
ముంబై: భారత క్రికెట్ దేవుడు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్‌కు బుధవారంతో 46 ఏళ్లు నిండనున్నా యి. ఆధునిక క్రికెట్‌లో సాటి లేని మేటి ఆటగాడిగా నిలుస్తూ లిటిల్ మాస్టర్ నుంచి మాస్టర్ బ్లాస్టర్‌గా ఎదిగి అనంతరం క్రికెట్ దేవుడిగా సచిన్ ఖ్యాతినార్జించాడు. దేశానికి 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఈ మాస్టర్ బ్యాట్స్‌మన్... ఆ క్రమంలో టెస్టులు (200 మ్యాచ్‌లు–15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్‌లు–18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగ రాశాడు.
2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూనే... దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నాడు. దీనికిముందే 1994లో అర్జున అవార్డు, 1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను పొందాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచ కప్‌లలో పాల్గొన్న సచిన్... 2011లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడిగా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment