో తప్పుకున్న విషయం తెలిసిందే. 2022లో జరగబోయే ఐపీఎల్‌కు భారత పారిశ్రామిక దిగ్గజం టాటా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. కాగా మరో ఐదు సంవత్సరాలకుగాను టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు టాటా కొత్త ప్లాన్‌ను బీసీసీఐ ముందు ఉంచిన్నట్లు సమాచారం.
సానుకూలంగా బీసీసీఐ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో దీర్ఘకాలిక అనుబంధం కోసం టాటా గ్రూప్స్ చేసిన అభ్యర్థనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సానుకూలంగా పరిగణించినట్లు సమాచారం. ఈ టైటిట్ స్పాన్సర్‌షిప్‌ను ‘రైట్-టు-మ్యాచ్’ ప్రతిపాదికన సొంతం చేసుకోవాలని టాటా గ్రూప్స్ చూస్తోన్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదించింది. ఐపీఎల్-2022, 2023తో పాటుగా మరో ఐదేళ్లపాటు అధిక బిడ్‌తో (2024-28) టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను టాటా గ్రూప్స్ కైవసం చేసుకోనేందుకు ప్రణాళికలను వేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..మరో ఐదేళ్ల పాటు అసోసియేషన్ కోసం టాటా చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటే, 2024-28గాను టైటిల్ స్పాన్సర్ హక్కులను ‘రైట్-టు-మ్యాచ్’ కింద బీసీసీఐ స్పాన్సర్‌షిప్‌ను టాటాకు ఇచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై టాటా గ్రూప్స్‌ను ప్రశ్నించగా దీనిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఫ్రాంచైజీలకు రైట్-టు-మ్యాచ్ కార్డు
ఐపీఎల్ వేలంలో ఒక ఆకర్షణీయమైన అంశం రైట్-టు-మ్యాచ్’ కార్డ్. సింపుల్‌గా ఆర్‌టీఎం కార్డ్‌గా పిలుస్తారు. ఈ ఆర్‌టీఎం కార్డుతో సదరు ఫ్రాంచైజీ మునుపటి ఎడిషన్‌లో తమ కోసం ఆడిన రిటైన్ చేయని ప్లేయర్‌ను వచ్చే వేలంలో ఇతర ఫ్రాంచైజీలు ఇచ్చే అత్యధిక బిడ్డింగ్ మొత్తాన్ని చెల్లించి సదరు ప్లేయర్‌ను మళ్లీ రిటైన్ చేసుకోవచ్చును. కాగా రాబోయే IPL 2022 మెగా వేలం కోసం రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ వినియోగాన్ని రద్దు చేసింది. గతంలో ఆర్టీఎం కార్డ్ ప్రతిపాదికన డీఎల్‌ఎఫ్ ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ను కోరగా బీసీసీఐ అప్పట్లో నిరాకరించింది.
బీసీసీఐకు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్..!
వివో ఐపీఎల్-15 తప్పుకోవడంతో బీసీసీఐకు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ వచ్చేశాయి.టాటా స్పాన్సర్‌గా రావడంతో బీసీసీఐకు కాసుల వర్షం కురిసింది. ఒకేసారి రెండు సంస్థల నుంచి ఆదాయం వస్తుండటంతో బోర్డు మరోసారి జాక్‌పాట్ కొట్టింది. టాటా గ్రూప్ రెండేళ్ల కోసం రూ. 670 కోట్లు (ఏడాదికి రూ. 335 కోట్లు) చెల్లిస్తుంది. అయితే 2022లో రూ. 547 కోట్లు, 2023లో రూ. 577 కోట్లు చెల్లిస్తామని ‘వివో’ గతంలో ఒప్పందం (రెండేళ్లకు మొత్తం రూ. 1,124 కోట్లు) కుదుర్చుకుంది.
చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవలు ఉచితం..!
Comments
Please login to add a commentAdd a comment