భారత క్రికెట్‌లో పలు మార్పులు సూచిస్తూ జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తామని ....
హైదరాబాద్: భారత క్రికెట్‌లో పలు మార్పులు సూచిస్తూ జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. ఈ మేరకు జులై 18న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనున్నట్లు హెచ్‌సీఏ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆదివారం ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరిగింది. లోధా సిఫారసులను అమలు చేయనున్నట్లు సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర పడింది. ఈ అంశంపై ఎటువంటి చర్చ అవసరం లేదని, సుప్రీం ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నట్లు చెప్పిన అధ్యక్షుడు అర్షద్ అయూబ్... లోధా ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు ఏకవాక్యంలో ప్రకటించి సమావేశం నుంచి నిష్క్రమించారు.
ఆ తర్వాత అయూబ్ ప్రత్యర్థి వర్గం మాత్రం సొంతంగా సమావేశం నిర్వహించుకుంది. లోధా సిఫారసులు అమలులోకి వస్తే ప్రస్తుత కార్యవర్గం రద్దరుుపోతుందని కాబట్టి అయూబ్ పదవీ కాలం ముగిసిపోరుుందని తేల్చేసింది. డిసెంబర్ 24న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌చంద్ జైన్ తేదీని ప్రకటించగా... తాజా పరిణామాలపై లోధా కమిటీకి లేఖ రాయాలని సభ్యులు నిర్ణరుుంచారు.