సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడలేకపోయానని యువ సంచలనం బాసిల్ థంపి అన్నాడు. శ్రీలంకతో త్వరలో జరగనున్న ట్వంటీ20 సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో థంపి ఉన్నాడు. భారత జట్టుకు ఎంపికయ్యానని తెలియగానే ఎంతో సంతోషించాను. నిజంగా అది గర్వించే సమయమన్నాడు.
బౌలర్ థంపి ఇంకా ఏమన్నాడంటే.. టీమిండియాకు ఎంపికయ్యానని కేరళ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జయేష్ జార్జ్ నాకు చెప్పగానే చాలా గర్వంగా అనిపించింది. ప్రతి క్రీడాకారుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటారు. ప్రస్తుతం నాకు ఛాన్స్ దొరికింది. అయితే ధోనీ లాంటి కెప్టెన్ నేతృత్వంలో ఆడాలని ఆశగాఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం. నేను బౌలింగ్ చేస్తుంటేనైనా.. నా బంతులకు ధోనీ కీపింగ్ చేయడం గౌరవంగా భావిస్తాను. ధోనీతో కలిసి ఆడుతూ విలువైన సలహాలు, సూచనలు సిద్ధంగా ఉన్నానని' వివరించాడు. ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన థంపి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment