ముంబై: రాజస్తాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినట్లు బుధవారం జట్టు యాజమాన్యం స్పస్టం చేసింది. ఐపీఎల్ 13వ సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా విఫలం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. ఐపీఎల్ 2021కి సంబంధించి వేలానికి సిద్ధమైన ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సీజన్‌లో విఫలమైన స్టీవ్ స్మిత్‌ను వదులుకుంటున్నట్లు ఆర్‌ఆర్ ఇప్పటికే ప్రకటించింది.స్మిత్ సారధ్యంలోని ఆర్‌ఆర్ 14 మ్యాచ్‌లకు గానూ కేవలం ఆరు విజయాలు మాత్రమే సాధించి.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.చదవండి: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్
అటు కెప్టెన్‌గా విఫలమైన స్మిత్ ఇటు బ్యాటింగ్‌లోనూ అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. గత సీజన్‌లో మొత్తం14 మ్యాచ్‌లాడిన స్మిత్ 311 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు స్మిత్ స్థానంలో సంజూ శాంసన్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపికచేయడం పట్ల ఆసక్తి నెలకొంది. వాస్తవానికి సంజూ శాంసన్ ఐపీఎల్ 13వ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచ్‌ల్లో 375 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేసి స్మిత్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఈ కారణంగా కూడా స్మిత్‌పై రాయల్స్ వేటు వేసినట్లు రూమర్లు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment