
సాక్షి, స్పోర్ట్స్ : టెక్నాలజీ ఆటలో కూడా ఓ భాగమైంది. భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన క్రికెట్‌లో మాత్రం దీని ప్రభావం మరింత ఎక్కువే. ఒకప్పుడు తమ అభిప్రాయాలు తెలియజేయాలంటే.. ఆటగాళ్లు మీడియా ముందుకు రావల్సిందే. సోషల్‌మీడియా వచ్చిన తర్వాత ఒక్క ట్వీట్, పోస్ట్‌లతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇలా క్రికెటర్లు తమ అభిమానులకు మరింత చేరువయ్యేలా చేసింది.. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్. ప్రతి విషయాన్ని ఒక్క ట్వీట్‌తో తెలియజేస్తూ అభిమానులను అలరిస్తున్నారు క్రికెటర్లు. అభిమానుల సైతం తమ భావాలను ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇలా ఈ ఏడు ట్రెండ్ అయిన ట్వీట్‌ల గురించి ఓ లుక్కేద్దాం.
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు కోహ్లి చేసిన ట్వీట్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్, టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ల మధ్య నడిచిన ధర్జీ ట్వీట్‌లు నెట్టింట్లో బాగా పేలాయి.
చాంపియన్స్ ట్రోఫి సందర్భంగా ధోని పాక్ ప్లేయర్ సర్ఫరాజ్ బేబీతో దిగిన ఫోటోపై జర్నలిస్టు రాజ్‌దీప్ సర్ధేశాయ్ చేసిన ట్వీట్, మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామి, పాక్ మహిళా క్రికెటర్‌తో దిగిన ఫోటోకు ఐసీసీ చేసిన ట్వీట్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాయి దాడి జరిగినప్పుడు ఆ దేశ క్రికెటర్ హెన్రీక్స్ చేసిన ట్వీట్.. ధోని బ్యాక్ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్‌లు సైతం ట్రెండ్ అయ్యాయి. విరుష్క పెళ్లి ప్రకటన ట్వీట్ అయితే ఏకంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది.
‘చుట్టు కుర్రాళ్లను కోరుకునే నాయకుడికి ధన్యవాదాలు. నువ్వేప్పుడు మా నాయకుడివే ధోని భాయ్’- విరాట్ కోహ్లి
‘చాంఫియన్స్ ట్రోఫీలో అద్భుత చిత్రం. దేశాలకతీతంగా సర్ఫరాజ్ బేబీతో ధోని’- రాజ్‌దీప్ సర్ధేశాయ్
‘మహిళల ప్రపంచకప్‌లో అద్భుత క్రీడా స్పూర్తి.. తన రోల్‌మోడల్ గోస్వామితో పాక్ ప్లేయర్’- ఐసీసీ
‘బస్సుపై జరిగిన దాడి ఆదర్శంగా లేదు. కానీ భారత అభిమానులు, అస్సాం యువకులు మాకు మద్దిత్వడం సంతోషంగా ఉంది’- హెన్రీక్స్
‘బాగా ఆడావూ.. ధర్జీజీ( టేలర్ ని కాస్త టైలర్ గా మార్చి).. దీపావళి సీజన్ ఆర్డర్ ఒత్తిడిలో సైతం బానే ప్రయత్నించావు’.-వీరేంద్ర సేహ్వాగ్
‘సింహాల అరుపులు మొదలయ్యాయి.. జట్టులోకి ఎవరుస్తున్నారో ఊహించండి’- చెన్నైసూపర్ కింగ్స్
‘మేమిద్దరం కలకాలం కలిసుంటామనే పెళ్లి ప్రమాణం చేశాం. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలతో ఈ అందమైన రోజు మాకెంతో ప్రత్యేకం. మా పెళ్లి ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్’. – కోహ్లి, అనుష్క శర్మ
Comments
Please login to add a commentAdd a comment