Basil Thampi
-
‘థంపికి అందుకే బౌలింగ్ ఇచ్చాం’
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ రెండు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే విజయానికి దగ్గరగా వెళుతున్న సన్‌రైజర్స్‌కు బాసిల్ థంపి వేసిన ఓవర్ భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్న థంపి సన్‌రైజర్స్‌కు విజయాన్ని దూరం చేశాడు. అయితే ఖలీల్‌ను కాదని థంపికి బంతినివ్వడంపై సారథి విలియమ్సన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన విలియమ్సన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. రిషభ్ పంత్ ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ కావడంతో కుడిచేతివాటం పేసర్ సరైన ఆప్షన్ అని భావించడంతోనే థంపికి అవకాశం ఇచ్చానని తెలిపాడు. అయితే ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. అతడిని ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ తమ ప్రణాళికలు అమలు కాకుండా చేశాడని పేర్కొన్నాడు. ‘మేం నిర్దేశించింది మంచి లక్ష్యమే. ఈ పిచ్‌పై ఎంత కావాలో అంత లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచాం. అయితే ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సమష్టిగా ఆడారు. ఈ విజయానికి వాళ్లు పూర్తి అర్హులు. ఢిల్లీ ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ కలిసికట్టుగా రాణించారు. అయితే మాకు వచ్చిన అవకాశాలను జారవిడిచాం. ఈ మ్యాచ్‌లో వందశాతం రాణించామని చెప్పడం లేదు. ఎందుకంటే ఇలాంటి కీలకమైన మ్యాచ్‌ల్లో ప్రతీ ఆటగాడు రాణించాల్సి ఉంటుంది. కానీ, మా జట్టులో అలా జరగలేదు. డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో లేకుండా బరిలో దిగిన మ్యాచ్‌ల్లోనూ బాగానే ఆడాం. అయితే, చాలా మ్యాచ్‌ల్లో విజయతీరాలకు వచ్చి ఓడిపోయాం. వచ్చే సీజన్లో మరింత రాణించేందుకు కృషి చేస్తాం’ అని విలియమ్సన్ వివరించాడు. -
థంపి.. ఏం బౌలింగ్రా అది?
హైదరాబాద్: ‘బాసిల్ థంపి’ ఈ పేరును సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోరు. చేతుల దాకా వచ్చిన విజయాన్ని తన ఒక్క ఓవర్‌తో ఈ సన్‌రైజర్స్ పేసర్ దూరం చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా థంపి వేసిన 18వ ఓవర్ అప్పటివరకు విజయం దిశగా సాగుతున్న సన్‌రైజర్స్ గతి మార్చింది. దీంతో థంపిని టార్గెట్ చేస్తూ సన్‌రైజర్స్ అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘నీకెవడ్రా బౌలింగ్ నేర్పింది’అంటూ ఓ అభిమాని మండిపడగా..‘నాకు బయటకనిపించు తాట తీస్తా’, ‘ఢిల్లీ గెలవలేదు.. థంపి ఓడించాడు’, ‘థంపి ఏం బౌలింగ్రా అది’అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పోస్ట్ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి అదిరే ఆరంభం లభించినప్పటికీ.. ఖలీల్, రషీద్‌ఖాన్‌లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఢిల్లీని కష్టాల్లోకి నెట్టారు. చివర్లో మహ్మద్ నబి, భువనేశ్వర్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీకి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజులో పంత్ మినహా బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో సన్‌రైజర్స్ శిబిరంలో ఆనందం మొదలైంది. ఈ దశలో సారథి విలియమ్సన్ ఖలీల్‌కు రెండు ఓవర్లు వేసే అవకాశం ఉన్నా థంపికి బంతిని అప్పగించాడు. థంపి వేసని ఆ ఓవరల్లో పంత్ రెచ్చిపోయాడు. వరుస బౌండరీలతో చెలరేగడంతో ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీకి చివరి రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులే అవసరమవడంతో సులువుగా విజయం సాధించింది. అయితే థంపికి కాకుండా ఖలీల్‌కు బౌలింగ్ అవకాశం ఇస్తే సమీకరణాలు వేరేగా ఉండేవని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో థంపిపై సన్‌రైజర్స్ అభిమానులు గరంగరంగా ఉన్నారు. -
రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ తొలిసారిగా..
తిరువనంతపురం: కేరళ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ చరిత్రలోనే కేరళ జట్టు తొలిసారి సెమిఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకు ఆజట్టు క్వార్టర్ ఫైనల్ వరకు చేరడమే అత్యుత్తమం. గురువారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ జట్టు 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టును కేరళ బౌలర్లు బెంబేలెత్తించారు. కేరళ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బసిల్ థంపి(5/27), సందీ వారియర్(4/30)లు చెలరేగడంతో గుజరాత్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 31.3 ఓవర్లకు 81 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ తమ చివరి 6 వికెట్లను 24 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం. కేరళ : 185/9, 171 ఆలౌట్ గుజరాత్: 162 ఆలౌట్, 81 ఆలౌట్ -
సన్‌రైజర్స్ బౌలర్ చెత్త రికార్డు!
బెంగళూరు: అద్భుత బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్లే ఆఫ్ చేరిన సన్‌రైజర్స్ గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది. తమ బలమైన బౌలింగ్, ఫీల్డింగ్‌లోనే విఫలమై ఈ సీజన్లో నాలుగో ఓటమిని చవిచూసింది. ఇక సన్ యువబౌలర్ బాసిల్ థంపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. సన్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన థంపి.. వేసిన నాలుగు ఓవర్లలో 19,18,14,19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఇప్పటికి వరకు ఇషాంత్ శర్మ పేరు మీద ఉన్న ఈ చెత్తరికార్డును బ్రేక్ చేశాడు. 2013 సీజన్లో ఇషాంత్ 66 పరుగులిచ్చాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా తాజాగా థంపి అధిగమించాడు. ఇషాంత్ తర్వాత ఉమేశ్ యాదవ్ (0/65), సందీప్ శర్మ(1/65), వరుణ్ ఆరోన్ (2/63), అశోక్ దిండా(0/63)లు అత్యధిక పరుగులిచ్చిన జాబితాలో ఉన్నారు. ఏబీ డివిలియర్స్ (39 బంతుల్లో 69; 12 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (34 బంతుల్లో 65; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత భాగస్వామ్యం, గ్రాండ్‌హోమ్ (17 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్ (8 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)ల మెరుపు ఇన్నింగ్స్‌లతో బెంగళూరు 218 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ లక్ష్య చేధనలో ఏమాత్రం తడబడని సన్‌రైజర్స్ చివరి వరకు పోరాడి ఆకట్టుకుంది. కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), మనీశ్ పాండే (38 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడవరకు పోరాడినా విజయం బెంగళూరునే వరించింది. -
బ్యాట్స్‌మెన్‌ను షేక్ చేస్తున్న ఆరెంజ్ ఆర్మీ బౌలర్స్
-
ధోనీ కెప్టెన్సీలో ఆడలేకపోయాను.. కానీ!
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడలేకపోయానని యువ సంచలనం బాసిల్ థంపి అన్నాడు. శ్రీలంకతో త్వరలో జరగనున్న ట్వంటీ20 సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో థంపి ఉన్నాడు. భారత జట్టుకు ఎంపికయ్యానని తెలియగానే ఎంతో సంతోషించాను. నిజంగా అది గర్వించే సమయమన్నాడు. బౌలర్ థంపి ఇంకా ఏమన్నాడంటే.. టీమిండియాకు ఎంపికయ్యానని కేరళ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జయేష్ జార్జ్ నాకు చెప్పగానే చాలా గర్వంగా అనిపించింది. ప్రతి క్రీడాకారుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటారు. ప్రస్తుతం నాకు ఛాన్స్ దొరికింది. అయితే ధోనీ లాంటి కెప్టెన్ నేతృత్వంలో ఆడాలని ఆశగాఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం. నేను బౌలింగ్ చేస్తుంటేనైనా.. నా బంతులకు ధోనీ కీపింగ్ చేయడం గౌరవంగా భావిస్తాను. ధోనీతో కలిసి ఆడుతూ విలువైన సలహాలు, సూచనలు సిద్ధంగా ఉన్నానని' వివరించాడు. ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన థంపి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
భారత యువబౌలర్పై దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు
సిడ్నీ: భారత యువబౌలర్ బసీల్ థంపీని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ పొగడ్తలతో ముంచెత్తాడు. భారత్‌లో యువబౌలర్స్ సత్తా చాటుతున్నారని, భవిష్యత్తులో భారత్‌కు బలమైన పేస్ బౌలర్లు అందుబాటులోకి వస్తారని థంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఎమ్ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్, క్రికెట్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెక్‌గ్రాత్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. మెక్‌గ్రాత్ డైరెక్టర్‌గా ఉన్న ఎమ్ఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన ముగ్గురు యువబౌలర్లు బసీల్ థంపీ, అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరిలు దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యారు. ముగ్గురు యువబౌలర్లు ఎంపికైనప్పటికే మెక్‌గ్రాత్ బసీల్ థంపీపైనే ప్రశంసలు కురిపించాడం విశేషం. డైరెక్టరైన మెక్‌గ్రాత్ శిక్షణలో భారత యువ బౌలర్లు శిక్షణ పొందారు. అకాడమీ శిక్షణలో రాటు దేలిన థంపీ ఐపీఎల్లో సత్తాచాటి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలిచకున్నాడని గుర్తు చేస్తూ కొనియాడాడు. ఇక ఈ అకాడమీలో ట్రైనీగా చేరి డైరెక్టర్‌గా సేవలందించడం సంతోషంగా ఉందని మెక్ గ్రాత్ తెలిపాడు. రాబోయే రోజుల్లో మరింత మంది పేస్ బౌలర్లను భారత్‌కు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాల్లో యువ బౌలర్లు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. బసీల్ థంపీ ఐపీఎల్-10 గుజరాత్ లయన్స్ తరుపున 11 వికెట్లు పడగొట్టి దిగ్గజ ఆటగాళ్ల మన్ననలు పొందాడు. -
త్వరలో ఇండియా టీమ్ కు సెలక్టు అవుతాడు..
గేల్ ను అవుట్ చేసిన ఆ క్షణం నా జీవితంలో మరిచిపోలేని ఒక అనుభూతి అని గుజరాత్ లైయన్స్ యంగ్ స్టార్ బాసిల్ తంపి అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ ల మధ్య మంగళవారం రాజ్ కోట్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్ బాసిల్ తంపి బౌలింగ్ లో క్రిస్ గేల్ అవుటయ్యాడు. అంతేకాక బౌలింగ్ లో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. సుమారుగా పదకొండు డాట్ బాల్స్ వేశాడు. బుధవారం వెస్టిండీస్ వరల్డ్ టీ-20 విజేత, గుజరాత్ ఆల్ రౌండర్ బ్రావో మాట్లాడుతూ.. తన ఆటతీరుతో నన్ను కూడా అకట్టుకున్నాడని తెలిపాడు. అంతేకాక తంపి ముందు ముందు ఇండియా టీమ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తాడని తన విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాక చాలా ప్రతిభ ఉన్న యంగ్ స్టార్ అని కోనియాడాడు. ఒక సంవత్సరంలో టీమ్ ఇండియా తరపున ఆడటానికి అవకాశం పోందుతాడని చెప్పుకోచ్చాడు. దూకుడుగా ఆడుతున్న గేల్ ను తంపీ తన అద్భుతమైన డెలివరి తో కట్టడి చేశాడని బ్రావో చెప్పాడు. అతను నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నాడు. 140పైగా స్పీడ్ తో బౌలింగ్ చేసే ఆటగాళ్లు ఇండియా టీమ్ లో ఉన్నారు. ఫేసర్ ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షామి,సరసన తాంపి కూడా చేరాడు. వారి నైపుణ్యం చాలా బాగుందని కోనియాడాడు. నా మనసు పూర్తిగా తాంపి కి ఆశీర్వాదలు తెలుపుతున్న, భవిష్యత్తులో ఇంకా రాణించాలని కోరుకుంటునాని అన్నాడు. 23 సంవత్సరాల యంగ్ స్టార్ కు సలహాలు, మెలకువలు చెప్పడానికి నేను రెడీ అని చెప్పోకోచ్చాడు. నేను అతనితో చాలా క్లోజ్ గా ఉంటాను. అతను గత సీజన్లో 15 మ్యాచ్ లో 17 వికెట్లు తీసుకున్నాడని బ్రావో గుర్తు చేశాడు. -
థంపి.. త్వరలోనే టీమిండియాకు ఆడతాడు
కేరళకు చెందిన యువ ఫాస్ట్‌బౌలర్ బాసిల్ థంపి మీద వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసలు కురిపించాడు. త్వరలోనే థంపి టీమిండియాలో స్థానం సంపాదించుకుంటాడని చెప్పాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ పదో సీజన్లో బ్రావో, థంపి ఇద్దరూ గుజరాత్ లయన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. బాసిల్ థంపి చాలా టాలెంట్ ఉన్న కుర్రాడని, దాదాపు ఒక ఏడాది లోపే అతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తుందని తనకు నమ్మకం ఉందని బ్రావో అన్నాడు. అతడికి మంచి టాలెంట్‌తో పాటు మంచి హృదయం, పేస్, నైపుణ్యం అన్నీ ఉన్నాయని, ఎప్పుడూ కూడా నేర్చుకోవాలని చూస్తుంటాడని చెప్పాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో వరుసపెట్టి యార్కర్లు వేసి అందరినీ థంపి బాగా ఇంప్రెస్ చేశాడు. గుజరాత్ లయన్స్ బౌలర్లందరినీ వరుసపెట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ ఊచకోత కోస్తుంటే.. థంపి మాత్రం కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అతడు వేసిన వాటిలో 11 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆర్సీబీ తరఫున 38 బంతుల్లోనే 77 పరుగులు చేసిన విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో మొట్టమొదటే పెద్ద వికెట్‌ను థంపి తీసినట్లయింది. ముందుగా యార్కర్ వేసి ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. తొడ కండరాల గాయంతో బాధపడి.. ఇప్పుడే కోలుకుంటున్న బ్రావో వెంటనే థంపి వద్దకు వెళ్లి అభినందించాడు. థంపి ఎప్పుడూ సరైన ప్రశ్నలే అడుగుతుంటాడని, ఇలాంటి వాళ్లు ఉంటే భారత క్రికెట్ సరైన దిశలో వెళ్తుందని బ్రావో అన్నాడు. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, థంపి లాంటివాళ్లు బౌలింగ్ చేయడం చాలా బాగుందని, వాళ్లకు తన హృదయపూర్వక అభినందనలని చెప్పాడు. ఇప్పుడు ఇంకా థంపి నేర్చుకునే దశలో ఉన్నాడని, మరిన్ని గేమ్స్ ఆడి మరింత అనుభవం పొందితే బాగా రాటుతేలుతాడని తెలిపాడు. గత సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు తీసిన బ్రావో.. ఈసారి లేకపోవడం గుజరాత్‌ను ఇబ్బంది పెడుతోంది.