IPL media rights
-
ముగిసిన ఐపీఎల్ వేలం.. 'స్టార్' చేతికి టీవీ ప్రసార హక్కులు
గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్‌వర్క్‌తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ పైచేయి సాధించింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించుకుంది. 2018-22 సీజన్లో స్టార్ నెట్వర్క్ తొలిసారి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను దక్కించుకుంది. మొత్తంగా ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి 48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్‌లో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా స్టార్ నెట్వర్క్ భారీ మొత్తం చెల్లించి మీడియా హక్కులను సొంతం చేసుకుంది. చదవండి: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్ -
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్
క్రీడా ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంచలనాలకు కేంద్ర బింధువుగా మారింది. 15 ఏళ్ల కాలంలో ప్రపంచంలో మేటి లీగ్‌లకు ధీటుగా నిలిచి అత్యంత ప్రజాధరణ పొందిన లీగ్‌గా అవతరించిన క్యాష్ రిచ్ లీగ్.. తాజాగా మీడియా హక్కుల పరంగా మరో రికార్డును బద్దలు కొట్టింది. విశ్వవ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్.. విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్‌గా నిలిచింది. ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్ ఈపీఎల్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. ఈపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా, ఐపీఎల్లో అది రూ. 107.5 కోట్లకు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు) చేరుకుంది. గతంలో ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండేది. తాజాగా జరిగిన మీడియా హక్కుల వేలం ద్వారా ఐపీఎల్ విలువ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. టీవీ ప్రసారాలు (రూ. 57.5 కోట్లు), డిజిటల్ (రూ. 50 కోట్లు) హక్కుల ద్వారా ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం మ్యాచ్ విలువ పరంగా అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ అయిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఐపీఎల్ కంటే ముందుంది. ఎన్ఎఫ్ఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు (17 యూఎస్ మిలియన్ డాలర్లు)గా ఉంది. ఇదిలా ఉంటే, గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాలో రూ. 44,075 కోట్లు చేరాయి. లీగ్ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే (ఏ, బీ) ఇప్పటి వరకు ఇంత ఆదాయం సమకూరింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్‌కు సంబంధించి టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ (రూ.23,575 కోట్లు) దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది. చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్–18..! -
IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్–18..!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్... షేర్ మార్కెట్... గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో ఏ రంగంలోనైనా ఇంత విలువ ఒక్కసారిగా పెరిగిందా అనేది సందేహమే! ఆరంభంలో మ్యాచ్‌కు రూ. 13.6 కోట్లు... పదేళ్ల తర్వాత మ్యాచ్‌కు రూ. 55 కోట్లు... మరో ఐదేళ్ల తర్వాత చూస్తే మ్యాచ్‌కు రూ.107.5 కోట్లు! క్రికెట్ అభిమానులకు అమిత వినోదాన్ని అందిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు అంతులేని ఆదాయం తెచ్చి పెడుతూ కొత్త రికార్డులు కొల్లగొట్టింది. ఫలితంగా బీసీసీఐ ఆర్జనలో మరో అతి పెద్ద అడుగు పడింది ... ఈ–వేలం ద్వారా లీగ్ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే ఇప్పటి వరకు బోర్డు ఖాతాలో రూ. 44,075 కోట్లు చేరాయి. మూడో ప్యాకేజీ వేలం ఇంకా కొనసాగుతుండగా, నాలుగో ప్యాకేజీ నుంచి కూడా తుది మొత్తం నేడు ఖరారవుతుంది. అయితే హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారనే దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. టీవీ హక్కుల కోసం సోనీ, డిస్నీ స్టార్ తీవ్రంగా పోటీ పడగా... డిజిటల్ హక్కులు రిలయన్స్ సంస్థకు చెందిన ‘వయాకామ్–18’కు సొంతమైనట్లు వినిపిస్తోంది. ప్యాకేజీ ‘ఎ’: భారత ఉపఖండంలో టీవీ చానల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు (మొత్తం రూ. 23,575 కోట్లు; ఒక్కో మ్యాచ్‌కు రూ. 57.5 కోట్లు). ప్యాకేజీ ‘బి’: భారత ఉపఖండంలో డిజిటల్ (ఆన్లైన్) ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు(మొత్తం రూ. 20,500 కోట్లు; మ్యాచ్‌కు రూ. 50 కోట్లు). ప్యాకేజీ ‘సి’: ఎంపిక చేసిన మ్యాచ్‌ల నాన్ ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ హక్కులు. ప్యాకేజీ ‘బి’ గెలుచుకున్న సంస్థతో పాటు మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారం చేసుకునే హక్కు (ఇప్పటికి సుమారు రూ. 2000 కోట్లు లభించాయి. వేలం నేడు కూడా కొనసాగుతుంది. ఒక్కో మ్యాచ్‌కు రూ. 18.4 కోట్లు చెల్లించే అవకాశం). ప్యాకేజీ ‘డి’: ఉపఖండం మినహా ఇతర దేశాల టీవీ, డిజిటల్ హక్కులు (వేలం జరగాల్సి ఉంది) ఐదేళ్లలో జరిగే మొత్తం ఐపీఎల్ మ్యాచ్‌లు 410 నాన్ ఎక్స్‌క్లూజివ్ మ్యాచ్‌ల సంఖ్య (ప్యాకేజీ ‘సి’): 18+20+24 (నాన్ ఎక్స్‌క్లూజివ్ మ్యాచ్‌లు అంటే... ఆదివారాల సాయంత్రపు మ్యాచ్‌లు+ లీగ్ ప్రారంభ మ్యాచ్+ప్లే ఆఫ్‌లు +ఫైనల్). చదవండి: Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో! -
ఐపీఎల్ హక్కుల కోసం 18 కంపెనీలు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హక్కుల కోసం ప్రఖ్యాత సంస్థలన్నీ పోటీ పడుతున్నాయి. హక్కుల కోసం లభిస్తున్న స్పందన పట్ల బీసీసీఐ ఉబ్బితబ్బిబ్బవుతోంది. తాజాగా ఈ జాబితాలో సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్ కూడా చేరడం విశేషం. ఐపీఎల్ డిజిటల్ రైట్స్ కోసం ఈ సంస్థలు టెండరు డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయని బోర్డు ప్రకటించింది. ‘భారత క్రికెట్లో ఇది చారిత్రాత్మక క్షణం. ప్రముఖ సంస్థలు హక్కుల కోసం ఆసక్తి చూపించడం ఐపీఎల్ గొప్పతనాన్ని, దానిపై వారి నమ్మకాన్ని సూచిస్తోంది’ అని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. 2018 ఏడాదితో మొదలు పెట్టి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను పదేళ్ల కోసం, డిజిటల్, మొబైల్ హక్కులను ఐదేళ్ల కాలానికి ఇవ్వనున్నారు. అక్టోబర్ 18 వరకు టెండర్లు స్వీకరించి అక్టోబర్ 25న ఎంపికై న బిడ్డర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటి వరకు మూడు వేర్వేరు తరహాల హక్కులకు సంబంధించి మొత్తం 18 సంస్థలు ఇప్పటి వరకు పోటీలో నిలిచాయి. టీవీ ప్రసారం కోసం సోనీ, స్టార్ గ్రూప్‌ల మధ్య భారీ పోటీ నెలకొని ఉండగా... ఇతర హక్కుల కోసం ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో పాటు అమెజాన్, రిలయన్స జియో, టైమ్స్ ఇంటర్నెట్, గల్ఫ్ డీటీహెచ్, ఈఎస్పీఎన్, జీ తదితర కంపెనీలు పోటీ పడుతున్నాయి.