హరారే: టీమిండియాతో చివరి, మూడో టి-20లో ఆతిథ్య జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, మణ్దీప్ సింగ్ బ్యాటింగ్కు దిగారు.
ఈ కీలక మ్యాచ్కు భారత్ తుదిజట్టులో మార్పులు లేవు. కాగా జింబాబ్వే చటారా, సిబండా, మరుమాలను తుది జట్టులోకి తీసుకుంది. తొలి రెండు టి-20ల్లో టీమిండియా, జింబాబ్వే చెరొకటి గెలిచిన సంగతి తెలిసిందే.
జట్లు:
భారత్: ధోనీ (కెప్టెన్/కీపర్), రాహుల్, మణ్దీప్, అంబటి రాయుడు, మనీశ్ పాండే, జాదవ్, అక్షర్ పటేల్, ధావళ్ కులకర్ణి, బూమ్రా, శ్రణ్, చహల్
జింబాబ్వే: క్రెమెర్ (కెప్టెన్), చిబాబా, మసకద్జ, మూర్ (కీపర్), సిబండా, మరుమా, వాలెర్, చిగుంబుర, మడ్జివా, తిరిపనో, చటారా
మూడో టి-20: టీమిండియా బ్యాటింగ్
Published Wed, Jun 22 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement
Advertisement