త్వరలో ఇండియా టీమ్ కు సెలక్టు అవుతాడు.. | basil thampi is play to the indian team in feature | Sakshi
Sakshi News home page

త్వరలో ఇండియా టీమ్ కు సెలక్టు అవుతాడు..

Published Thu, Apr 20 2017 3:34 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

basil thampi is play to the indian team in feature

 గేల్ ను అవుట్ చేసిన ఆ క్షణం నా జీవితంలో  మరిచిపోలేని ఒక అనుభూతి అని గుజరాత్ లైయన్స్ యంగ్ స్టార్ బాసిల్ తంపి అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్  లయన్స్ ల మధ్య మంగళవారం రాజ్ కోట్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్ బాసిల్ తంపి బౌలింగ్ లో క్రిస్ గేల్  అవుటయ్యాడు. అంతేకాక  బౌలింగ్ లో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. సుమారుగా పదకొండు డాట్ బాల్స్ వేశాడు. బుధవారం వెస్టిండీస్ వరల్డ్ టీ-20 విజేత, గుజరాత్ ఆల్ రౌండర్ బ్రావో  మాట్లాడుతూ.. తన ఆటతీరుతో నన్ను కూడా అకట్టుకున్నాడని తెలిపాడు.  

అంతేకాక తంపి ముందు ముందు ఇండియా టీమ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తాడని తన విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాక చాలా ప్రతిభ ఉన్న యంగ్ స్టార్ అని కోనియాడాడు. ఒక సంవత్సరంలో టీమ్ ఇండియా తరపున ఆడటానికి అవకాశం పోందుతాడని చెప్పుకోచ్చాడు. దూకుడుగా ఆడుతున్న గేల్ ను తంపీ తన అద్భుతమైన డెలివరి తో కట్టడి చేశాడని బ్రావో చెప్పాడు. అతను నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నాడు. 140పైగా స్పీడ్ తో బౌలింగ్ చేసే ఆటగాళ్లు ఇండియా టీమ్ లో ఉన్నారు. ఫేసర్ ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షామి,సరసన తాంపి కూడా చేరాడు.

వారి నైపుణ్యం చాలా బాగుందని  కోనియాడాడు. నా మనసు పూర్తిగా తాంపి కి ఆశీర్వాదలు తెలుపుతున్న, భవిష్యత్తులో ఇంకా రాణించాలని కోరుకుంటునాని అన్నాడు. 23 సంవత్సరాల యంగ్ స్టార్ కు సలహాలు, మెలకువలు చెప్పడానికి నేను రెడీ అని చెప్పోకోచ్చాడు. నేను అతనితో చాలా  క్లోజ్ గా ఉంటాను. అతను గత సీజన్లో 15 మ్యాచ్ లో 17 వికెట్లు తీసుకున్నాడని బ్రావో గుర్తు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement