'సామ్‌'తో ధోనీ డ్యాన్స్‌ చూస్తే ఫిదా కావాల్సిందే! | MS Dhoni dog dances to his moves | Sakshi
Sakshi News home page

'సామ్‌'తో ధోనీ డ్యాన్స్‌ చూస్తే ఫిదా కావాల్సిందే!

Published Fri, Oct 6 2017 9:20 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

MS Dhoni dog dances to his moves - Sakshi

మహేంద్రసింగ్‌ ధోనీ మంచి 'పెట్‌ లవర్‌'. ఈ విషయాన్ని ఆయనే చెప్తారు. తనకు కుక్కలంటే ప్రాణమని.. ధోనీ సోషల్‌ మీడియా అకౌంట్‌ చూసినా ఈ విషయం స్పష్టమవుతుంది. కుక్కలపై ధోనీ చూపే ప్రేమ తెలిసిపోతుంది. ధోనీకి 'సామ్‌' అనే పెంపుడు కుక్క ఉంది. 'సామ్‌'తో కలిసి ధోనీ డ్యాన్స్‌ చేస్తున్న క్యూట్‌ వీడియోను తాజాగా ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. ఈ వీడియోలో ధోనీ ఎలా చేస్తే.. అలాగే సామ్‌ అనుకరించడం.. ఆయన ప్రేమగా దానిని అక్కున చేర్చుకోవడం చూడొచ్చు. ఈ క్యూట్‌ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ధోనీ ప్రస్తుతం రాంచీలో ఉన్నాడు.  ఈ నెల 13వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ-20 సిరీస్‌లో పాల్గొనేముందు దొరికిన తీరిక సమయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ధోనీ ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్‌ 4-1తేడాతో సిరీస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్‌ విజయంలో ధోనీ కూడా కీలక పాత్ర పోషించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement