
మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం
హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు శనివారం రాత్రి ఘన సన్మానం జరిగింది. మాజీ రంజీ క్రికెటర్ రాజేశ్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంబజార్‌లోని మాన్‌సింగ్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మిథాలీ రాజ్‌తో పాటు నగరానికి చెందిన టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను కూడా సత్కరించారు.
దినేశ్ మాన్‌సింగ్ మిథాలీ రాజ్‌కు వెండి బ్యాట్‌ను బహుకరించగా, నక్మల్ గెహ్లాట్ ఆమెకు బంగారు గొలుసును అందజేశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరిఫ్, కోచ్ ఆర్. మూర్తి, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, అంతర్జాతీయ బాడీబిల్డర్ మోతేషామ్ అలీ తదితరులు పాల్గొన్నారు.