ఏసీఏ అధ్యక్షుడిగా రంగరాజు | ACA President rangaraju | Sakshi
Sakshi News home page

ఏసీఏ అధ్యక్షుడిగా రంగరాజు

Published Tue, Jan 17 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

ఏసీఏ అధ్యక్షుడిగా రంగరాజు

ఏసీఏ అధ్యక్షుడిగా రంగరాజు

విజయవాడ: భారత క్రికెట్‌లో లోధా కమిటీ సిఫారసుల ప్రకారం మార్పులు అనివార్యం కావడంతో దాని ప్రభావం ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ)పై కూడా పడింది. ఇప్పటివరకు ఏసీఏ కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీహెచ్‌ అరుణ్‌ కుమార్‌ కార్యదర్శిగా ఎంపికయ్యారు. అధ్యక్షుడిగా ఉన్న డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు కూడా తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన స్థానంలో గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజు ఏసీఏ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కోశాధికారిగా వ్యవహరించిన రహీమ్‌ కూడా కొత్త మార్గదర్శకాల ప్రకారం నిష్క్రమించాల్సి రావడంతో ఆయనకు బదులుగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నారు. వి.దుర్గా ప్రసాద్‌ (సంయుక్త కార్యదర్శి), పీవీ దేవ వర్మ (ఉపాధ్యక్షుడు) కూడా కొత్తగా ఎన్నికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement