ధోనీపై దాదా కీలక వ్యాఖ్యలు | MS Dhoni needs to play freely: Sourav Ganguly | Sakshi
Sakshi News home page

ధోనీపై దాదా కీలక వ్యాఖ్యలు

Published Sat, Oct 22 2016 7:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

ధోనీపై దాదా కీలక వ్యాఖ్యలు

ధోనీపై దాదా కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్చేచ్ఛగా ఆడాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. ధోనీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మనం మైదానంలో పాత ధోనీని చూడాలని భావిస్తున్నట్టు చెప్పాడు.

మ్యాచ్ ఫినిషర్గా పేరున్న ధోనీ ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుండటంతో గంగూలీ పైవిధంగా స్పందించాడు. మహీ మునుపటి మాదిరిగా బ్యాటింగ్ చేయాలని అన్నాడు. ధోనీ భవితవ్యంపై బీసీసీఐ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని సూచించాడు. టెస్టు క్రికెట్ నుంచి ధోనీ వైదొలిగాక యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. టి-20, వన్డే జట్లకు ధోనీయే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ధోనీ విఫలమవుతుండటంతో అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్గా కోహ్లీని నియమించాలని డిమాండ్లు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement