Smriti Mandhana Dating With Music Composer Palash Muchhal - Sakshi
Sakshi News home page

అతనితో డేటింగ్‌లో భారత మహిళా క్రికెటర్‌.. ఫోటోలు వైరల్‌

Published Thu, Jul 27 2023 3:07 PM | Last Updated on Thu, Jul 27 2023 3:18 PM

Smriti Mandhana Dating With Music Composer Palash Muchhal - Sakshi

స్మృతి మంధాన భారత క్రికెట్‌ జట్టులో ప్రముఖ క్రీడాకారిణి. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ గ్రౌండ్‌లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే . క్రీజ్‌లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్‌ చేయడమే కాదు,  మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్‌గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన స్మృతి సోషల్‌మీడియాలో కూడా బాగా వైరల్‌ అవుతూ ఉంటుంది. 

ఈ మధ్య తను బాలీవుడ్‌ మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్‌తో డేటింగ్‌లో ఉ‍న్నట్లు తరుచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.  రీసెంట్‌గా తన పుట్టినరోజును జులై 18న ఢాకాలో జరుపుకుంది.  భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండటంతో ఆమె అక్కడే ఈ వేడుకలను జరుపుకుంది. ఆ సమయంలో తన బాయ్‌ ఫ్రెండ్‌ పలాష్‌ ముచ్చల్‌ కూడా ఢాకా వెళ్లి స్మృతి మంధానకు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పాడు. అది బాగా వైరల్‌ అయింది.

(ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో వరుణ్‌ తేజ్‌ పాన్‌ ఇండియా మూవీ!)

ఈ వార్త మరిచిపోక ముందే తాజాగా పలాష్ ముచ్చల్‌తో సినిమా షూటింగ్‌ స్పాట్‌లో  స్మృతి మంధాన కనిపించింది. బాలీవుడ్ కమెడియన్, నటుడు రాజ్‌పాల్ యాదవ్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్‌ ప్రకటన కార్యక్రమంలో ఆమె మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించింది. ఈ చిత్రానికి పలాష్‌ ముచ్చల్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గానే కాకుండా డైరెక్షన్‌ కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఫోటోలను కమెడియన్‌ రాజ్‌పాల్ యాదవ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి.

రెండు నెలల క్రితం, పలాష్ పుట్టినరోజు జరుపుకునేటప్పుడు, అతను తన చేతిపై 'SM 18' అని పచ్చబొట్టును గుర్తుగా రాపించాడు. స్మృతి మందన క్రికెట్ జెర్సీ నంబర్ '18' అనేది అందరికీ తెలిసిందే. అందుకే వీరిద్దరి డేటింగ్ చర్చ బాగా పాపులర్ అయింది. కానీ ఈ విషయంపై వీరద్దరూ  బహిరంగంగా ఇప్పటికి వరకు ఒప్పుకోలేదు. అన్నీ సజావుగా జరిగితే వీరిద్దరూ త్వరలో శుభం కార్డుతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాఫ్‌ పెడతారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement