మరో మైలురాయి చేరుకున్న ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాయిని చేరుకున్నాడు. కెప్టెన్గా, బ్యాట్స్మన్గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ కీపర్గాను మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మహీ కీపర్గా 350వసారి (స్టంపవుట్, క్యాచవుట్లు సహా) అవుట్ చేశాడు. బుధవారం హరారేలో జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో చిగుంబరను క్యాచవుట్ చేయడం ద్వారా ధోనీ ఈ ఘనత సాధించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో చిగుంబుర క్యాచ్ను ధోనీ అందుకున్నాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధికమంది బ్యాట్స్మెన్లను డిస్మిసల్ చేసిన కీపర్లలో ధోనీ నాలుగో స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో తాజా మ్యాచ్ ధోనీకి 278వ వన్డే. కాగా వన్డేల్లో అత్యధిక డిస్మిసల్ చేసిన కీపర్లలో తొలి మూడు స్థానాల్లో సంగక్కర (482), గిల్ క్రిస్ట్ (472), బౌచర్ (424) ఉన్నారు.