ఆసీస్తో తొలిటెస్టుకు ధోనీ దూరం
ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ధోనీ కుడి బొటనవేలికి గాయం కావడంతో అతనికి విశ్రాంతినిచ్చారు. మహీ స్థానంలో కీపార్ నమన్ ఓజాకు అవకాశం దక్కింది.
రెండో టెస్టుకు ధోనీ అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో పాల్గొనేందుకు భారత్ జట్టు ఆ దేశానికి బయల్దేరింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని 18 మంది సభ్యులతో కూడిన జట్టు వెళ్లింది. భారత్, ఆసీస్ల మధ్య వచ్చే నెల 4 నుంచి బ్రిస్బేన్లో తొలి టెస్టు జరగనుంది.