
భారత క్రికెట్‌లో సంస్కరణలకు సంబంధించి జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులపై ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ మరోసారి విరుచుకు పడ్డారు. ‘లోధా కమిటీ నివేదిక క్రికెట్‌ను నాశనం చేసిందని కచ్చితంగా చెప్పగలను’ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
సుప్రీం మార్గదర్శకాలతో లోధా కమిటీ పని చేయడం ప్రారంభించిననాటినుంచి దానిని వ్యతిరేకిస్తూ వచ్చిన పవార్... 70 ఏళ్లు దాటినవారు పదవులకు అనర్హులు, ఒక రాష్ట్రం ఒకే ఓటు వంటి ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.