
ఐదో టెస్టుకు షమీ, సాహా దూరం
ముంబై: ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టుకు భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, వృద్ధిమాన్ సాహా గాయాల కారణంగా దూరమయ్యారు. భారత్, ఇంగ్లండ్‌ల ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లో ఈ నెల 16 నుంచి చెన్నైలో జరగనుంది.
తొడకండరాల నొప్పితో బాధపడుతున్న కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంకా కోలుకుంటున్నాడు. ఇక పేసర్ షమీ కుడి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో వీరిద్దరూ ఐదో టెస్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సాహా విశ్రాంతి తీసుకుంటుండగా, షమీని కూడా అక్కడకు పంపనున్నారు. ఆదివారం భారత క్రికెట్ బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టుకు కూడా షమీ దూరంగా ఉన్నాడు.