ఇక్కడ టీమిండియాను ఓడించడం కష్టం | Beating in India in India is always tough: Taylor | Sakshi
Sakshi News home page

ఇక్కడ టీమిండియాను ఓడించడం కష్టం

Published Thu, Sep 15 2016 7:33 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

ఇక్కడ టీమిండియాను ఓడించడం కష్టం

ఇక్కడ టీమిండియాను ఓడించడం కష్టం

న్యూఢిల్లీ: టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడించడం ఎప్పుడూ కష్టమేనని న్యూజిలాండ్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ అన్నాడు. భారత్ జట్టు పటిష్టంగా ఉందని, సొంతగడ్డపై  పరిస్థితులు వారికి అనుకూలిస్తాయని చెప్పాడు. భారత్లో మూడు టెస్టుల సిరీస్లో ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు వచ్చిన సంగతి తెలిసిందే.

టీమిండియాను టెస్టు సిరీస్లో ఓడించాలంటే తాము అత్యుత్తమంగా రాణించాల్సి ఉంటుందని టేలర్ అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో తాము ఎక్కువ సిరీస్లు గెలవకపోయినా, టెస్టు మ్యాచ్లు గెలిచామని చెప్పాడు. భారత్తో సిరీస్ తమకు కష్టమైనదే అయినా, స్థాయికి తగ్గట్టు ఆడుతామని ధీమా వ్యక్తం చేశాడు. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం తమ ముందున్న అతిపెద్ద సవాలని టేలర్ అన్నాడు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోనేందుకు దృష్టిసారిస్తున్నామని, స్వీప్ షాట్లు ఆడటంపై ప్రాక్టీస్ చేస్తున్నామని తెలిపాడు. ఇటీవల అన్ని జట్లు దూకుడైన క్రికెట్ ఆడుతున్నాయని, భారత్లో ఎప్పుడు ఆడినా సవాలేనని చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement