Palak Muchhal
-
స్మతి మంధాన రికార్డు సెంచరీ.. ప్రియుడి పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
Palak Muchhal: సింగర్‌గానే కాదు.. సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి..
పాలక్ ముచ్చల్ అనే పేరు వినిపించగానే తీయటి పాట ఒకటి గుర్తొస్తుంది సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న పాలక్ సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి చేస్తోంది. ఫండింగ్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించింది. బాలీవుడ్ సినిమా ‘ఎంఎస్ దోని–ది ఆన్‌టోల్డ్ స్టోరీ’లోని ‘కౌన్ తుఝే’ పాటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది పాలక్. ఇండోర్‌కు చెందిన పాలక్‌కు కాలేజీ రోజుల నుంచి పాటతో పాటు సేవా బాటలో పయనించడం అంటే కూడా ఇష్టం.పాలక్ తొలి ఫండ్ రైజింగ్ ్రపాజెక్ట్ కార్గిల్ వీర సైనికుల కోసం చేసింది. ప్రతి షాప్ ముందుకు వెళ్లి దేశభక్తి గీతాలు పాడి ‘కార్గిల్ వీర సైనికులకు మీ వంతుగా సహాయం చేయండి’ అని అడిగేది. కళ, సామాజిక సేవను పాలక్ వేరు చేసి చూడదు. మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడానికి తనలోని కళ బలమైన మాధ్యమంగా ఉపయోగపడుతుందని చెబుతుంది పాలక్.సినిమాల్లో అవకాశాలు దొరకని రోజుల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి పేద పిల్లల కోసం విరాళాలు సేకరించేది. పాలక్ ఒక మ్యూజిక్ప్రోగ్రామ్ చేసిందంటే పది మంది పేద పిల్లల వైద్యానికి అవసరమైన డబ్బును సేకరించినట్లే. బాలీవుడ్లో సింగర్‌గా పాలక్‌కు మంచి పేరు రావడమే కాదు ఆ పేరు విరాళల సేకరణకు బాగా ఉపయోగపడింది.‘మీ పాట అద్భుతం’ అనే ప్రశంస కంటే, పేదింటి తల్లిదండ్రుల గొంతు నుంచి వినిపించే... ‘మీ వల్ల మా బిడ్డ బతికింది’ అనే మాట పాలక్‌కు ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. ఇప్పుడు పాలక్ వెయిటింగ్ లిస్ట్‌లో 413 మంది పిల్లలు ఉన్నారు. వారికి హార్ట్ సర్జరీలు చేయించాల్సిన బాధ్యతను భుజాలకెత్తుకుంది. ‘మనస్ఫూర్తిగా కోరుకుంటే అంతా మంచే జరుగుతుంది. పేదపిల్లలకు అండగా నిలవడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను’ అంటుంది పాలక్ ముచ్చల్. -
స్మృతి మంధాన మనసులో చోటు దక్కించుకున్న వ్యక్తి ఇతడే..(ఫొటోలు)
-
గుడ్‌న్యూస్ చెప్పిన స్మృతి మంధాన.. ఇతడే..
భారత మహిళా క్రికెట్ జట్టు సూపర్ స్టార్ స్మృతి మంధాన అభిమానులకు శుభవార్త అందించింది. తన మనసులో చోటు దక్కించుకున్న ప్రత్యేకమైన వ్యక్తి ఇతడేనంటూ సంకేతాలు ఇచ్చింది.అనుబంధానికి ఐదేళ్లుసంగీతకారుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్‌తో తన అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించింది. స్మృతితో కలిసి కేక్ కట్ చేసిన పలాష్.. ‘‘ఐదు’’ అంటూ హార్ట్ ఎమోజీ జత చేశాడు. తమ ప్రేమ బంధానికి ఐదు వసంతాలు నిండాయన్న అర్థంలో క్యాప్షన్ జతచేశాడు.మీ జంట సూపర్ అంటూఇందుకు స్పందనగా.. స్మృతి మంధాన లవ్ సింబల్స్‌తో తన సంతోషాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో మీ జంట సూపర్ అంటూ సెలబ్రిటీలు రుబీనా దిలాయక్, పార్థ్ సమర్థన్ సహా అభిమానులు స్మృతి- పలాష్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక పలాష్ సోదరి పాలక్ సైతం వీరి బంధాన్ని ధ్రువీకరించేలా కామెంట్ చేయడం గమనార్హం. కాగా భారత టీ20 జట్టు కెప్టెన్ స్మృతి మంధాన 1996 జూలై 18న ముంబైలో జన్మించింది. తొమ్మిదేళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ లెఫ్టాండర్.. 2014లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చింది.భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగి మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్న మంధాన.. ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుంది.అంతేకాదు వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక ధర(రూ. 3 కోట్ల 40 లక్షలు)కు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా మంధాన చరిత్ర సృష్టించింది. తాజా డబ్యూపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విజేతగా నిలిపి కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంది.ఎవరీ పలాష్ ముచ్చల్?ఇక మంధాన వ్యక్తిగత జీవితానికి వస్తే.. 29 ఏళ్ల మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడే పలాష్.సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ సినిమాల్లో పాలక్ పాడగా.. మ్యూజిక్ కంపోజర్‌గా పలాష్ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. టీ- సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీ, పాల్ మ్యూజిక్ వంటి కంపెనీలతో మమేకమై 40కి పైగా మ్యూజిక్ వీడియోలు చేశాడు.అంతేకాదు.. అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే నటించిన ఖేలే హమ్ జీ జాన్ సే చిత్రంలోనూ పలాష్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా వెబ్ సిరీస్ డైరెక్టర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు పలాష్ ముచ్చల్. View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) -
అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్
స్మృతి మంధాన భారత క్రికెట్ జట్టులో ప్రముఖ క్రీడాకారిణి. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే . క్రీజ్‌లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాదు, మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్‌గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన స్మృతి సోషల్‌మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య తను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్‌తో డేటింగ్లో ఉన్నట్లు తరుచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా తన పుట్టినరోజును జులై 18న ఢాకాలో జరుపుకుంది. భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండటంతో ఆమె అక్కడే ఈ వేడుకలను జరుపుకుంది. ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ కూడా ఢాకా వెళ్లి స్మృతి మంధానకు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పాడు. అది బాగా వైరల్ అయింది. (ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ!) ఈ వార్త మరిచిపోక ముందే తాజాగా పలాష్ ముచ్చల్‌తో సినిమా షూటింగ్ స్పాట్లో స్మృతి మంధాన కనిపించింది. బాలీవుడ్ కమెడియన్, నటుడు రాజ్‌పాల్ యాదవ్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ప్రకటన కార్యక్రమంలో ఆమె మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించింది. ఈ చిత్రానికి పలాష్ ముచ్చల్ మ్యూజిక్ కంపోజర్‌గానే కాకుండా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఫోటోలను కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రెండు నెలల క్రితం, పలాష్ పుట్టినరోజు జరుపుకునేటప్పుడు, అతను తన చేతిపై 'SM 18' అని పచ్చబొట్టును గుర్తుగా రాపించాడు. స్మృతి మందన క్రికెట్ జెర్సీ నంబర్ '18' అనేది అందరికీ తెలిసిందే. అందుకే వీరిద్దరి డేటింగ్ చర్చ బాగా పాపులర్ అయింది. కానీ ఈ విషయంపై వీరద్దరూ బహిరంగంగా ఇప్పటికి వరకు ఒప్పుకోలేదు. అన్నీ సజావుగా జరిగితే వీరిద్దరూ త్వరలో శుభం కార్డుతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెడతారని సమాచారం. View this post on Instagram A post shared by Rajpal Naurang Yadav (@rajpalofficial) -
ప్రముఖ సింగర్‌కు ప్రధాని మోదీ విషెష్.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలిన వీరద్దరూ మూడుముళ్ల బంధంతో రెండు రోజుల క్రితమే ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముచ్చల్. ఈ జంట వివాహానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పలువురు సినీతారలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్.. ఫోటోలు వైరల్) తాజాగా ఈ ప్రేమజంటకు ప్రధాని మోదీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. పాలక్ ముచ్చల్‌ను కంగ్రాట్స్ చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పాలక్ ముచ్చల్ ట్వీట్ చేశారు. మోదీ లేఖపై ఆమె స్పందిస్తూ..' మీ ఆశీర్వాద లేఖ మా హృదయాలను తాకింది. మా పట్ల మీ ప్రేమ, గౌరవానికి కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భంలో మీ ఆశీస్సులు పొందడం మాకు చాలా విశేషం.' అంటూ రాసుకొచ్చింది. కాగా పాలక్ ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. आदरणीय मोदी जी, आपके आशीर्वाद रूपी पत्र ने हमारे ह्रदय को छुआ है । हम इस सम्मान और प्रेम के लिये आपके प्रति अपनी कृतज्ञता व्यक्त करते हैं । हमारे विवाह के शुभ अवसर पर आपका आशीर्वाद मिलना हमारे लिये सौभाग्य की बात है। 🙏🏻@narendramodi @PMOIndia pic.twitter.com/nBa9rzRSGf — Palak Muchhal (@palakmuchhal3) November 8, 2022 -
మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెడ్ కలర్ లెహంగాలో పాలక్ మెరిసిపోతుండగా, మిథూన్ శర్మ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ఎల్లప్పుడూ కలిసి ఉండాలని మేమిద్దరం ఇలా ఒక్కటయ్యం అంటూ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, కృషికా లుల్లా, రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా వంటి పలువురు సెలబ్రిటీలు వీరి రిసెప్షన్‌కు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పాలక్ ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
Palak Muchhal: హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంటూ!
పాలక్ ముచ్చల్...అనే పేరు వినబడగానే తేనెలొలికే స్వరగానం తీయగా ధ్వనిస్తుంది. ‘ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’... మొదలైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది. హిందీలోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల పాటలు పాడి అలరించింది పాలక్. సినిమా పాటలు మాత్రమే కాదు... గజల్స్, భజన్స్ ఆలాపనలో ‘ఆహా’ అనిపించింది. పాలక్ సింగర్ మాత్రమే కాదు...గీతరచయిత కూడా. ఎన్నో ప్లేలలో అద్భుతంగా నటించింది..... ఇదంతా ఒక ఎత్తయితే తన కళను సామాజికసేవకు ఉపయోగించడం మరో ఎత్తు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో బాధ పడే చిన్నారుల కోసం ‘దిల్ సే దిల్ తక్’ పేరుతో దేశ, విదేశాల్లో ఎన్నో ఛారిటీ షోలు చేసింది పాలక్. గతంలోకి వెళితే... గుజరాత్ భూకంప (2001) బాధితుల కోసం నిధుల సేకరణలో చురుకైన పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన పాలక్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంత ఇష్టమో, సామాజిక సేవ అంటే కూడా అంతే ఇష్టం. ‘పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంది పాలక్. సామాజికసేవలో చేస్తున్న కృషికి ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. చదవండి: Mehndi Health Benefits: గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలా! లాసోన్ అనే రసాయనం వల్ల! View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
అదృష్టవంతురాలిని
సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ పాట పాడే అవకాశం లభించడం తన అదృష్టమంటూ గాయని పాలక్ ముచ్చల్ పొంగిపోయింది. ‘కిక్’ సినిమాలో ‘జుమ్మే కీ రాత్’ అనే పాటను సల్మాన్‌తో కలిసి పాడడం తనకు మంచి కిక్కు ఇచ్చిందంది. తన కెరీర్లో హిమేశ్ రేషమ్మియా, సల్మాన్‌లు కీలకపాత్ర పోషించారంది. ‘సల్మాన్‌ఖాన్‌తో కలసి ఓ పాట పాడాలనేది నా కల. ఓ రోజు సరదాగా ఈ విషయాన్ని సల్మాన్ సార్‌కు చెప్పా. ఆయనయన కూడా ఓ మంచి గాయకుడే కావడంతో నా మనసులో మాట చెప్పా. హిమేశ్ అందరితోనూ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటాడు. ఎటువంటి పరిమితులు ఉండవు. హిమేశ్ కోసం నేను ఓ పాట కూడా పాడాను. అది నాకు ఎంతో ఉత్సాహం కలిగించింది. ఈ పాట పాడే సమయంలో నా దృష్టిని, హృదయాన్ని పూర్తిస్థాయిలో కేంద్రీకరించాను’ అని అంది. ఈ పాటలో సల్మాన్ భాగస్వామ్యంపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా ఎంతో సంతోషం కలిగిందంది. 14 ఏళ్ల వయసులోనే తాను సల్మాన్‌ను తొలిసారిగా కలిశానని చెప్పింది. ‘వీర్’ సినిమాలో ‘మెహర్బానియా’ అనే పాట తానే పాడానని తెలిపింది. ‘దస్ కా దం’ షోలో పాల్గొనాల్సిందిగా తనను కోరాడంది. అతడికి తాను ఎంతో రుణపడి ఉన్నానంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు తరచూ తాను కూడా ఆర్థిక సహాయం అందిస్తుంటానంది. ఇందుకు సల్మాన్ కూడా తనవంతు సహకారం అందజేస్తున్నాడంది. ‘లా పతా’ సినిమాతో బాలీవుడ్ రంగంలోకి అడుగిడినట్టు చెప్పింది. ఆ తర్వాత ‘ఆషికి 2’లో పాడానని, ఇప్పటికి మొత్తం 142 పాటలు పాడానని తెలిపింది. -
చల్లని మనసున్న పాట...
ఏక్ థా టైగర్, ఫ్రం సిడ్నీ విత్ లవ్, రాకీ, జంజీర్...మొదలైన సినిమాల్లో పాటలు పాడిన ఇండోర్ అమ్మాయి పాలక్ ముచ్చల్, సామాజికసేవ విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. చిన్న వయసులోనే ఎన్నో పురస్కారాలను అందుకుంది. పాలక్ ముచ్చల్‌తో మాట్లాడడం అంటే తీయటి పాటల బాలీవుడ్ గాయనితో మాట్లాడడమే కాదు...తన వంతుగా సమాజానికి సేవ చేయాలనుకొనే నవతరం ప్రతినిధితో మాట్లాడినట్లు కూడా. ఇరవై రెండేళ్ల పాలక్ మనసులోని మాటలు... మా కుటుంబంలో ఎవరికీ పాటలు పాడిన నేపథ్యం లేదు. వ్యాపారం తప్ప మరొకటి తెలియదు. నేను మాత్రం రెండు సంవత్సరాల వయసు నుంచే పాడడం మొదలుపెట్టాను. హార్ట్ పేషెంట్ల సహాయార్థం షోలు చేస్తుంటాను. నా ‘షో’ల ద్వారా వచ్చిన డబ్బుతో 530 మంది పేషెంట్లకు సహాయపడ్డాను. మరో 621 మంది నా సహాయం కోసం వేచి చూస్తున్నారు. వారికి తప్పకుండా సహాయం చేస్తాను. రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు తమ చొక్కాలతో ఫ్లోర్ శుభ్రం చేస్తూ కనిపిస్తారు. వారిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. నాకోసం కాకుండా పరుల సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలనేది నా ఆలోచన. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు నా వయసు అయిదు సంవత్సరాలు. సైనికుల కోసం నా వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. వీధిలో ప్రతి దుకాణానికీ వెళ్లి పాటలు పాడి డబ్బులు అడిగేదాన్ని. అలా మా కాలనీలోనే పాతిక వేలు సేకరించాను. ఒడిశాలో తుపాను వచ్చినప్పుడు కూడా వీధి వీధి తిరిగి, పాటలు పాడి డబ్బు సేకరించి సహాయనిధికి పంపాను. ఇండోర్‌కు చెందిన లోకేశ్ అనే అబ్బాయికి గుండెలో రంధ్రం పడింది. అతని తల్లిదండ్రులేమో బీదవాళ్లు. వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేదు. ‘‘నేను వాళ్లకు సహాయపడాలనుకుంటున్నాను’’ అని మా తల్లిదండ్రులకు చెప్పాను. ఒక వీధిలో నా కోసం చిన్న వేదిక ఒకటి ఏర్పాటు చేశారు నాన్న. పేషెంట్‌కు కావల్సిన మొత్తం సమకూర్చుకోవడానికి కొన్ని రోజులు పడుతుందేమో అనుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే, ఒకే ఒక రోజులో 55,000 వచ్చాయి! ఆ డబ్బు వారికి సరిపోతుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఒక పేషెంట్ కోసం, పాటల ద్వారా నేను డబ్బులు సేకరిస్తున్నాననే విషయం తెలిసి బెంగళూరుకు చెందిన ఒక వైద్యుడు ఆపరేషన్ ఉచితంగా చేయడానికి ముందుకువచ్చాడు. ఆ 55, వేలంలో... ఎవరి డబ్బు వారికి తిరిగి ఇచ్చేయాలనుకున్నాం. కానీ అది అసాధ్యం అనే విషయం అర్థమైంది. మంచి మనసుతో దాతలు ఇచ్చిన ఆ సొమ్మును ఆపదలో ఉన్న వారి కోసం ఉపయోగించాం. ఈ మొత్తం వ్యవహారంలో నాకు అర్థమైన విషయం ఏమిటంటే ‘పాట’అనేది నలుగురిని సంతోష పెట్టడానికే కాదు...నలుగురిని ఆదుకోవడానికి కూడా అని!