ముంబై: ఐపీఎల్ 14వ సీజన్(2021)కు సంబంధించి మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్దమవుతుంది. ఈ మేరకు ఐపీఎల్ తన ట్విటర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఐపీఎల్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. లసిత్ మలింగ, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హర్భజన్ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేయడంతో 2021 ఐపీఎల్ సీజన్‌కు వేలంలోకి రానున్నారు. చదవండి: ఐసీసీ సరికొత్త అవార్డు.. పరిశీలనలో వారి పేర్లు!
కాగా ఆయా ఫ్రాంచైజీలు మొత్తం 139 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. 57 మందిని రిలీజ్ చేశాయి. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా జరిగినా ఈ ఏడాది మాత్రం భారత్‌లోనే నిర్వహించడానికి బీసీసీఐ భావిస్తుంది. కాగా ఐపీఎల్ 14వ సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఏప్రిల్- మే నెలల్లో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ తేదీలతో పాటు ఎక్కడ నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌కు 50 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన వేళ ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ
🚨ALERT🚨: IPL 2021 Player Auction on 18th February🗓️
— IndianPremierLeague (@IPL) January 27, 2021
Venue 📍: Chennai
How excited are you for this year's Player Auction? 😎👍
Set your reminder folks 🕰️ pic.twitter.com/xCnUDdGJCa
Comments
Please login to add a commentAdd a comment