సెంచరీకి చేరువలో రూట్
రాజ్కోట్: టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. బుధవారం ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుక్ సేన టీ విరామానికి తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. జో రూట్ (93 బ్యాటింగ్) సెంచరీకి చేరువకాగా, మొయిన్ అలీ (48) క్రీజులో ఉన్నాడు. హమీద్ 31, కుక్ 21, డకెట్ 13 పరుగులు చేశారు.
తొలి సెషన్లో రాణించిన భారత బౌలర్లు తర్వాత తేలిపోయారు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 102/3. రెండో సెషన్లో భారత బౌలర్లు విఫలమవడంతో ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా 200 స్కోరు దాటింది. భారత స్పిన్నర్లు అశ్విర్ రెండు, జడేజా ఓ వికెట్ తీశారు.