క్రీడా ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంచలనాలకు కేంద్ర బింధువుగా మారింది. 15 ఏళ్ల కాలంలో ప్రపంచంలో మేటి లీగ్‌లకు ధీటుగా నిలిచి అత్యంత ప్రజాధరణ పొందిన లీగ్‌గా అవతరించిన క్యాష్ రిచ్ లీగ్.. తాజాగా మీడియా హక్కుల పరంగా మరో రికార్డును బద్దలు కొట్టింది. విశ్వవ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్.. విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్‌గా నిలిచింది.
ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్ ఈపీఎల్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. ఈపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా, ఐపీఎల్‌లో అది రూ. 107.5 కోట్లకు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు) చేరుకుంది. గతంలో ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండేది. తాజాగా జరిగిన మీడియా హక్కుల వేలం ద్వారా ఐపీఎల్ విలువ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది.
టీవీ ప్రసారాలు (రూ. 57.5 కోట్లు), డిజిటల్ (రూ. 50 కోట్లు) హక్కుల ద్వారా ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం మ్యాచ్ విలువ పరంగా అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ అయిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) ఐపీఎల్ కంటే ముందుంది. ఎన్ఎఫ్ఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు (17 యూఎస్ మిలియన్ డాలర్లు)గా ఉంది.
ఇదిలా ఉంటే, గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాలో రూ. 44,075 కోట్లు చేరాయి. లీగ్ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే (ఏ, బీ) ఇప్పటి వరకు ఇంత ఆదాయం సమకూరింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్‌కు సంబంధించి టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్ (రూ.23,575 కోట్లు) దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది.
చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్–18..!
Comments
Please login to add a commentAdd a comment