Lodha Committee
-
ఆంధ్ర క్రికెట్ సంఘం కొత్త అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి
సాక్షి, విజయవాడ: ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సూచనలకు అనుగుణంగా ఏసీఏ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కాగా... ప్రత్యర్థులు లేకపోవడంతో ఆరు పదవులకు కూడా ఏకగ్రీవ ఎంపిక జరిగింది. ఈ వివరాలను సోమవారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిగా పి.శరత్ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వీవీఎస్‌ఎస్‌కేకే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్‌లకు అవకాశం దక్కింది. సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్ర రావు, కోశాధికారిగా ఎస్.గోపీనాథ్ రెడ్డి బాధ్యతలు చేపడతారు. కౌన్సిలర్‌గా ఆర్.ధనంజయ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ ఆరుగురితో పాటు బీసీసీఐ నామినేట్ చేసే ఇద్దరు మాజీ ఆంధ్ర ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు (ఒక పురుషుడు, ఒక మహిళ), ఏపీ ఆడిటర్ జనరల్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి కూడా అపెక్స్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. కొత్త సభ్యుల పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. -
బీసీసీఐకి గట్టి దెబ్బ!
న్యూఢిల్లీ: క్రికెట్ బోర్డుకు ఇది గట్టి ఎదురుదెబ్బే! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఏమాత్రం మింగుడుపడని విధంగా కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) వ్యవహరించారు. బోర్డు ప్రక్షాళన, పారదర్శకత కోసం జస్టిస్ ఆర్.ఎమ్.లోధా కమిటీ చేసిన ప్రధాన సిఫార్సుల్ని అమలు చేయాల్సిందేనని అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్ సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. ఒక్కటి మినహా మిగతా సిఫార్సుల్ని బీసీసీఐ నియమావళిలో చేర్చాల్సిందేనన్నారు. ఆ ఒక్కటి ఏంటంటే సెలక్షన్ కమిటీ నియామక ప్రక్రియ. ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ముగ్గురితో కుదించకుండా కొనసాగవచ్చని, కేవలం టెస్టులాడిన వారినే సెలక్టర్లు చేయాల్సిన పనిలేకుండా 20 ‘ఫస్ట్‌క్లాస్’ మ్యాచ్‌లాడినా ఫర్వాలేదన్నారు. మిగతా ఐదు ప్రధాన సిఫార్సులైన... ఒక రాష్ట్రం–ఒక ఓటు, గరిష్టంగా పదవుల్లో కొనసాగే కాలం 18 ఏళ్లు (9+9), పదవుల మధ్య మూడేళ్ల విరామం, 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, ఎన్నికైన సభ్యులు (ఆఫీస్ బేరర్లు), సీఈఓ (ప్రొఫెషనల్స్)ల మధ్య అధికార పంపకాలులాంటివి అమలు చేయాలని సుబ్రమణియమ్ నివేదిక సమర్పించారు. దీనిపై సుప్రీం కోర్టు జూలై 4న జరిగే విచారణలో తీర్పు ఇచ్చే అవకాశముంది. -
5 అంశాలు మినహా...
‘లోధా’ సిఫారసులకు బీసీసీఐ ఆమోదం న్యూఢిల్లీ: దాదాపు ఏడాది తర్వాత లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. గత ఏడాది జూలై 18న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు లోధా సిఫారసులకు ఆమోద ముద్ర వేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (ఎస్జీఎం) ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. అయితే ఇందులో కూడా బోర్డు పూర్తి స్థాయిలో అన్నింటికీ అంగీకరించలేదు. ఐదు కీలక అంశాలపై మాత్రం స్తబ్దత అలాగే కొనసాగనుంది. ఒక రాష్ట్రం–ఒకే ఓటు, జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుల కుదింపు, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య, ఆఫీస్ బేరర్ల పదవీ కాలం, బోర్డు సభ్యులకు వయోపరిమితి అంశాలపై మాత్రం బీసీసీఐ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
బీసీసీఐ ఎస్జీఎం వాయిదా
తగినంత నోటీసు సమయం ఇవ్వకపోవడంపై రాష్ట్ర సంఘాల అభ్యంతరం న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేసే అంశాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింతగా సాగదీస్తోంది. ఇప్పటికే పలు మార్లు బోర్డు సమావేశాల్లో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోగా, అమలు సాధ్యాసాధ్యాల కోసమంటూ ఇటీవలే ఏడుగురు సభ్యులతో మరో కమిటీ కూడా వేసింది. తాజాగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో లోధా సిఫారసులకు ఆమోద ముద్ర వేసేందుకు బోర్డు అధికారులు మరోసారి మంగళవారం సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆరు రాష్ట్ర సంఘాల అభ్యంతరంతో ఇది అర్ధాంతరంగా వాయిదా పడింది. సమావేశంలో పాల్గొనేందుకు తమకు నిబంధనల ప్రకారం తగినంత నోటీసు సమయం ఇవ్వలేదని ఈ సంఘాలు ఆరోపించాయి. తమిళనాడు. సౌరాష్ట్ర, హరియాణా, కేరళ, గోవా, కర్ణాటక ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంఘాలన్నీ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు బలమైన మద్దతుదారులే కావడం విశేషం. లోధా సిఫారసుల ప్రకారం అనర్హతకు గురవుతున్న నిరంజన్ షా (సౌరాష్ట్ర), అనిరుధ్ చౌదరి (హరియాణా)... శ్రీనివాసన్ వర్గానికి చెందినవారు. ఈసారి కనీసం 15 రోజుల ముందుగా నోటీసు పంపాలని బోర్డు భావిస్తోంది. దాని ప్రకారం జూలై 25 నుంచి 27 మధ్యలో ఎప్పుడైనా మళ్లీ సమావేశం జరగవచ్చు. మరోవైపు ఈ నెల 14నే లోధా సిఫారసుల అంశంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. -
‘లోధా’ సిఫార్సులకు హెచ్‌సీఏ ఓకే
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ సూచించిన సిఫార్సుల అమలుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆమోద ముద్ర వేసింది. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐతో పాటు ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలలో సంస్కరణల నిమిత్తం సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బీసీసీఐను ప్రక్షాళన చేస్తూ పలు సంస్కరణలను సూచించింది. ఆరంభం నుంచి లోధా కమిటీ సిఫార్సుల అమలుకు సుముఖంగానే ఉంది. అయితే ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వాటికి ఆమోద ముద్ర వేసింది. మీరెలా ఎన్నికయ్యారు? లోధా సిఫార్సుల అమలు కోసం సమావేశమైన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో రభస జరిగింది. ఇటీవలే జి. వివేక్ అధ్యక్షతన ఎన్నికైన హెచ్‌సీఏ నూతన కార్యవర్గం ఎంపికను ప్రశ్నిస్తూ పలువురూ చర్చను లేవనెత్తారు. లోధా సిఫార్సుల ప్రకారం తమ ఎన్నిక జరిగిందని చెప్పుకుంటున్న నూతన హెచ్‌సీఏ పెద్దలు... ఇన్నాళ్ల తర్వాత లోధా సిఫార్సులకు ఆమోద ముద్ర వేయడం ఏమిటని వ్యతిరేక వర్గం ప్రశ్నించింది. అంటే లెక్క ప్రకారం నూతన కార్యవర్గం ఎంపిక చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలకు హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు సంతృప్తికర వివరణ ఇవ్వలేకపోయారు. -
రాష్ట్రపతికి ఓ రూల్.. మాకో రూలా?
న్యూఢిల్లీ:లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలులో భాగంగా నూతనంగా ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైన అనంతరం బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా తన స్వరాన్ని పెంచుతూ కొత్త లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా 70 ఏళ్ల పైబడిన వారు బీసీసీఐ, దాని అనుబంధ సంస్థల్లో ఉండరాదన్న లోధా కమిటీ సిఫారుసును నిరంజన్ తీవ్రంగా తప్పుబట్టారు. భారత దేశ రాష్ట్రపతులుగా 70 ఏళ్లు పైబడిన వారు ఉండొచ్చు కానీ బీసీసీఐలో పనిచేసే వారికి అంత వయసు ఉండకూడదన్ననిబంధన ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్రపతికి ఒక రూల్.. మాకో రూలా? అంటూ నిలదీశారు. 'బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు వయసులో పరిమితి ఏమిటో అర్ధం కావడం లేదు. మన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వయసు చూడండి 81ఏళ్లు. ఆయన 70 ఏళ్లు కంటే తక్కువే ఉన్నారా. లేరు కదా. అటువంటప్పుడు బీసీసీఐలో పనిచేసేవారికి వయసులో నిబంధన విధించడం ఏమిటి. మనం ఫిట్ గా ఉంటే ఎంతకాలమైనా పని చేయవచ్చు. ఇది కచ్చితంగా ఒక రకమైన వివక్షే అని షా మండిపడ్డారు. -
గంగూలీకి మరో కీలక బాధ్యత!
ముంబై:ఇప్పటికే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా, బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి మరొక కొత్త కీలక బాధ్యతను అప్పచెప్పారు. లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలో గంగూలీకి స్థానం కల్పించారు. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎం) లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లాకు కూడా చోటు దక్కింది. మరొకవైపు టీసీ మాథ్యూ(కేరళ క్రికెట్), నాబా భట్టచర్జీ(నార్త్ ఈస్ట్ ప్రతినిధి), జే షా(గుజరాత్ క్రికెట్ అసోసియేషన్)లతో పాటు బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి, బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరిలు మిగిలిన సభ్యులుగా ఉన్నారు. ప్రధానంగా లోధా నూతన సంస్కరణలపై కోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తమంగా అమలు పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీటి అమలులో ఉన్న ఇబ్బందులను గుర్తించి సీఓఏకు తెలియజేయడమే కమిటీ ఏర్పాటు ఉద్దేశం. -
రాజీవ్ శుక్లా అవుట్!
లక్నో: లోధా కమిటీ సిఫారుసులను అమలు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) నడుంబిగించింది. దీనిలో భాగంగా యూపీసీఏ సెక్రటరీ పదవికి రాజీవ్ శుక్లా తాజాగా రాజీనామా చేశారు. దాంతో పాటు మరో ఐదుగురు ఆఫీస్ బేరర్లు తమ తమ పదవులకు రాజీనామా చేస్తూ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీరిలో రాజీవ్ శుక్లా, బీసీ జైన్(అకౌంట్స్ జాయింట్ సెక్రటరీ)లు ఇప్పటికే తొమ్మిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోవడంతోవారి హోదాల నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరొకవైపు 70 ఏళ్ల పైబడిన నలుగురు యూపీసీఏ సభ్యులు తమ పదవులకు గుడ్ బై చెప్పారు. ఇలా తప్పుకున్న వారిలో కేఎన్ టాండన్(ట్రెజరర్), సుహబ్ అహ్మద్(జాయింట్ సెక్రటరీ)లతో పాటు ఉపాధ్యక్షులు తాహిర్ హసన్, మదన్ మోహన్ మిశ్రాలు తమ పదవులకు వీడ్కోలు చెప్పారు. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన లోధా సిఫారుసులను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలువురు యూపీసీఏ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. తదుపరి ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు శుక్లా స్పష్టం చేశారు. -
ఏసీఏ అధ్యక్షుడిగా రంగరాజు
విజయవాడ: భారత క్రికెట్లో లోధా కమిటీ సిఫారసుల ప్రకారం మార్పులు అనివార్యం కావడంతో దాని ప్రభావం ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)పై కూడా పడింది. ఇప్పటివరకు ఏసీఏ కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీహెచ్ అరుణ్ కుమార్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. అధ్యక్షుడిగా ఉన్న డీవీఎస్ఎస్ సోమయాజులు కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజు ఏసీఏ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కోశాధికారిగా వ్యవహరించిన రహీమ్ కూడా కొత్త మార్గదర్శకాల ప్రకారం నిష్క్రమించాల్సి రావడంతో ఆయనకు బదులుగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నారు. వి.దుర్గా ప్రసాద్ (సంయుక్త కార్యదర్శి), పీవీ దేవ వర్మ (ఉపాధ్యక్షుడు) కూడా కొత్తగా ఎన్నికయ్యారు. -
లిఖితపూర్వక హామీ తీసుకోండి
బీసీసీఐ సీఈఓను కోరిన లోధా కమిటీ న్యూఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని రాష్ట్ర సంఘాల నుంచి లిఖితపూర్వక హామీ తేవాలని లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రిని ఆదేశించింది. అనర్హత వేటుతో పదవిని కోల్పోనున్న ఆయా సంఘాల ప్రతినిధులు మ్యాచ్‌ల నిర్వహణకు, నూతన కార్యవర్గానికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోమని హామీ పత్రాన్ని తేవాలని లోధా కమిటీ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ సభ్యులు ఆర్.ఎం.లోధా, జస్టిస్ అశోక్ భాన్, ఆర్.వి.రవీంద్రన్ బుధవారమిక్కడ సమావేశమై బీసీసీఐ సీఈఓకు ఈ మేరకు హామీ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం, రాజస్తాన్ క్రికెట్ సంఘం వ్యవహారాల్లో కల్పించుకోబోమని లోధా కమిటీ చెప్పింది. క్రికెట్ బాగు కోసం ఈ కమిటీ తెచ్చిన సంస్కరణలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రికి చెప్పింది. -
న్యాయస్థానాలు ఆడకూడని ఆట
బీసీసీఐ ఆగ్రహం రేకెత్తించేటంతటి అహంకారంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించిన మాట నిజమే. కానీ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడమంటే ఆగ్రహంతో తుపాకీ పేల్చడం లాంటిదేనని మనవి చేయాల్సి వస్తుంది.బీసీసీఐని ‘‘సంస్కరించడం’’ అనే చిక్కుముడిలోకి కోర్టు లేదా అది నియమించే కమిటీ తలదూర్చడం చేయనేకూడదు. బోర్డు నాయకత్వాన్ని మార్చాలని బలవంతపెట్టే కంటే నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తీసుకున్న చర్యల నివేదికను కోరితే సముచితమై ఉండేది. జాతిహితం ఈ గురువారం సాయంత్రం అయిష్టంగా నేను ఇంటి నుంచి బయల్దేరి విమానాశ్రయానికి చేరేసరికి, అప్పటికే రెండు గంటలు ఆలస్యమైన నా బెంగళూరు విమానం మరింత ఆలస్యమైంది. క్రీడా ప్రేమికులకు చిర్రెత్తించే పరిస్థితి ఇది. అప్పుడు నేను ఆలోచిస్తున్నది కుస్తీ గురించి.. దంగల్ సినిమా లోని కుస్తీ గురించి కాదు... నిజం కుస్తీ గురించి. అప్పుడే నేను సోఫియా మాటిసన్ చేతిలో బబితా పోగట్ ఓడిపోవడం చూశాను. కిక్కిరిసిన ప్రేక్షకు లంతా పోగట్‌ను ప్రోత్సహిస్తున్నా, 45 సెకన్లలోనే ఆమె ఏకపక్షంగా సాగిన ఆ పోటీలో ఓడిపోయింది. ప్రపంచంలోని అత్యుత్తమ కుస్తీ వస్తాదుల్లో ఒకడు, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత తొగ్రుల్ అస్గరోవ్కు ప్రత్యర్థిగా అనా మక భారతీయుడు వికాస్ కుమార్ బరిలోకి దిగాడు. మొదటి రౌండ్‌ను వికాస్ 5–0తో అస్గరోవ్ కు సమర్పించుకున్నా, రెండో రౌండ్‌ను 3–2తో నెగ్గాడు. మ్యాచ్‌ను కోల్పోతేనేం, అనామక భారత వస్తాదు ప్రపంచ అత్యు త్తమ వస్తాదుతో పోటాపోటీగా తలపడ్డాడు. అరచేతిలో క్రీడా ప్రపంచం నేటి భారత ప్రొ రెజ్లింగ్ లీగ్ డబ్బు, ప్రతిష్టతో ముడిపడి ఉంది. ఐపీఎల్లో లాగా సంపన్న వ్యాపారవేత్తలు నగర, రాష్ట్ర ప్రాతిపదికపై కుస్తీ వస్తాదుల జట్లకు నేడు యజమానులు. బహుమతులు, వెలల రూపంలో డబ్బును చెల్లిస్తూ అది ప్రపంచంలోని అత్యుత్తమ స్త్రీ, పురుష కుస్తీ వస్తాదులను ఆకర్షి స్తోంది. ఇప్పుడు చెప్పిన పోటీలో అస్గరోవ్ ఎన్సీఆర్ పంజాబ్ తరఫున, వికాస్ ముంబై మహారాఠి తరఫున పాల్గొన్నారు. మీరిప్పుడు అసలైన ప్రపంచ స్థాయి కుస్తీలను (సుల్తాన్ సినిమాలో లాంటి చెత్తకాదు) టీవీ తెరల పైనో లేదా ఆధునిక ఇండోర్ స్టేడియంలలోనూ చూడొచ్చు. ముఖ్యంగా పేరు ప్రతిష్టలతో పాటూ మంచి జీవితం గడపడానికి అవసరమైన దాని కంటే ఎక్కువ సంపాదించగల భారత కుస్తీ వస్తాదులు పెరుగుతున్నారు. భారత కుస్తీ ప్రధాన రంగస్థలిపైకి ప్రవేశించింది. ఈ సాయంత్రం మంచి కుస్తీ పోటీలు జరిగాయి బాగుంది. అయితే అసలు రాజు మాత్రం చేత రిమోట్ పట్టిన క్రీడా ప్రేమికుడే. అప్పుడు, అదే సమయంలో మరో స్పోర్ట్స్ చానల్లో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) పోటీల్లో తాజా భారత స్టార్ క్రీడా కారుడు, ప్రపంచ 15వ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్, డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నంబర్ 2 క్రీడాకారుడు జాన్ ఓస్టెర్గార్డ్ జోర్గెన్‌సన్‌పై హోరాహోరీగా పోరాడి గెలిచాడు. లక్నోలోని ఆ స్టేడియం కిక్కిరిసిపోయి ఉంది. ప్రపంచం లోని అత్యుత్తమ బ్యాండ్మింటన్ నిపుణులంతా ఇప్పుడు నూతన బ్యాడ్మిం టన్ శక్తి అయిన భారత్‌లోనే ఉన్నారు. మీరే గనుక పీబీఎల్ పోటీలను చూసి ఉంటే వీఐపీల తొలి వరుసలో ఉన్న బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) అధిపతి అఖిలేష్ దాస్‌ను గమనించే ఉంటారు. ఆయన ఆ క్రీడను తన ఉక్కు పిడికిలితో నడుపు తున్నాడు. ఆయన రాజకీయ వేత్త, బడా విద్యా వ్యాపారవేత్త, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత బనారసీ దాస్ కుమారుడు. యూపీఏ–1 హయాం లో ఉక్కుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రాహుల్ గాంధీపై ఆగ్రహంతో కాంగ్రెస్‌ని వీడి బీఎస్పీలో చేరారు. ఆయన హయాంలో బీఏఐలో పలు వివా దాలు తలెత్తాయి. వాటిలో క్రీడాకారులతో రేగినవీ ఉన్నాయి. డబుల్స్ బ్యాడ్మింటన్‌లో ఆరితేరిన క్రీడాకారిణి, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత గుత్తా జ్వాలతో వివాదం సుప్రసిద్ధం. ఏదిఏమైనా భారత బ్యాడ్మింటన్ నేడున్నంత ఉత్తమంగా మునుపెన్నడూ లేదని అంగీకరించక తప్పదు. దాస్ చెప్పుకోద గిన బ్యాడ్మింటన్ ఆటగాడు ఎన్నడూ కాడు. లోధా పరీక్షకు నిలవలేని మార్గదర్శకులు ఇక భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్‌భూషణ్ శరణ్ సొంత జాగీరే అనుకోండి. తూర్పు యూపీలోని గోండా నుంచి ఆయన ఐదుసార్లు ఎంపీ. బాబ్రీ–అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నందుకు ఐపీసీ 307 సెక్షన్ కింద, ఆ తర్వాత టాడా కింద అరెస్టయి జైల్లో ఉన్న 16 మందిలో ఒకరిగా ఆయన ఎక్కువగా పేరు మోశారు. ఆయనకు నిజంగా కుస్తీ పోటీల్లో లభిం చిన గౌరవం ఏమైనా ఉందంటే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి రెజ్లింగ్ అసోసి యేషన్లకు నాయకత్వం వహించినందు వల్ల లభించిందే. డబ్ల్యూఎఫ్ఐ లేదా బీఏఐ గనుక బీసీసీఐ అయివుంటే బ్రిజ్ భూషణ్, అఖిలేష్‌లు లోధా కమిటీ పరీక్షకు అస్సలు నిలవలేరు. కానీ ఆ రెండు క్రీడలు వారి మార్గదర్శకత్వంలోనే అత్యుత్తమంగా రాణించాయి. పురోగతిని సాధించిన మరి కొన్ని ఇతర క్రీడలను కూడా ఓసారి చూద్దాం. అభయ్ చౌతాలాను అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ) జీవిత కాల పోషకునిగా నియమించినందుకుగానూ... ఆయన ఆ ఫెడరేషన్‌ను ‘‘సొంతం చేసేసుకున్నారు’’ అని వారం క్రితమే ఆగ్రహం వెల్లు వెత్తింది. ఆయన హయాంలోని 2007–12 మధ్యనే భారత బాక్సింగ్ సము న్నతంగా వర్థిల్లింది. అవినీతి ఆరోపణలపై అభయ్ చౌతాలా తండ్రి, సోద రుడు జైలుకు వెళ్లినప్పుడు భూపిందర్ హుడా నేతృత్వంలో కాంగ్రెస్ అధి కారంలో ఉంది. అయినా అభయ్, హుడాలు ఇద్దరూ కలసి హరియాణాను భారత బాక్సింగ్‌కే కాదు కాంటాక్ట్ (క్రీడాకారుల శరీరాలు తాకే) క్రీడలకే రాజధానిగా మలిచారు. హరియాణాకు చెందిన విజేందర్ సింగ్ భారత దేశపు మొదటి ప్రపంచ స్థాయి బాక్సింగ్ స్టార్‌గా ఆవిర్భవించాడు. చౌతాలా ఆ పదవిని కోల్పోయాక మన బాక్సింగ్ క్షీణించింది. స్పైస్ జెట్ కొత్త యజ మాని అజయ్‌సింగ్ నేతృత్వంలో బాక్సింగ్ ఫెడరేషన్‌ను ఇప్పుడు పునర్వ్య వస్థీకరించారు. ఆయన దివంగత ప్రమోద్ మహాజన్‌కు పాత మిత్రుడు. ఇక కబడ్డీ నేడు తిరిగి వికసిస్తోంది. భారత్ కేంద్రంగా పలు అంతర్జాతీయ కబడీ లీగ్‌లు, రెండు ‘‘ప్రపంచ కప్’’లు జరుగుతున్నాయి. ఇరుపక్షాల తరఫున ఆడిన రాజకీయ రంగ క్రీడాకారుడు జనార్థన్సింగ్ గెహ్లాట్ భారత కబడ్డీని భార్య డాక్టర్ మృదులా భాదురియా చేతుల్లో ఉంచి... ప్రపంచ కబడ్డీ ఫెడ రేషన్ అధిపతి కావడమే మిగిలింది. గొప్ప మెరుగుదలను కనబరుస్తున్న క్రీడలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఎవరూ ఏవిధంగానూ లోధా పరీక్షకు నిలవలేరు. అయితే భారత అథ్లెటిక్స్ (వ్యాయామ క్రీడలు) ఫెడరేషన్ దీనికి అపవాదంగా కనిపిస్తుంది. దానికి నేతృత్వం వహిస్తున్నది మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొన్నవాడు, చాలా ఏళ్లపాటూ అతి వేగంగా పరుగెత్తే భారతీయునిగా నిలిచిన అగ్రశ్రేణి అథ్లెటిక్స్ క్రీడాకారుడు అదిల్లే సుమారివాలా. ఇంకా యువకునిగానే ఉన్న సుమారి వాలా లోధా పరీక్షను పూర్తిగా నెగ్గుతారు. అయితే భారత అథ్లెటిక్స్ రంగం చాలా వరకు గందరగోళంగానే ఉంది. తాజాగా ప్రవర్థిల్లుతున్న మరో క్రీడ హాకీ. భారత హాకీ ఫెడరేషన్ అధ్యక్షునిగా కేపీఎస్ గిల్ ప్రశంసలందుకు న్నారు. జాతీయ జట్టు ఎంపిక సందర్భంగా సెలక్షన్ కమిటీ సభ్యులు లంచాలు తీసుకుంటూ కెమెరాకు చిక్కారని గిల్‌ను సస్పెండ్ చేశారు. ఆ పని చేసినది సాక్షాత్తూ ఐఓఏకు చెందిన సురేష్ కల్మాడీ. కల్మాడీ ఐఓఏ, క్రీడా మంత్రిత్వశాఖ కలసి హాకీ ఇండియాను ఏర్పాటు చేశాయి. ఇటీవలి వరకు దానికి ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రి యజమాని నరిందర్ బాత్రా నేతృత్వం వహించారు. ఆయన మార్గదర్శకత్వంలోనే భారత మహిళల, పురుషుల జట్లు ఆసియా చాంపియన్ షిప్‌లను తిరిగి సాధించాయి, ప్రపంచంలో 5–6 స్థానా లకు చేరాయి. 25 ఏళ్ల తర్వాత ప్రపంచ సీనియర్, జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లు మనకు దక్కాయి. బాత్రా ఇప్పుడు అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు (ఎఫ్ఐహెచ్) అధిపతి అయ్యారు. భారత హాకీని ఆయన, మాజీ జాతీయ హాకీ క్రీడాకారిణి మరియమ్మ కోష్కీకి అప్పగించారు. హాకీ ఇండియా లీగ్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులను అందరినీ ఆకర్షిస్తోంది. హాకీ క్రీడాకారులకు కలనైనా ఊహించని ధరలు పలుకుతున్నాయి. మన ప్రతిభ పెంపొందుతోంది. క్రికెట్లో టీ20 లాగా ఐదు జట్ల హాకీ రంగప్రవేశం చేయడంతో ఈ క్రీడ మరింతగా కనక వర్షం కురిపించనుంది. కోర్టులు విప్పలేని చిక్కుముడి ఈ గందరగోళపు సమాచారం నుంచి మనం నిర్ధారణలను ఏమైనా చేయ గలమా? వయసు, రాజకీయాలు, సంపద, క్రీడాపరమైన రికార్డు ఉండటం లేదా లేకపోవడం... వీటిలో ఏవైనాగానీ ఒక క్రీడలో సాఫల్యతకు హామీని స్తాయా? అలాంటప్పుడు అందుకు మీరు గీటురాళ్లను... అదీ కూడా ఒక్క క్రికెట్‌కే ఎలా నిర్ణయిస్తారు? భారతదేశపు అత్యంత విజయవంతమైన క్రీడ క్రికెట్టే. బీసీసీఐ పారదర్శకతలేనిదిగా, అవినీతిగ్రస్తమైనదిగా, తలపొగురు దిగా మారింది. అందులో పదవుల్లో ఉన్న పలువురి విషయంలో స్వీయ ప్రయోజనాల సంఘర్షణ సమస్య కూడా ఉన్నది. అయితే అది కూడా ఉన్నత శ్రేణి క్లబ్లన్నిటిలాగే ఇతరుల అసూయకు గురవుతోంది. న్యాయస్థానం, నిజాయితీపరులైన ముగ్గురు సుప్రీం న్యాయమూర్తులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? బీసీసీఐ ఆగ్రహం రేకెత్తించేటంతటి అహంకారంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించింది నిజమే. కానీ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడమంటే ఆగ్రహంతో తుపాకీ పేల్చడం లాంటిదేనని సవినయంగా మనవి చేయాల్సి వస్తుంది. బీసీసీఐని ‘‘సంస్కరించడం’’ అనే చిక్కుముడి లోకి కోర్టు లేదా అది నియమించే కమిటీ తలదూర్చడం చేయనే కూడదు. రోగిని నిలువునా కోసేసి, కుట్లు వేయకుండా వదిలేయడం లాంటి ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. బోర్డు అత్యున్నతాధికార సంస్థ నాయకత్వాన్నే మార్చాలని బలవంతపెట్టే కంటే, నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, తగినంతగా చర్చించాక తీసుకున్న చర్యల నివేదికను కోరితే సముచితమై ఉండేది. న్యాయమూర్తులు చాలా కష్టపడ్డారు. కానీ వారు ఆధునిక క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని విస్మరించారు. నేడు క్రీడ అంటే గ్లామర్, అట్టహాసం, డబ్బు, గోల, రంగులు, ప్రదర్శనాతత్వం, సమరో త్సాహపు పోటీతత్వం. బాణాసంచా జిలుగులు, చీర్ లీడర్లు వగైరా అన్నీ ఆటలో భాగమే. పెద్దమనుషుల ఆటగా పిలిచే క్రికెట్ అందుకు మినహా యింపు కాదు. వ్యాపార నైపుణ్యాన్ని వాణిజ్యీకరించినప్పుడు ఉద్వేగం విజ యం సాధిస్తుంది. భారత్‌లో ఐఏపీఎల్ అందుకు మార్గదర్శి. పైన పేర్కొన్న క్రీడలన్నిటి వికాసానికి కారణం ఐపీఎల్ దారిని అవి అనుసరించడమే. -శేఖర్ గుప్తా twitter@shekargupta -
వెళ్లగొట్టారు...
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీం కోర్టు వేటు ఠాకూర్, షిర్కేలను తప్పిస్తూ ఉత్తర్వులు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయని ఫలితం అనర్హులైన ఇతర ఆఫీస్ బేరర్లూ ఇదే జాబితాలోకి! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం. న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న బీసీసీఐకి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ కాలంగా సాగిన వాదప్రతివాదాలు, వాయిదాల అనంతరం సుప్రీం తన తీర్పును ప్రకటించింది. లోధా కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాలను ఇకపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు అనుబంధ సంఘాలు పాటించాల్సిందేనని, దానికి విరుద్ధంగా వ్యవహరించే వారు ఎవరైనా సరే పదవులు కోల్పోతారని సుప్రీం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వారంతా హామీ పత్రం దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. చీఫ్ జస్టిస్ తీరథ్ సింగ్ (టీఎస్) ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. బీసీసీఐని నడిపించేందుకు కొత్త పరిపాలకులతో కూడిన కమిటీని సుప్రీం ఈ నెల 19న ప్రకటిస్తుంది. ఇందులో సభ్యుల కాగల అర్హత ఉన్నవారి పేర్లను ప్రతిపాదించాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణియమ్, ఫాలీ ఎస్ నారిమన్‌లకు కోర్టు సూచించింది. అప్పటి వరకు మాత్రం బోర్డులో సీనియర్ ఉపాధ్యక్షుడు అయిన వ్యక్తి అధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కార్యదర్శిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే సీఈఓ హోదాలో రాహుల్ జోహ్రి ఇప్పటి కే రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రెండేళ్ల తర్వాత... 2013 ఐపీఎల్ సందర్భంగా బయటపడ్డ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో దోషులకు శిక్షలు ఖరారు చేసే విషయంలో జనవరి 2015లో జస్టిస్ రాజేంద్ర మల్ (ఆర్ఎం) లోధా కమిటీ ఏర్పాటైంది. దీంతో పాటు బీసీసీఐ మరింత సమర్థంగా పని చేసేలా మార్పులు సూచించే బాధ్యత కూడా సుప్రీం కోర్టు ఈ కమిటీకే అప్పగించింది. ఏడాది తర్వాత 2016 జనవరిలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. చర్చోపచర్చలు, వాదనల తర్వాత గత ఏడాది జులై 18న లోధా సూచించిన వాటిలో ఎక్కువ భాగం ప్రతిపాదలను ఆమోదించిన సుప్రీం కోర్టు వీటిని పాటించాల్సిందంటూ బోర్డును ఆదేశించింది. అయితే ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ సమయం ఇచ్చినా కూడా బీసీసీఐ దీనిని పట్టించుకోలేదు. పైగా తమ రాష్ట్ర సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయంటూ లోధా కమిటీకి తగిన విధంగా సహకరించలేదు. అధ్యక్షుడు ఠాకూర్ అయితే తన మాటలు, చేతల్లో లెక్కలేనితనాన్ని ప్రదర్శించారు. ఇది సుప్రీంకు మరింత ఆగ్రహం తెప్పించింది. చివరకు ఈ పరిణామాలు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కఠిన ఆదేశాలు జారీ చేసేందుకు దారి తీశాయి. మరోవైపు అసత్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు తమపై ఎందుకు చర్య తీసుకోరాదో కూడా వివరణ ఇవ్వాలని కూడా ఠాకూర్, షిర్కేలను సుప్రీం ఆదేశించింది. నాకు ఇబ్బంది లేదు: షిర్కే సుప్రీం ఇచ్చిన తీర్పుతో కార్యదర్శి పదవిని కోల్పోవడాన్ని అజయ్ షిర్కే తేలిగ్గా తీసుకున్నారు. ‘దీనిపై ఏమని స్పందిస్తాం. నన్ను తప్పిస్తున్నట్లు సుప్రీం చెప్పింది కాబట్టి బోర్డులో నా పాత్ర ముగిసింది. ఈ పదవితో నాకేమీ వ్యక్తిగత అనుబంధం లేదు. సభ్యులకు మద్దతుగా నిలబడాలి కాబట్టి సిఫారసులు అంగీకరించలేకపోయాం. అప్పట్లో పదవి ఖాళీగా ఉండి నా అవసరం ఉండటంతో నన్ను తీసుకున్నారు. ఇప్పుడు వెళ్లిపోవడానికి ఎలాంటి బాధా లేదు. నేను చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ పరిణామాల వల్ల మున్ముందు ప్రపంచవ్యాప్తంగా మన దేశం పరువు పోకూడదని కోరుకుంటున్నా’ అని షిర్కే అన్నారు. రిటైర్డ్ జడ్జీలకు బెస్టాఫ్ లక్! వ్యంగ్యంగా స్పందించిన ఠాకూర్ సుప్రీం కోర్టుతో నేరుగా తలపడే సాహసం చేసి తన పదవిని పోగొట్టుకున్న అనురాగ్ ఠాకూర్ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. తీర్పుపై స్పందిస్తూ ఆయన వ్యంగ్య రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. ‘ఇది నా వ్యక్తిగత పోరు కాదు. ఒక క్రీడా సంఘం స్వతంత్రతకు సంబంధించిన అంశం. అందరు పౌరుల్లానే నేనూ సుప్రీం కోర్టును గౌరవిస్తాను. ఒకవేళ రిటైర్డ్ జడ్జీలు బీసీసీఐని సమర్థంగా నడిపిస్తారని సుప్రీం కోర్టు భావిస్తే వారికి బెస్టాఫ్ లక్ చెబుతున్నా. వారి నేతృత్వంలో భారత క్రికెట్ ఇంకా బాగుంటుందని నమ్ముతున్నా. సౌకర్యాలు, స్థాయి, క్రికెటర్లపరంగా చూసినా కూడా ప్రపంచంలోనే బీసీసీఐ అత్యుత్తమంగా నిర్వహించబడుతున్న సంస్థ’ అని ఠాకూర్ చెప్పారు. ► ‘నేను ఉత్తర్వుల పట్ల సంతృప్తిగా ఉన్నా. ఇకపై బోర్డు మళ్లీ సరైన దారిలో నడుస్తుందని ఆశిస్తున్నా’ – బిషన్ సింగ్ బేడి ► ‘సుప్రీం ఉత్తర్వులను బోర్డు అమలు చేయని ఫలితాన్ని ఇప్పుడు ఠాకూర్, షిర్కే అనుభవిస్తున్నారు’ – జస్టిస్ ముకుల్ ముద్గల్ ►‘ముంబై క్రికెట్‌కు ఇదో విషాదకరమైన రోజు. ముంబై ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను అందించింది. 41 సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటింగ్ హక్కు లేదనడం బాధాకరం’ – శరద్ పవార్ ► ‘సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం. మేం పాటిం చాల్సిందే’ – నిరంజన్ షా -
లోధా సంస్కరణలతో గందరగోళమే
దేశంలో క్రికెట్ బలహీనపడుతుంది అంతర్జాతీయ వేదికల్లో పట్టు కోల్పోతాం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ: భారత క్రికెట్లో ప్రక్షాళనకు జస్టిస్ లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ వ్యతిరేక వైఖరిని ఎంతమాత్రం వీడటం లేదు. తమకు వీలు చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉంది. తాజాగా ప్యానెల్ అమలు చేయాలంటున్న సంస్కరణలు భారత క్రికెట్‌కు ఎంతమాత్రం మేలు చేయవని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ఇది మొత్తం గందరగోళానికి దారితీస్తుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల అనంతరం లోధా కమిటీ నుంచి తమకు ఎలాంటి సూచనలు అందడం లేదని ఆయన ఆరోపించారు. ‘కోర్టు సూచనలకు మేం కట్టుబడి ఉంటాం. అరుుతే ప్యానెల్ నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు, సూచనలు అందడం లేదు. దీంతో మేం ఏ విషయంలోనూ ముందుకెళ్లడం లేదు. ఇది అంతిమంగా భారత క్రికెట్‌కు హాని చేస్తుంది. బీసీసీఐ ప్రతిష్టను కూడా మసకబారుస్తుంది. అంతేకాకుండా బీసీసీఐ పాలనావ్యవహారాల అధికారాన్ని మూడో పార్టీకి ప్యానెల్ బదలాయించలేదు. అసలు హోం శాఖ మాజీ కార్యదర్శికి క్రికెట్‌ను నడపడం ఎలా సాధ్యమవుతుంది? దీన్ని మేం ఎంతమాత్రం అంగీకరించం. నిజానికి లోధా కమిటీ ప్రతిపాదనలు క్రికెట్‌కు మేలు చేసేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా క్రికెట్ పరిపాలనను బలహీనపరిచేలా ఉన్నాయి. దీంతో బీసీసీఐ ఓ విఫల సంస్థగా మారి అంతర్జాతీయ వేదికపై తన గళాన్ని వినిపించే శక్తిని కోల్పోతుంది’ అని ఠాకూర్ అందులో పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌ను చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన బెంచ్ గత సోమవారమే విచారించాల్సి ఉండగా శుక్రవారానికి వాయిదా పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాం... తమ ప్రతిపాదనల అమలులో విఫలమవుతున్నందుకు బోర్డులోని ఆఫీస్ బేరర్లందరినీ తొలగించాలని సుప్రీం కోర్టుకు నవంబర్ 21న తాము సమర్పించిన మూడో నివేదికలో లోధా ప్యానెల్ కోరిన విషయం తెలిసిందే. అరుుతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ తమను తొలగిస్తే కలిగే లాభమేమిటని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ‘ఆయా క్రికెట్ సంఘాల నియమావళికి లోబడి చట్టబద్ధంగా ఎన్నికై న ఆఫీస్ బేరర్లను తొలగించాలనడం శోచనీయం. ఇది ఎంతమాత్రం క్రికెట్‌కు లాభం చేకూర్చదు సరికదా వెంటనే పరిపాలన కుప్పకూలుతుంది. మొత్తం భారత క్రికెట్ గందరగోళంలో పడుతుంది. వివిధ అంతర్జాతీయ వేదికల్లో భారత క్రికెట్‌కు గళమనేదే ఉండదు’ అని చెప్పారు. రాష్ట్ర సంఘాలు అంగీకరించడం లేదు... నూతన సంస్కరణలను బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలు చేసేందుకు నిరాకరిస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వీటి కోసం తాము మూడుసార్లు సమావేశమయ్యామని, అన్నిసార్లూ వారు తిరస్కరించారని గుర్తుచేశారు. ‘అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించేందుకు వారితో సమావేశమయ్యాను. ఓటింగ్ ద్వారా వారు కొత్త ప్రతిపాదనలను తిరస్కరించారు’ అని ఆయన అన్నారు. -
బీసీసీఐ, లోధా ప్యానెల్ కేసు విచారణ 9కి వాయిదా
ఆ రోజే తుది తీర్పు న్యూఢిల్లీ: లోధా కమిటీ ప్రతిపాదనలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అమలు చేసే వ్యవహారంపై సుప్రీం కోర్టు తమ తుది తీర్పును ఈనెల 9కి వాయిదా వేసింది. విచారణ బెంచ్‌లో ఉన్న ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అస్వస్థత కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరిసారిగా ఈ కేసును అక్టోబర్ 21న విచారించిన కోర్టు సోమవారం తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. ప్రతిపాదనల అమలు విషయంలో బీసీసీఐకి, లోధా ప్యానెల్‌కు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. 70 ఏళ్ల గరిష్ట వయస్సు, రెండు పదవుల మధ్య మూడేళ్ల విరామం, ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి అంశాలను బోర్డు గట్టిగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ప్యానెల్ సూచించిన అంశాలను కచ్చితంగా అమలు పరచాల్సిందేనని కోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. అయితే తాత్సారం చేస్తున్న బోర్డు వ్యవహారంపై ప్యానెల్ ఇటీవల మరో నివేదికను కోర్టుకు అందించారు. దీంట్లో ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్లను తొలగించి, బోర్డు వ్యవహారాల పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలని కోరింది. అయితే నూతన సంస్కరణలను అమలు చేయాలని తమ రాష్ట్ర సంఘాలపై ఒత్తిడి చేయలేమని, మెజారిటీ ఓటింగ్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెబుతున్నారు. -
బీసీసీఐ వర్సెస్ లోధా: సుప్రీం తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో ఆఫీస్ బేరర్లందరినీ తొలగించి బోర్డు పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన లోధా ప్యానెల్ కమిటీ పిటిషన్‌పై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. ఈ మేరకు సోమవారం పిటిషన్‌పై విచారణలో అటు బోర్డుతో పాటు, ఇటు లోధా ప్యానెల్ కూడా తమ వాదనలు వినిపించింది. అయితే దీనిపై తీర్పును సుప్రీం వెలువరించే అవకాశం ఉందని అంతా భావించారు. కాగా, ఇరు పక్షాల వాదనలు విన్న దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పును ఈ నెల 9వ తేదీ వాయిదా వేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అనారోగ్యం కారణంగానే తీర్పును మరికొన్ని రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 70 ఏళ్ల పైబడిన వారు బోర్డులో ఉండకూడదనే నిబంధన ఒకటైతే, కూలింగ్ ఆఫ్ పిరియడ్‌పై కూడా బీసీసీఐ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. దాంతోపాటు ఒక రాష్ట్రానికి ఒక ఓటు అనే సూచనను కూడా బీసీసీఐ అంగీకరించడం లేదు. దాంతో బోర్డులోని ఆఫీస్ బేరర్లు అందర్నీ తొలగించాలని లోధా ప్యానల్ మూడోసారి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. అదే క్రమంలో హోంశాఖ మాజీ కార్యదర్శి జికే పిళ్లైను బోర్డు పరిశీలకుడిగా నియమించాలంటూ లోధా ప్యానల్ కోర్టును కోరింది. -
'ఆ పదవులపై ఎందుకంత వ్యామోహం'
నాగ్‌పూర్:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పారదర్శకతలో భాగంగా జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు మిగతా క్రీడల్లో అవసరమని బీజేపీ బహిష్కృత ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఒక గేమ్‌లో పారదర్శకత కోసం లోధా ప్యానల్ చేసిన సిఫారుసులు క్రికెట్ కు ఎంత అవసరమో, అదే తరహా సూచనలు మిగతా క్రీడల్లో అనివార్యమని ఆజాద్ పేర్కొన్నారు. భారతదేశంలోని కొన్ని క్రీడా బోర్డులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని ఆజాద్ విమర్శించారు. 'క్రీడలపై నమ్మకం ఉండాలి. అది క్రికెట్ అయినా, ఇంకా వేరే గేమ్ అయినా పారదర్శకత అవసరం. అందుకోసం లోధా తరహా ప్యానల్‌ను మిగతా క్రీడలకు కూడా ఏర్పాటు చేసి ప్రక్షాళనకు నడుంబిగించాల్సి అవసరం ఎంతైనా ఉంది' అని ఆజాద్ తెలిపారు. మరొకవైపు లోధా ప్యానల్ సూచనలపై బీసీసీఐ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయాల్సి వస్తుందో తనకు అర్ధం కావడం లేదన్నారు.అసలు లోధా సిఫారుసులను వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. క్రికెట్ గేమ్ అనేది ఆటగాళ్ల వల్లే ఖ్యాతి పొందిందనే విషయాన్ని అధికారులు గుర్తించుకుంటే మంచిదని చురకలంటిచారు. క్రికెట్ పరిపాలన అధికారుల వల్ల ఆ క్రీడ బ్రతుకుందని తాను అనుకోవడం లేదన్నారు. అటువంటప్పుడు ఆ పదవుల్ని పట్టుకుని ఎందుకు వెళాడుతున్నారని ఆజాద్ ఘాటుగా విమర్శించాడు. తమ పదవులపై ఎందుకు అంత వ్యామోహమని ఆజాద్ మండిపడ్డారు. -
వచ్చే నెల 2న బీసీసీఐ ఎస్జీఎం
లోధా కమిటీ నివేదికపై చర్చ మొహాలీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికపై చర్చించేందుకు బీసీసీఐ వచ్చే నెల 2న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఏర్పాటు చేయనుంది. తమ ప్రతిపాదనలను బేఖాతరు చేస్తున్న బీసీసీఐపై కోర్టుకు మూడో నివేదికను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న ఆఫీస్ బేరర్లందరినీ తొలగించి బోర్డు పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించేందుకు అనుమతించాలని ప్యానెల్ కోర్టును కోరింది. ‘వచ్చే నెల 2న న్యూఢిల్లీలో ఎస్జీఎం జరపనున్నాం. లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించడమే మా అజెండా’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే లోధా కమిటీ సూచించిన నూతన సవరణలపై వచ్చే నెల 3న బోర్డు తమ అంగీకార పత్రాన్ని కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. -
బీసీసీఐ ‘పెద్ద’లను వెంటనే తప్పించండి!
సుప్రీం ముంగిట లోధా కమిటీ కొత్త ప్రతిపాదన బోర్డుకు పరిశీలకుడిని నియమించాలని సూచన న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ సిఫారసులు అమలు చేయలేక ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మరో పిడుగు పడింది. తాము నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో కొనసాగుతున్న బోర్డు ఆఫీస్ బేరర్లు అందరినీ వెంటనే తొలగించాలంటూ కమిటీ ప్రతిపాదించింది. రాష్ట్ర సంఘాల్లోనూ కూడా దీనిని అమలు చేస్తూ అక్కడివారిని కూడా అనర్హులుగా ప్రకటించాలని కమిటీ సూచించింది. సిఫారసుల అమలుపై తాజా పరిస్థితిని వివరిస్తూ లోధా కమిటీ సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలో ఈ ప్రతిపాదనలు చేసింది. ఇది కమిటీ సమర్పించిన మూడో నివేదిక కావడం విశేషం. లోధా ప్రతిపాదనల ప్రకారం ఆఫీస్ బేరర్ల వయసు 70 ఏళ్లకు మించరాదు, మంత్రిగానీ, ప్రభుత్వ అధికారిగానీ అరుు ఉండరాదు. ఇతర సంఘాల్లో అధికారిగా పని చేయకూడదు. దీంతో పాటు మొత్తంగా కలిపి 9 ఏళ్లకు మించి ఏదైనా పదవిలో కొనసాగరాదనేది నిబంధన. వీటిని వర్తింపజేస్తే ప్రస్తుత అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే సహా బోర్డులోని ఆఫీస్ బేరర్లంతా అనర్హులవుతారు. తాము లోధా సిఫారసులు అమలు చేస్తామంటూ ఇప్పటికి నాలుగు రాష్ట్ర సంఘాలు (విదర్భ, త్రిపుర, రాజస్థాన్, హైదరాబాద్) మాత్రమే అంగీకారం తెలిపారుు. అరుుతే అక్టోబర్ 1న జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. పరిశీలకుడిగా జీకే పిళ్లై... బీసీసీఐ ఇప్పటికీ తమ సూచనలను పట్టించుకోవడం లేదని తాజా నివేదికలో కూడా వెల్లడించిన లోధా కమిటీ... బోర్డుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఒక కంట కనిపెట్టేందుకు కొత్తగా పరిశీలకుడిని నియమించాలని కోరింది. ఇందు కోసం హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై పేరును కూడా ప్రతిపాదించింది. బోర్డుకు తగిన విధంగా మార్గనిర్దేశనం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు, టోర్నీలకు వివిధ కాంట్రాక్ట్‌లు ఇచ్చే విషయంలో పారదర్శకత కోసం పరిశీలకుడి అవసరం ఉందని కమిటీ పేర్కొంది. బీసీసీఐ రోజువారీ వ్యవహారాలను ఇప్పటికే సీఈఓ రాహుల్ జోహ్రి చూస్తున్నారు. అరుుతే ఆయన అధికారాలు పరిమితంగా ఉండటంతో పాటు బోర్డు కార్యదర్శి పర్యవేక్షణలో పని చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొనే కొత్తగా స్వతంత్ర పరిశీలకుడి అవసరం ఉన్నట్లు లోధా కమిటీ గుర్తించింది. -
బీసీసీఐ అధికారులందరినీ తొలగించండి
న్యూఢిల్లీ: లోధా ప్యానల్ సిఫారసులను అమలు చేయకుండా జాప్యం చేస్తున్న భారత క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీసీసీఐ పదవుల్లో ఉన్నవారందరనీ తొలగించాలని లోధా ప్యానల్ తాజాగా సిఫారసు చేసింది. సోమవారం సుప్రీం కోర్టుకు ఈ కమిటీ మరో నివేదిక సమర్పించింది. బీసీసీఐ పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలని సూచించింది. ఐపీఎల్లో బెట్టింగ్ కుంభకోణం వెలుగుచూసిన అనంతరం బీసీసీఐని ప్రక్షాళన చేయడానికి సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ బోర్డులో చేయాల్సిన మార్పుల గురించి గతంలో ఈ కమిటీ సుప్రీం కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. అయితే లోధా సిఫారసులన్నింటినీ అమలు చేయడం సాధ్యంకాదని బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొంత గడువు కావాలని బోర్డు కోరింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో లోధా కమిటీ తాజాగా మరో నివేదిక కోర్టుకు సమర్పించింది. బీసీసీఐ అధికారులందరినీ తొలగించడంతో పాటు బోర్డు కీలక కాంట్రాక్టులను పరిశీలించేందుకు పిళ్లైను నియమించాలని కోరింది. -
కమిటీ రద్దయిందా... లేదా..!
హెచ్‌సీఏలో మరో రాజకీయం ఎస్‌జీఎంలో తీవ్ర చర్చ డిసెంబర్ 24న ఎన్నికలు! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో వివాదాలు, సభ్యుల మధ్య రాజకీయాలు కొత్త కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కార్యవర్గం సమయం ముగిసిపోయింది కాబట్టి తప్పుకోవాలని ప్రత్యర్థి ఒక వైపు ఎప్పటినుంచో వాదిస్తుండగా, తాము నిబంధనల ప్రకారమే పదవీకాలం పొడిగించుకున్నట్లు అధికారంలో ఉన్నవారు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు లోధా కమిటీ సిఫారసుల అమలు తదనంతర పరిణామాలపై కూడా ఇరు వర్గాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఇది మళ్లీ బయటపడింది. లోధా కమిటీ ప్రతిపాదనల అమలు విషయంలో మరో చర్చకు తావు లేకుండా, ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసిన సభ్యులు, అందులోని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నా రు. ఇది ఎలాంటి మలుపునకు దారి తీస్తుందనేది చూడాలి. అమలుకు ఓకే... ఉప్పల్ స్టేడియంలో జరిగిన సమావేశానికి దాదాపు 170 మంది సభ్యులు హాజరైనట్లు సమాచారం. అధ్యక్షుడు అయూబ్, కార్యదర్శి జాన్ మనోజ్‌లతో పాటు ఇతర ఆఫీస్ బేరర్లు ఇందులో పాల్గొన్నారు. మరో వైపునుంచి జి. వివేకానంద్, మాజీ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ తదితరులు కూడా హాజరయ్యారు. ముందుగా నిర్ణరుుంచుకున్న అజెండా ప్రకారం అయూబ్, లోధా కమిటీ సిఫారసులను హెచ్‌సీఏ అమలు చేస్తుందని, దానిని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ప్రకటన చేశారు. అరుుతే అంశాలవారీగా చర్చను చేపట్టాలని కోరగా, దాని అవసరం లేదంటూ స్పష్టం చేస్తూ వేదిక దిగిపోయారు. ఇతర ఆఫీస్ బేరర్లు అయూబ్‌ను అనుసరించారు. రద్దు చేసేస్తున్నాం... అయితే అయూబ్ వెళ్లిపోయినా, ఇతర సభ్యులంతా ఉపాధ్యక్షుడు ప్రకాశ్ చంద్ జైన్ అధ్యక్షతన సమావేశం కొనసాగించారు. లోధా కమిటీ ప్రతిపాదనల్లో ఉన్న 14 అంశాలను సభ్యడు జి.వివేకానంద్ చదివి వినిపిస్తూ అంశాలవారీగా ఆమోదం కోరారు. హాజరైన సభ్యులంతా వీటికి మద్దతు పలికారు. ఈ సిఫారసుల ప్రకారం కొత్త నిబంధనలతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న కమిటీ రద్దరుునట్లేనని ఈ వర్గం ప్రకటించింది. అయూబ్ కూడా ఇప్పటికే 9 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు కాబట్టి ఆయనకు కొనసాగే అర్హత లేదని తేల్చేసింది. ఎన్నికల తేదీ, రిటర్నింగ్ అధికారి వివరాలు కూడా చెప్పాలని సభ్యులు కోరడంతో ప్రకాశ్ చంద్ డిసెంబర్ 24న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదేం చెల్లదు... అయితే సభ్యుల వాదనను అయూబ్ అంగీకరించడం లేదు. ఎస్‌జీఎంలో ఏకై క ఎజెండా లోధా సిఫారసులు మాత్రమేనని, ఎన్నికల ప్రక్రియ అంశమే కాదన్న ఆయన... తన స్థానంలో మరొకరు అధ్యక్షత వహించి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని అన్నారు. ‘లోధా నిబంధనల్లో ఎక్కడా కమిటీ వెంటనే రద్దరుుపోతుందని లేదు. సుప్రీం ఆదేశాల ప్రకారం సిఫారసుల అమలుకు అంగీకారం తెలపడం మాత్రమే ప్రస్తుతం మేం చేయగలిగింది. ఇప్పుడే ఎన్నికలు అన్న ప్రసక్తే తలెత్తదు’ అని ఆయన గట్టిగా చెప్పారు. అయితే ఆదివారం సమావేశానంతరం ఇరు వర్గాలు తమ తమ వాదనలు వినిపిస్తూ లోధా కమిటీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నాయి. తాజా పరిణామాలపై అయూబ్, ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరంపై ప్రత్యర్థి వర్గం లేఖ రాయనున్నాయి. వీటికి స్పందనగా లోధా కమిటీనుంచి సమాధానం వచ్చిన తర్వాతే హెచ్‌సీఏలో ఏం జరగనుందనే అంశంపై స్పష్టత రావచ్చు. -
హచ్‌సీఏ పచ్చ జెండా
హైదరాబాద్: భారత క్రికెట్లో పలు మార్పులు సూచిస్తూ జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. ఈ మేరకు జులై 18న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనున్నట్లు హెచ్‌సీఏ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆదివారం ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరిగింది. లోధా సిఫారసులను అమలు చేయనున్నట్లు సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర పడింది. ఈ అంశంపై ఎటువంటి చర్చ అవసరం లేదని, సుప్రీం ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నట్లు చెప్పిన అధ్యక్షుడు అర్షద్ అయూబ్... లోధా ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు ఏకవాక్యంలో ప్రకటించి సమావేశం నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత అయూబ్ ప్రత్యర్థి వర్గం మాత్రం సొంతంగా సమావేశం నిర్వహించుకుంది. లోధా సిఫారసులు అమలులోకి వస్తే ప్రస్తుత కార్యవర్గం రద్దరుుపోతుందని కాబట్టి అయూబ్ పదవీ కాలం ముగిసిపోరుుందని తేల్చేసింది. డిసెంబర్ 24న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌చంద్ జైన్ తేదీని ప్రకటించగా... తాజా పరిణామాలపై లోధా కమిటీకి లేఖ రాయాలని సభ్యులు నిర్ణరుుంచారు. -
త్వరలో లోధా కమిటీతో భేటీ..
ముంబై: మరో రెండు రోజుల తరువాత లోధా కమిటీని కలిసి వారు సూచించిన సిఫారుసులపై తమ భవిష్య కార్యచరణను వివరించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమవుతోంది. ఈ మేరకు లోధా కమిటీకి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలు లేఖ రాసినట్లు బోర్డు అధికారి ఒకరు తెలియజేశారు. 'ఈనెల9వ తేదీ దాటిన తరువాత లోధా కమిటీని అనురాగ్, షిర్కేలు కలుస్తారు. లోధా సిఫారుసుల అమలుకు సంబంధించి బీసీసీఐ ప్రణాళికను ఆ కమిటీ ముందు ఉంచుతుంది. ఈ బుధవారమే లోధా కమిటీని అనురాగ్ ఠాకూర్ కలవాలి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుంది. దీనిపై అనురాగ్ దాఖలు చేసిన అఫిడవిట్లో క్షమాపణలు కూడా తెలియజేశారు. మరో రెండు రోజుల దాటిన తరువాత ఎప్పుడైనా లోధా కమిటీని అనురాగ్ కలిసే అవకాశం ఉంది' అని తెలిపారు. -
85 శాతం ప్రతిపాదనలు అమలు చేయొచ్చు
లోధా కమిటీ ప్రతిపాదనల్లో 85 శాతం అమలు చేయడానికి ఇబ్బంది లేదని, బీసీసీఐ వాటికి ఒప్పుకోవచ్చని మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అన్నారు. ‘బీసీసీఐలో పరిపాలన, నిర్వహణ, ఎన్నికల ప్రక్రియ, ఆర్ధిక వనరులు ఇలాంటి విషయాలన్నింటినీ కమిటీ ప్రతిపాదనల మేరకు అమలు చేయొచ్చు. అరుుతే ఒక 15 శాతం ప్రతిపాదనలు అమలు చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. ఈ విషయంలో అటు బోర్డు, ఇటు కమిటీ సభ్యులు కూడా పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించాలి’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. -
'ఐపీఎల్'పై ఏమి చేయమంటారు?
న్యూఢిల్లీ:లోధా కమిటీ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆలోచనలో పడింది. దానిలో భాగంగా ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులపై తర్జన భర్జనలు పడుతోంది. ఐపీఎల్ ప్రసార హక్కుల్లో భాగంగా ఇటీవల బహిరంగ టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ.. దానిపై ఏమి చేయాలో చెప్పాలంటూ లోధా కమిటీకి లేఖ రాసింది. ఈ మేరకు స్ఫష్టత ఇవ్వమంటూ లోధా కమిటీ బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే లేఖను రాశారు. ' ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులపై తుది నిర్ణయం తీసుకోవాలి. గత మంగళవారం ఐపీఎల్ ప్రసార హక్కులపై వేలానికి ఆహ్వానించి వున్నాం. ఈ లోగా బీసీసీఐ ఫైనాన్స్ వ్యవహారాలను పరిశీలించేందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవడానికి మీకు సుప్రీం అనుమతి ఇచ్చింది. దీనిపై కొంతవరకూ గందరగోళంలో ఉన్నాం.ఈ అంశంపై స్పష్టత ఇవ్వండి. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ టెండర్లపై ముందుకు వెళ్లమంటారా? లేక నిలిపివేయమంటారా? చెప్పండి' అని షిర్కే లేఖలో కోరారు. కొన్ని రోజుల క్రితం 2018 ఐపీఎల్ నుంచి వర్తించే విధంగా కొత్త ఒప్పందం కోసంబీసీసీఐ బహిరంగ టెండర్ ప్రక్రియ ద్వారా ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు కోరిన సంగతి తెలిసిందే.2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి 2017 వరకు పదేళ్ల కాలానికి టీవీ హక్కులు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ ఒప్పందం ముగియనుండటంతో బీసీసీఐ కొత్త ఆఫర్‌కు సిద్ధమైంది. -
సుప్రీం తీర్పు కాపీ చూసిన తరువాతే..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఫైనాన్స్ అకౌంట్లను పరిశీలించేందుకు లోధా కమిటీ ఒక ఆడిటరన్ ను నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సుప్రీం తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని ఆయన తెలిపారు. 'ఒకసారి సుప్రీం తీర్పు కాపీని చూసిన తరువాత ఏమైనా మాట్లాడటానికి అవకాశం ఉంది. మాకున్న కష్టసాధ్యమైన అంశాలను కోర్టుకు సూచించాం. మా ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా లోధా కమిటీ ఒక ఆడిటర్ ను నియమించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అది క్రికెట్ పై ఎంత ప్రభావం చూపుతుంది అనేది పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అయితే కాపీ తీర్పును పూర్తిగా చదివిన తరువాత మాట్లాడతా' అని అనురాగ్ తెలిపారు. లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లోధా కమిటీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపేవరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిధులు జారీ చేయకూడదని బీసీసీఐకి సూచించింది. ఆ క్రమంలోనే లోధా ప్యానల్ ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ రాష్ట్ర సంఘాలు అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ ఆదేశించింది. దానిలో భాగంగా బీసీసీఐ అకౌంట్లను పరిశీలించేందుకు లోధా కమిటీ స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. -
'లోధా' సిఫారుసులను అమలు చేస్తేనే..
-
'లోధా' సిఫారుసులను అమలు చేస్తేనే..
న్యూఢిల్లీ: లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ మరోసారి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వీటి అమలుకు రెండు వారాలు తుది గడువునిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. లోధా కమిటీ ప్రతిపాదనలపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ మేరకు లోధా కమిటీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపేవరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిధులు జారీ చేయకూడదని బీసీసీఐకి సూచించింది. ఆ క్రమంలోనే లోధా ప్యానల్ ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ రాష్ట్ర సంఘాలు అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ ఆదేశించింది. దానిలో భాగంగా బీసీసీఐ అకౌంట్లను పరిశీలించేందుకు లోధా కమిటీ స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. -
సుప్రీంకోర్టు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి బీసీసీఐ వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. జులై 18న ఇచ్చిన తీర్పుతో పాటు జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను విచారణ నుంచి తప్పించాలంటూ బోర్డు రివ్యూ పిటిషన్ వేసింది. ఓపెన్ కోర్టు విచారణను కూడా ఇందులో బీసీసీఐ డిమాండ్ చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, ఎస్ఏ బోబ్డేలతో కూడిన బెంచీ ముందు ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రావాల్సింది. అయితే దీనిని మరో రెండు వారాల తర్వాత విచారించేందుకు వాయిదా వేశారు. బీసీసీఐ సీనియర్లు నిరంజన్‌షా, చందూ బోర్డేలు విడివిడిగా వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరగలేదు. -
గంగూలీని ఊరిస్తున్న మెగా చాన్స్!
లోధా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీంకోర్టు వెలువరించనున్న తీర్పు నేపథ్యంలో బీసీసీఐ ప్రస్తుత అధినాయకత్వానికి పదవీ గండం పొంచి ఉంది. లోధా కమిటీ సిఫారసుల విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఒకవేళ సుప్రీం తీర్పు కారణంగా ప్రస్తుత బోర్డు కార్యవర్గం దిగిపోవాల్సి రావొచ్చునని భావిస్తున్నారు. అదే జరిగితే భారత క్రికెట్ నియంత్రణ సంస్థ (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడి పగ్గాలు చేపట్టే అవకాశం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి దక్కే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది. భారత క్రికెట్ లో సమూల ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ సమర్థంగా అమలు చేయగలరనే వాదన క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటు క్రికెట్ ఆడిన అనుభవమే కాకుండా.. అటు బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా పరిపాలన అనుభవం కూడా గంగూలీకి ఉండటం కలిసొచ్చే విషయం. భారత క్రికెట్ జట్టు సారథిగా గంగూలీ అద్భుతమైన సేవలు అందించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ స్కాం భారత క్రికెట్ ను కుదిపేస్తున్న సమయంలో పగ్గాలు చేపట్టిన గంగూలీ ఎలాంటి మచ్చలేని సారథిగా పేరు తెచ్చుకున్నాడు. 'దాదాను అప్రోచ్ అయ్యే దమ్మ ఎవరికీ లేదు' అని ఓ బూకీ ఆన్ రికార్డు చెప్పడం గంగూలీ నిజాయితీని చాటేదే. అంతేకాకుండా తాను అనుకున్నది సాధించడానికి మంకుపట్టు పట్టడంలో దాదాను మించిన వారు లేరు. 2003 వరల్డ్ కప్ లో రాహుల్ ద్రవిడ్ తో కీపింగ్ చేయించడం.. ఇటీవల తన ప్రమేయంతో అనిల్ కుంబ్లేను టీమిండియాకు కోచ్ గా నియమించడం దాదా తీరు ఏమిటో స్పష్టం చేస్తాయి. అంతేకాకుండా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా తన నాయకత్వ పటిమను దాదా చాటాడు. టీ-20 వరల్డ్ కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సహా ఈడెన్ గార్డెన్ లో సవాలుతో కూడిన ఎన్నో మ్యాచ్‌లను సమర్థంగా నిర్వహించారు. అయితే, ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ)లోని ప్రత్యర్థులే కొందరు అడ్డుపడొచ్చునని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరి మాట వినకుండా దూకుడుగా వ్యవహరించే గంగూలీకి ఈ మధ్య సీఏబీలో ప్రత్యర్థులు పెరిగారట. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీకి పగ్గాలు అందిస్తే.. బోర్డుకు ఉత్తమ సారథిగా సేవలందించే అవకాశముందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అక్రమాలకు తావులేకుండా దేశంలో క్రికెట్ వ్యవహారాలు చక్కదిద్దాలంటే దాదా నాయకత్వంలో అది సాధ్యమవుతుందని అంటున్నారు. -
భవిష్య కార్యాచరణపై బీసీసీఐ కసరత్తు
న్యూఢిల్లీ:లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై తీర్పును సుప్రీంకోర్టు ఈ నెల 17వ తేదీ వరకూ రిజర్వ్ లో ఉంచడంతో అందుకు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తమ కసరత్తును తీవ్రతరం చేసింది దీనిలో భాగంగా శనివారం మరోసారి ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎం)ను నిర్వహించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు తమ తీర్పు వచ్చే వరకూ నిధులు మంజూరు చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో బీసీసీఐ చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీకి దూరమైన జమ్మూ-కశ్మీర్, రాజస్తాన్ రాష్ట్ర క్రికెట్ జట్ల అంశాన్నికూడా పరిశీలించనుంది. 'సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల నిధులను ఆపేయాల్సి వచ్చింది. దాంతో జమ్మూ-కశ్మీర్, రాజస్తాన్ రాష్ట్రాలు ప్రస్తుతం జరుగుతున్న రంజీ టోర్నమెంట్ కు దూరమయ్యాయి. సుప్రీం తీర్పు అంశాన్ని మా సభ్యులు నిర్ణయిస్తారు. ఈ మేరకు అక్టోబర్ 15వ తేదీన ఎస్జీఎం జరుగనుంది' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల అమలుకు తాము ఆమోదం తెలిపినట్లు రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సుమేంద్ర తివారీ తెలిపారు. 'గత రెండు ఏళ్ల నుంచి బీసీసీఐ నుంచి ఎటువంటి నిధులు తీసుకోవడం లేదు. దాంతో మేము ఎటువంటి సమావేశానికి రాకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ నుంచి మాకు రూ.100 కోట్లు రావాల్సి ఉంది' అని తివారీ పేర్కొన్నారు. -
చెన్నైపై నిషేధమే..
• స్వామి పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్సపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బెట్టింగ్ స్కామ్ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్‌తో పాటు సీఎస్కేపై రెండేళ్ల పాటు నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సీఎస్కే యజమాని శ్రీనివాసన్, ఆ జట్టు ఆటగాళ్లు ఎలాంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఈ క్రమంలో ఆర్ఎం లోధా కమిటీ విధించిన నిషేధం అక్రమమని స్వామి వాదించారు. అయితే లోధా ప్యానెల్ తీర్పు ఫైనల్ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన త్రిసభ్య బెంచ్ స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
బీసీసీఐకి సుప్రీం అల్టిమేటం
-
బీసీసీఐకి సుప్రీం అల్టిమేటం
న్యూఢిల్లీ:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రక్షాళన కోసం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయకపోతే ఏకంగా బోర్డునే మార్చాల్సి వస్తుందంటూ సుప్రీం అల్టిమేటం జారీ చేసింది. ఆ ప్రతిపాదనలను రేపటిలోగా అమలు చేయాలంటూ బోర్డుకు తుది గడువు ఇచ్చింది. ఈ మేరకు గురువారం లోధా కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. బీసీసీఐ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా మధ్యాహ్నం గం.2.00ని.లకు తిరిగి మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బీసీసీఐ వైఖరి సరైనది కాదంటూ పేర్కొంది. లోధా ప్యానల్ ప్రతిపాదనల్ని అమలు చేస్తామంటూ రాతపూర్వక పూచీకత్తును సమర్పించాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈరోజు విచారణలో భాగంగా బీసీసీఐలో ప్రక్షాళన తీసుకొచ్చేందుకు లోధా ప్యానెల్ ప్రతిపాదనలు సూచిస్తే వాటిని అమలు చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని మండిపడింది. దీనిలో భాగంగా బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు రూ.400 కోట్ల రూపాయల్ని బదిలీ చేయడాన్ని తప్పుబట్టింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పారదర్శకత విధానం ఉన్నట్లయితే రాత్రికి రాత్రి ఆ నిధులను ఎలా బదిలీ చేస్తారంటూ సుప్రీం ప్రశ్నించింది. అసలు బీసీసీఐలో ఉన్న వారి అర్హత ఏమిటో చెప్పాలంటూ విచారణ సందర్భంగా జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు. -
'రాత్రికి రాత్రే 400 కోట్లు ఎలా బదిలీ చేస్తారు'
న్యూఢిల్లీ: లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నిర్లక్ష్య ధోరణి మరోసారి సుప్రీంకోర్టుకు ఆగ్రహాన్ని తెప్పించింది. బీసీసీఐలో ప్రక్షాళన తీసుకొచ్చేందుకు లోధా ప్యానెల్ ప్రతిపాదనలు సూచిస్తే వాటిని అమలు చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సుప్రీం మండిపడింది. దీనిలో భాగంగా బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు రూ.400 కోట్ల రూపాయల్ని బదిలీ చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పారదర్శకత విధానం ఉన్నట్లయితే రాత్రికి రాత్రి ఆ నిధులను ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. అసలు బీసీసీఐలో ఉన్న వారి అర్హత ఏమిటో చెప్పాలంటూ జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు. జస్టిస్ ఆర్ఎం లోధా దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం సుప్రీంకోర్టు విచారిస్తుంది. దీనిలో భాగంగా ఇరు పక్షాల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. ఒకవైపు తమ ప్రతిపాదనల్ని అమలు చేయడంలో లెక్కలేనితనం ప్రదర్శిస్తున్న బీసీసీఐలో అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని తొలగించాలంటూ లోధా సుప్రీంను కోరింది. మరోవైపు తాము లోధా కమిటీ మెయిల్స్ కు స్పందించలేదంటూ చెప్పడం సరికాదని బీసీసీఐ పేర్కొంది. కోర్టుకు సమర్పించాల్సిన 40 మెయిల్స్ ను లోధా ప్యానెల్ కు పంపినట్లు బీసీసీఐ తెలిపింది. -
రచ్చ... రచ్చ...
బీసీసీఐ, లోధా కమిటీ మధ్య ముదిరిన వివాదం కివీస్‌తో సిరీస్ రద్దు చేస్తామన్న బోర్డు! మ్యాచ్‌లు ఎలా నిర్వహించాలని ప్రశ్న అకౌంట్లు స్థంభింపజేసే ఉద్దేశం లేదన్న కమిటీ లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహరిస్తున్న తీరు ఒక్కసారిగా కొత్త వివాదాన్ని రేపింది. ఒక వైపు సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తామంటూనే... మరో వైపు ’అది తప్ప’ అంటూ తానే బీసీసీఐ మినహాయింపులు తీసేసుకుంటోంది. ఈ ధిక్కార ధోరణిపై ఆగ్రహంతో ఉన్న కమిటీ, కొన్ని లావాదేవీలు నిలిపేయాలంటూ నేరుగా బ్యాంకులకే లేఖ రాయడం బోర్డుకు మంటెత్తించింది. దాంతో మేం అసలు క్రికెటే ఆడలేమంటూ హెచ్చరిస్తే, తాము అకౌంట్లలో తలదూర్చలేదంటూ కమిటీ వివరణ ఇచ్చింది. మొత్తంగా లోధా కమిటీతో నేరుగా తలపడుతూ పరోక్షంగా సుప్రీంనే ఎదిరిస్తున్న బీసీసీఐ ఈ వివాదాన్ని ఎక్కడి వరకు తీసుకెళుతుందో! ముంబై: బీసీసీఐని ప్రక్షాళన చేయడం కోసం తగిన సూచనలు చేసేందుకు ఏర్పాటైన లోధా కమిటీ ద్వారా... సంస్కరణల సంగతేమో కానీ రోజుకో కొత్త సమస్య ముందుకు వస్తోంది. తాజాగా రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నిధులు బదిలీ చేయరాదంటూ కమిటీ కోరడం బోర్డుకు రుచించలేదు. మా అకౌంట్లను ఎలా స్థంభింపజేస్తారని, డబ్బులు లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ ఎలా సాధ్యమని బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు ప్రశ్నించారు. అవసరమైతే ప్రస్తుతం జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ సిరీస్‌ను అర్ధాంతరంగా రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. బోర్డు అకౌంట్లను స్థంభింపజేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఇలాంటి స్థితిలో సిరీస్ రద్దు తప్ప మాకు మరో మార్గం లేదు. ప్రపంచం ముందు మా పరువు పోయేలా ఉంది. ఇప్పుడు మ్యాచ్‌లు ఎలా నిర్వహించాలి? డబ్బులు ఎవరు చెల్లిస్తారు? బ్యాంకు అకౌంట్లను స్థంభింపజేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక అంతర్జాతీయ జట్టు ఇక్కడ ఉందనే విషయం మరచిపోవద్దు’ అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే లోధా కమిటీ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. బీసీసీఐ అకౌంట్లను నిలిపివేయాలని తాము చెప్పలేదని, రోజువారీ కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగించవచ్చని కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. ’గత నెల 30న జరిగిన ఎస్‌జీఎంలో వివిధ రాష్ట్ర సంఘాలకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆర్థికపరమైన అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందువల్ల కేవలం రెండు అకౌంట్లనుంచి అసోసియేషన్లకు నిధుల పంపిణీ ఆపాలని మాత్రమే చెప్పాం. ఇదేమీ అత్యవసరం కూడా కాదు. మ్యాచ్‌ల నిర్వహణను అడ్డుకోవడం, సిరీస్ రద్దు చేయాలనే అంశాలపై మేమెప్పుడూ సూచనలు చేయలేదు’ అని ఆయన అన్నారు. బీసీసీఐ వాదన సరైనదేనా: లోధా కమిటీ బీసీసీఐ అకౌంట్ల గురించి అసలు ఏం చెప్పిందో స్పష్టంగా తెలీకుండా, ముందూ వెనకా చూడకుండా సిరీస్ రద్దు చేసేస్తామంటూ బోర్డు అధికారి ఒకరు ప్రకటించేశారు. ఇది ఒక తరహా బ్లాక్‌మెయిలింగే తప్ప వారి వాదనలో అర్థం లేదు. ‘సిరీస్ కొనసాగింపుపై ఇప్పుడే చెప్పలేను. మనం వరల్డ్ నంబర్‌వన్‌గా మారిన సమయంలో ఇలాంటిది దురదృష్టకరం. బీసీసీఐ చాలా బలమైన బోర్డు. డబ్బులు లేకుండా మేం ఆటను నడిపించలేం. మేం ప్రభుత్వంనుంచి డబ్బులు తీసుకోవడం లేదు. బ్యాంకులు నిధులు విడుదల చేయవద్దని చెప్పడం మంచి పరిణామం కాదు’ అని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. అయితే కేవలం రాష్ట్ర సంఘాలకు ఇప్పటికిప్పుడు అదనపు నిధులు ఇవ్వకపోయినంత మాత్రాన వచ్చిన సమస్య ఏమీ లేదు. ఆయా సంఘాలకు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఇవ్వాల్సిన డబ్బులను ఆపేయాలని లోధా కమిటీ చెప్పలేదు. కాబట్టి భారత్, కివీస్ సిరీస్‌కు ఎలాంటి సమస్య లేదు. కానీ బోర్డు మాత్రం లోధా కమిటీనే తప్పు చేసిందని చూపించే ప్రయత్నం చేస్తోంది. బీసీసీఐలో అవసరానికి మించి ఇప్పుడు ఇతరుల జోక్యం పెరిగిందని, ఇదే బోర్డు ద్వారానే క్రికెట్లో భారత్ సూపర్ పవర్‌గా ఎదిగిందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. మరో రివ్యూ పిటిషన్..: లోధా సిఫారసుల అమలు విషయంలో తమకు ఉన్న సమస్యలు ఏకరువు పెడుతూ సుప్రీం కోర్టులో గత నెల 27న బీసీసీఐ రెండో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆగస్టు 16న ఆ జట్టు వేసిన పిటిషన్‌ను సాంకేతిక కారణాలతో విచారణకు సుప్రీం స్వీకరించలేదు. కమిటీ సిఫారసుల అమలు విషయంలో తమ వాదనలను పూర్తిగా వినాలని, ఈ విషయంలో జులై 18న ఇచ్చిన తీర్పును పూర్తిగా రద్దు చేయాలని కోరింది. అయితే ఈ నెల 6న లోధా కమిటీ వాదనలు, బీసీసీఐ వివరణల అనంతరం సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. -
ఐపీఎల్ లేదా చాంపియన్స్ ట్రోఫీ!
ఒక టోర్నీలోనే ఆడగలమన్న బీసీసీఐ కోల్‌కతా: లోధా కమిటీ సిఫారసుల్లో చాలా అంశాలను తాము ఇప్పటికే అమల్లోకి తెచ్చామని, అయితే కొన్ని విషయాల్లో ఉన్న సమస్యలను సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. తాము సుప్రీంను గౌరవిస్తామని, అయితే తమకు బోర్డు నియమావళి కూడా ముఖ్యమని ఆయన చెప్పారు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత 15 రోజుల చొప్పున విరామం ఉండాలని లోధా కమిటీ చెబుతోందని... ఇలాంటి స్థితిలో తాము వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ లేదా ఐపీఎల్‌లలో ఒక దానినే ఎంచుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. చాంపియన్స ట్రోఫీ జూన్ 1నుంచి ప్రారంభం కానుండగా, ఐపీఎల్ మే చివరి వారంలో ముగుస్తుంది. బిజీ షెడ్యూల్లో ఐపీఎల్‌ను వేరే తేదీల్లో నిర్వహించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. భారత క్రికెట్‌పై ఎంతో ప్రభావం చూపించిన పలు దేశవాళీ జట్లకు ఒకే రాష్ట్రం-ఒకే ఓటు నిబంధన ఇబ్బందులు సృష్టిస్తుందని, అందుకే ఆ సూచనను వ్యతిరేకిస్తున్నట్లు ఠాకూర్ వెల్లడించారు. మరో వైపు బీసీసీఐ అకౌంట్లనుంచి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు డబ్బులు బదిలీ చేయరాదంటూ లోధా కమిటీ రెండు బ్యాంకులను కోరింది. సెప్టెంబర్ 30న ఎస్‌జీఎంలో బీసీసీఐ తీసుకున్న కొన్ని ఆర్థిక పరమైన నిర్ణయాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉన్నాయని, అందు వల్ల దీనికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని లోధా కమిటీ సదరు బ్యాంకులకు లేఖ రాసింది. క్రికెట్ అభివృద్ధి కోసం వివిధ రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఇస్తున్న రూ. 60 కోట్లకు అదనంగా మరో రూ. 10 కోట్లు ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. -
బీసీసీఐ అదే ధోరణి...
ముంబై: లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడం లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధోరణిలో మార్పు రాలేదు. ఈ ప్రతిపాదనలపై చర్చించడానికి శనివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ముగ్గురు సెలక్టర్లు, 70 ఏళ్ల వయో పరిమితి, ఒక రాష్ట్రానికి ఒక ఓటు లాంటి కీలక ప్రతిపాదనలపై ఇందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అరుుతే అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఐపీఎల్ కౌన్సిల్లో కూడా కాగ్ సభ్యుడికి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని సమావేశంలో నిర్ణరుుంచారు. జాతీయ జట్టు మ్యాచ్‌లకు, ఐపీఎల్‌కు 15 రోజుల విరామం ఉండాలనే ప్రతిపాదన 2017లో అమలు చేయడం సాధ్యం కాదని బీసీసీఐ తెలిపింది. -
బీసీసీఐ క్లీన్‌బౌల్డ్...
-
బీసీసీఐ క్లీన్‌బౌల్డ్...
►లోధా కమిటీ సిఫారసులు అమలు చేయనందుకు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం ► బోర్డు తమ గురించి గొప్పగా ఊహించుకుంటోంది ► అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలనూ పట్టించుకోరా? ► మా మాట వింటే సరి... లేదంటే వినేలా చేస్తాం ► చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్య భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లెక్కలేనితనం దేశ అత్యున్నత న్యాయ స్థానానికే ఆగ్రహం తెప్పించింది. బోర్డును సంస్కరించే దిశగా కొత్తగా చేసిన సూచనలను పట్టించుకోకపోవడంతో పాటు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లో అసహనాన్ని పెంచింది. అసలు మీ గురించి మీరేం అనుకుంటున్నారు అంటూ తీవ్రంగా ప్రశ్నించిన కోర్టు... ఇలాంటి వాటిని ఎలా సరిదిద్దాలో తమకు బాగా తెలుసంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు పరిపాలనలో ప్రక్షాళన గురించి సిఫారసు చేసిన లోధా కమిటీ కూడా బోర్డు అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గాన్ని కూడా వెంటనే తప్పించాలంటూ కోరడం మరో కోణం. మొత్తంగా బీసీసీఐ, సుప్రీంకోర్టు మధ్య వివాదం ముదరడం అనూహ్య పరిణామం. న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఇలా అయితే తాము మరో రకంగా తీర్పును అమలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. బోర్డులో పలు సంస్కరణలకు సూచనలు చేస్తూ లోధా కమిటీ సమర్పించిన నివేదికను జులై 18న సుప్రీం ఆమోదించింది. అయితే ఇప్పటి వరకు బోర్డు వీటిని అమలు చేసేందుకు ప్రయత్నించడం లేదని, పైగా ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తుంటే జస్టిస్ ఆర్ఎం లోధా మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై స్పందిస్తూ ‘తాము చట్టానికి అతీతులమని బీసీసీఐ భావిస్తోంది. మా ఆదేశాలు అమలు చేయించేందుకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు. తమను తాము గొప్పగా బోర్డు ఊహించుకుంటోంది. మీరు ఇప్పుడైనా మాట వింటే సరి. లేదంటే వినేలా చేయగలం. బోర్డు వ్యవహారశైలి ఘోరంగా ఉంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. బోర్డు ఇలా చేస్తుందని మేం ఊహిస్తూనే ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించమంటూ మరో ఉత్తర్వు ఇవ్వడం కోర్టుకు పెద్ద సమస్య కాదు’ అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సమాధానం ఇచ్చేందుకు బోర్డుకు సుప్రీం మరో వారం రోజులు గడువు ఇస్తూ అక్టోబర్ 6కు కేసును వారుుదా వేసింది. వాస్తవానికి లోధా కమిటీ సిఫారసుల అమల్లో ఉన్న సమస్యల గురించి బీసీసీఐ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసింది. అయితే పలు సాంకేతిక లోపాలను చూపించి సుప్రీం దీనిని పరిశీలనలోకి తీసుకోలేదు. మరోవైపు ఈ నెల 30 (శుక్రవారం)న ప్రత్యేక సమావేశం (ఎస్జీఎం) నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పరిస్థితి చేరుు దాటిపోతున్న నేపథ్యంలో లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో ఇక్కడే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిని ఆఖరి అవకాశంగా బోర్డు సభ్యులు భావిస్తున్నారు. అనురాగ్ ఠాకూర్‌ను తప్పించండి... ఈ నెల 21న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది. సాధారణ అకౌంట్ల ఆమోదం, బడ్జెట్‌లాంటి అంశాలకే ఈ సమావేశాన్ని పరిమితం చేయాలని బోర్డు సీఈ రాహుల్ జోహ్రికి లోధా కమిటీ సూచించింది. అరుుతే దీనిని పట్టించుకోని బోర్డు ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఎంపికతో పాటు కార్యదర్శిగా అజయ్ షిర్కే నియామకాన్ని కూడా ఖరారు చేసింది. ఈ సమావేశం అజెండాలో చేర్చిన దాదాపు అన్ని అంశాలు తమ సిఫారసులకు వ్యతిరేకంగా ఉన్నాయని కమిటీ భావించింది. దాంతో తాజా పరిస్థితిపై ఒక నివేదికను కమిటీ సుప్రీం కోర్టు ముందుంచింది. తమ ప్రతిపాదనలను బోర్డు అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఇందులో ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ అంశాలను సుప్రీం దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పింది. ‘మాకు పూర్తిగా సహకరిస్తామని గతంలో బీసీసీఐ చాలా సార్లు చెప్పింది. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. సుప్రీం ఆదేశాలను బోర్డు ఆఫీస్ బేరర్లు ఉల్లంఘిస్తున్నారు. కొన్ని అంశాలను అమల్లోకి తెచ్చేందుకు ఏడు వేర్వేరు గడువులను విధించాం. కానీ అందులో మొదటిదైన సెప్టెంబర్ 30లోగా ఏదీ అమలయ్యేలా కనిపించడం లేదు. తగిన అర్హతలు లేకుండానే షిర్కే కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జులై 18న తర్వాత బోర్డు తీసుకున్న అన్ని నిర్ణయాలు నిలిపేయాలని కోరుతున్నాం. అదే విధంగా ప్రస్తుత బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సహా ఇతర కమిటీ సభ్యులను కూడా వెంటనే తప్పించి కొత్తగా మరో ప్యానెల్‌కు బాధ్యతలు అప్పగించాలి. అప్పుడే సిఫారసుల అమలు సాధ్యమవుతుంది’ అని జస్టిస్ లోధా తమ నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా ఠాకూర్ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ‘మాతో చర్చించేందుకు ఎన్ని సార్లు సమాచారం ఇచ్చినా కనీసం ఒక్కసారి కూడా ఆయన స్పందించలేదు. పైగా కోర్టు ఉత్తర్వులను తక్కువ చేసి చూపి అనేక అభ్యంతరకర మాటలు వాడారు. ఎన్నడూ క్రికెట్ ఆడని వారు బోర్డును నడిపించాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మాకు వ్యతిరేకంగా లేఖ రాయాలంటూ ఐసీసీని కూడా కోరారు’ అని లోధా తమ అసంతృప్తిని ప్రదర్శించారు. ఖోడా, పరాంజపే అవుట్! తాజా పరిణామాల నేపథ్యంలో మొదటి చర్యగా సెలక్షన్ కమిటీని ఐదుగురు నుంచి ముగ్గురికి పరిమితం చేయాలని బోర్డు భావి స్తున్నట్లు సమాచారం. లోధా సిఫారసులలో ఇది కూడా ఉంది. పైగా కచ్చితంగా టెస్టు ఆడి ఉండాలనే నిబంధన కూడా ఉంది. దీని ప్రకారం ప్రస్తుత సెలక్షన్ కమిటీ సభ్యులైన గగన్ ఖోడా, జతిన్ పరాంజపే భారత్‌కు వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి వీరిద్దరిని తప్పించే అవకాశం ఉంది. ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్‌లు మాత్రం కొనసాగుతారు. అయితే ‘ప్రతిభాన్వేషణ’ పేరుతో దేశవాళీ మ్యాచ్‌లు చూసే విధంగా సెలక్టర్లకు సహా యకారిగా ఉండేందుకు మరో హోదాతో ఖోడా, పరాంజపేలను ఎంపిక చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), దాని అనుబంధ సంఘాలకు జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల మేరకే ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్‌సీఏ సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని నమోదు చేసుకున్న జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, దానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలను జరిపేలా అసోసియేషన్ నిబంధనలను హెచ్‌సీఏ సవరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేస్తున్నారో లేదో చెప్పాలని హెచ్‌సీఏను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సోమవారం హెచ్‌సీఏ తాము లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తామని, దాని ప్రకారమే ఎన్నికలు జరుపుతామని సమాధానమిచ్చింది. -
కొన్ని సూచనలు మరీ అతిగా ఉన్నాయి
లోధా కమిషన్‌పై కపిల్, గావస్కర్ కాన్పూర్: భారత క్రికెట్ ప్రక్షాళన కోసం జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలపై పలువురు సీనియర్ క్రికెటర్లు తమ నిరసన గళం విప్పుతున్నారు. వారు పేర్కొన్న కొన్ని సూచనలు మరీ కఠినంగా ఉన్నాయని మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ అన్నారు. ఒక రాష్ట్రానికి ఒక ఓటు, కూలింగ్ పీరియడ్ అమలు సరికాదన్నారు. ఇంతకుముందే మాజీ కెప్టెన్ రవిశాస్త్రి కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘లోధా ప్యానెల్‌పై వారి ప్రతిపాదనలపై నాకు అపార గౌరవం ఉంది. అయితే ఒక రాష్ట్రం, ఒక ఓటు అనేది ఆయా రాష్ట్ర సంఘాలకే కాకుండా బీసీసీఐకి కూడా కాస్త కఠినంగానే ఉంది. ఇంగ్లండ్‌లో ప్రతీ కౌంటీ జట్టు ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనవు. అలాగే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో కూడా ప్రతీ ఆస్ట్రేలియా రాష్ట్ర జట్టు పాల్గొనదు. అదే ఇక్కడ ప్రతీ రాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీలో పాల్గొంటే క్రికెట్ ప్రమాణాలు పడిపోతారుు. ఇది అంతర్జాతీయస్థాయిలో మనకు మేలు చేయదు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం జూనియర్ స్థాయిలో మెరుగ్గా రాణించిన జట్టు పైస్థాయికి ప్రమోట్ అవుతుంది. అంతేకానీ నేరుగా రంజీ ట్రోఫీకి అర్హత ఇవ్వడం సరికాదు’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు లోధా కమిటీ సూచనలు కొన్ని బాగానే ఉన్నా మరికొన్ని మాత్రం పంటి కింద రారుులా ఇబ్బంది పెడుతున్నాయని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. -
లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నారా?లేదా?
వివరణ ఇవ్వాలని హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు శుక్రవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలను నిర్వహించేలా అసోసియేషన్ నిబంధనలను హెచ్‌సీఏ సవరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేస్తున్నారో లేదో హెచ్‌సీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
చీఫ్ జస్టిస్‌ను తప్పించండి!
‘లోధా’ కేసులో బీసీసీఐ రివ్యూ పిటిషన్ ముంబై: లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుప్రీం కోర్టుతోనే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. లోధా ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ జులై 18న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ‘సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 19 (ఎ) (సి) ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోంది. తీర్పు ఇచ్చే ముందు ఇద్దరు సభ్యులు వాస్తవాలను పరిగణలోకి తీసుకోలేదు’ అని ఈ పిటిషన్లో పేర్కొంది. అన్నింటికి మించి తదుపరి విచారణనుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను తప్పించాలని కూడా కోరింది. బోర్డుకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నారని, నిష్పాక్షిక విచారణ జరగడం లేదని తాము భావిస్తున్నామన్న బీసీసీఐ... ఐదుగురు సభ్యుల బెంచ్ ముందు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరింది. బీసీసీఐకి ఈ కేసులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ కట్జూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. -
ఎన్నికలను నిర్వహించవద్దు!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ సిఫారసుల ప్రభావం దేశంలోని వివిధ క్రికెట్ సంఘాల ఎన్నికలపై పడింది. కమిటీ సిఫారసులను ఆరు నెలల్లో ఆమోదించాల్సిన నేపథ్యంలో రాబోయే కొన్ని రోజుల్లో ఏ అసోసియేషన్‌కూ ఎన్నికలు నిర్వహించవద్దని బీసీసీఐకి కమిటీ సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31న బెంగాల్, కర్ణాటక క్రికెట్ సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. -
చాలిక..మారండి
-
‘లోధా’ ప్రభావం షురూ
కాన్పూర్: లోధా కమిటీ సిఫారసులను బీసీసీఐ అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన మరుసటి రోజే ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంఘంలో 70 ఏళ్లకు పైబడిన ఐదుగురు డెరైక్టర్లు మంగళవారం తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వీరితో పాటు కీలక పదవిలో ఉన్న యూపీసీఏ కోశాధికారి కేఎన్ టాండన్ (80) కూడా త్వరలోనే తప్పుకోనున్నట్లు సమాచారం మరో వైపు ఢిల్లీ క్రికెట్ సంఘం కూడా లోధా సిఫారసుల ప్రకారం ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో మార్పులు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. -
ఆరు నెలల్లో అమలు చేయండి
-
బీసీసీఐ పిటిషన్‌పై ఆదేశాలు నిలుపుదల
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల అమలుపై బీసీసీఐ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఇంతకుముందే దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తమ ఆదేశాలను నిలుపుదల చేసింది. అలాగే ఆయా క్రికెట్ సంఘాలకు నిధుల పంపిణీ, వాటి వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల గోవా క్రికెట్ సంఘం నిధులను దుర్వినియోగం చేసినందుకు వారి ఆఫీస్ బేరర్ల అరెస్ట్ విషయం కోర్టు గుర్తుచేసింది. ఎలాంటి వినియోగ సర్టిఫికెట్స్ లేకుండానే బీసీసీఐ ఎందుకు నిధులను పంపిణీ చేస్తుందని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎంఐ కలీఫుల్లాలతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. -
‘లోధా’ ప్రతిపాదనలపై బీసీసీఐ అఫిడవిట్
న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బీసీసీఐ తమ చివరి ప్రయత్నాలను ప్రారంభించింది. ఈమేరకు మంగళవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్యానెల్ సూచించినట్టుగా బోర్డును పునర్నిర్మించడంపై తమకున్న అభ్యంతరాలను అందులో పేర్కొంది. ‘ఒక రాష్ర్టం.. ఒక ఓటు’ సూచనపై ఇతర రాష్ట్ర యూనిట్లు అసంతృప్తితో ఉన్నాయని పేర్కొంది. 60 పేజీలతో కూడిన తమ అఫిడవిట్‌ను బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సుప్రీంలో దాఖలు చేశారు. మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఎలాంటి పదవులు చేపట్టకుండా నిరోధించాలనే ప్రతిపాదన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (సి)ని ఉల్లంఘించినట్టే అవుతుందని గుర్తుచేసింది. అలాగే ఆఫీస్ బేరర్ల గరిష్ట వయస్సుపై, సెలక్టర్ల సంఖ్య తగ్గింపుపై కూడా తమ వాదనలను అందులో పేర్కొంది. -
నేడు బీసీసీఐ ఎస్జీఎం
జస్టిస్ లోధా కమిటీ నివేదికపై చర్చ ముంబై: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై చర్చించేందుకు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) శుక్రవారం జరగనుంది. కమిటీ నివేదికను అమలు చేసే విషయంలో స్పష్టతనిచ్చేందుకు మార్చి 3 వరకు సుప్రీం కోర్టు బోర్డుకు గడువునిచ్చింది. బీసీసీఐలోని అధికారుల గరిష్ట వయస్సు 70 ఏళ్లు, ఒక రాష్ట్రానికి ఒక ఓటుతో పాటు ఆఫీస్ బేరర్లుగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచాలని కమిటీ కీలక ప్రతిపాదనలను చేసిన విషయం తెలిసిందే. ఈ నెలారంభంలో తమ న్యాయ కమిటీ సమావేశం అనంతరం బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఎస్జీఎం ఏర్పాటుకు నిర్ణయించారు. దీంట్లోని కొన్ని సూచనలు అమలుకు సాధ్యం కాకుండా ఉన్నాయని, ఇందుకోసం నిపుణుల అభిప్రాయం తీసుకోవాలనే ఆలోచనలో బోర్డు ఉంది. మరోవైపు ఐసీసీ సభ్యదేశాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఎస్‌జీఎంలో చర్చించనున్నారు. శ్రీనివాసన్ హయాంలో మూడు దేశాల (భారత్, ఆసీస్, ఇంగ్లండ్)కు ఇచ్చిన సూపర్ పవర్‌ను ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌గా ఉన్న శశాంక్ తొలగించారు. న్యాయ సలహా తీసుకుంటా..: హర్భజన్ వివిధ రాష్ట్ర జట్లకు ‘భజ్జీ స్పోర్ట్స్’ పేరిట కిట్స్‌ను సరఫరా చేస్తున్న హర్భజన్ పరస్పర విరుద్ధ ప్రయోజాలనాలకు పాల్పడుతున్నట్టు బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఏపీ షా తేల్చడంపై న్యాయ సలహా తీసుకుంటానని స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ‘బోర్డు నుంచి ఈ విషయంలో ఈమెయిల్ అందింది. మా న్యాయ సలహాదారునితో అన్ని విషయాలను చర్చించిన అనంతరం ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తా’ అని హర్భజన్ తెలిపాడు. సామాజిక కార్యకర్త నీరజ్ గుండే లేవనెత్తిన అంశాలపై షా విచారణ చేపట్టారు. మరోవైపు ఈ కంపెనీ భజ్జీ తల్లి అవతార్ కౌర్ పేరిట నడుస్తోంది. -
బీసీసీఐ ఎస్జీఎం 19న!
ముంబై: లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేసే విషయంపై చర్చించేందుకు బీసీసీఐ తమ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్జీఎం) ఏర్పాటు చేయనుంది. ఈ ఎస్జీఎం ఈనెల 19న జరిగే అవకాశముంది. ఆ తర్వాతే సుప్రీంకోర్టుకు తమ స్పందన తెలుపనుంది. ఆదివారం జరిగిన బోర్డు లీగల్ ప్యానెల్ సమావేశంలో అధ్యక్షుడు శశాంక్ మనోహర్, పీఎస్ రామన్ (తమిళనాడు, చైర్మన్), డీవీఎస్ఎస్ సోమయాజులు (ఆంధ్ర), అభయ్ ఆప్టే (మహారాష్ట్ర), కోశాధికారి అనిరుధ్ చౌధరి పాల్గొన్నారు. కమిటీకి సంబంధిన ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర యూ నిట్ల తో ఎస్‌జీఎంలో చర్చించాలని సమావేశం లో నిర్ణయించారు. బోర్డు అధ్యక్షుడిగా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని 10 రోజుల్లో ఎస్జీఎం ఏర్పాటుకు శశాంక్ మనోహర్ నోటీసు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతకుముందు బోర్డులో ప్రక్షాళన కోసం లోధా కమిటీ చేసిన సూచనలను అమలుపరచాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. -
తప్పించుకోవాలని చూడటం లేదు
న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడానికి కాస్త సమయం పడుతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము తప్పించుకోవడానికి మార్గాలు వెతకడం లేదన్నారు. అయితే అమలు చేసే ముందు నివేదికకు సంబంధించిన మంచి, చెడులను చెప్పే హక్కు తమకుందని తెలిపారు. ‘బోర్డులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని మేం కూడా నమ్ముతున్నాం. గత తొమ్మిది నెలలుగా అదే పని చేస్తున్నాం. మేం సరైన దిశలోనే వెళ్తున్నామని మా పనులే చెబుతున్నాయి. లోధా కమిటీ చాలా ప్రతిపాదనలు చేసింది. అయితే అందులో మంచేదో, చెడేదో చెప్పే హక్కు మాకుంది’ అని ఠాకూర్ పేర్కొన్నారు. లోధా కమిటీ ప్రతిపాదనల్లో సహేతుకతపై తాను స్పందించనని చెప్పారు. ఓవరాల్‌గా కమిటీ ప్రతిపాదనలపై కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసిన కార్యదర్శి గత 30, 40 ఏళ్లుగా బీసీసీఐలో జరుగుతున్నదంతా తప్పే అంటే ఎలా అని, జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ప్రతిపాదనలను బోర్డు న్యాయబృందం పరిశీలిస్తోందని, ఈనెల 7న దీనిపై తమ ఉద్దేశాలను వెల్లడిస్తామని చెప్పారు. సోమవారం తుది గడువు: టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను పొందేందుకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు బీసీసీఐ సోమవారం వరకు తుది గడువు ఇచ్చింది. ఈ లోగా అన్ని అంశాలకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలు సమర్పించకపోతే ప్లాన్-బిని అమలు చేస్తామని ఠాకూర్ వెల్లడించారు. మరోవైపు కోట్లా స్టేడియంలో జరుగుతున్న పనులను కూడా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం పరిశీలించనున్నారు. అలాగే డీడీసీఏ దాఖలు చేసిన ఎన్ఓసీ, స్టేడియం పనుల పురోగతిపై కూడా ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
బీసీసీఐ సమూల ప్రక్షాళన
♦ బీసీసీఐలో మార్పులకు లోధా కమిటీ ప్రతిపాదనలు ♦ సుప్రీం కోర్టు చేతుల్లో తుది నిర్ణయం ♦ అమల్లోకి వస్తే ప్రస్తుత పెద్దలంతా అవుట్ భారత క్రికెట్ నియంత్రణ మండలి పుట్టిన దగ్గరినుంచి నియంత్రణ లేకుండా సాగుతున్న పరిపాలనకు త్వరలోనే ఫుల్స్టాప్ పడనుందా... తాము ‘ఆడించిందే’ ఆట అన్నట్లుగా బోర్డులో సుదీర్ఘంగా పాతుకుపోయిన పెద్దలకు చెక్ చెప్పే సమయం ఆసన్నమైందా... మేం రాసుకుందే రాజ్యాంగం, ప్రభుత్వానికి కూడా మేం జవాబుదారీ కాదు అన్నట్లుగా వ్యవహరించే క్రికెట్ అడ్డా... ఇకపై అడ్డగోలుగా వ్యవహరించకుండా బంధనాలు రాబోతున్నాయా..? ఐపీఎల్లో ఫిక్సింగ్, బెట్టింగ్తో మొదలైన వివాదానికి క్లైమాక్స్‌గా జస్టిస్ లోధా కమిటీ భారీ నివేదిక ఇచ్చింది. పలు మార్పులు సూచిస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. ఇది అమల్లోకి వస్తుందా? రాదా? అనేది సుప్రీం కోర్టు చేతుల్లో ఉంది. న్యూఢిల్లీ: బీసీసీఐలో సమూల ప్రక్షాళనకు సిఫారసు చేస్తూ జస్టిస్ లోధా కమిటీ సంచలన నివేదిక ఇచ్చింది. బోర్డులో మార్పులతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనేక ప్రతిపాదనలు చేసింది. ఆఫీస్ బేరర్ల పదవీకాలానికి పరిమితులు విధించడం మొదలు రాష్ట్ర సంఘాల్లో ఓటింగ్ హక్కు, సెలక్షన్ కమిటీ ఎంపిక, బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తీసుకు రావడం వరకు అనేక అంశాలు ఉన్నాయి. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని సూచించడం కూడా కమిటీనుంచి వచ్చిన అనూహ్య ప్రతిపాదన. ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లోధాతో పాటు జస్టిస్ అశోక్ భాన్, జస్టిస్ ఆర్. రవీంద్రన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐపీఎల్లో చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు, మెయప్పన్, రాజ్ కుంద్రాలకు శిక్షలు ప్రతిపాదించడంతో పాటు బీసీసీఐ పనితీరుపై తగిన ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కమిటీని కోరింది. తాజా నివేదికను కమిటీ సుప్రీంకే సమర్పిస్తుంది. ఇందులోని చాలా అంశాలు ప్రస్తుతం సాగుతున్న పరిపాలనా శైలికి ముగింపు పలికే విధంగానే ఉన్నాయి. కమిటీ చేసిన ప్రతిపాదనలు అవి అమల్లోకి వస్తే పడే ప్రభావం ఏమిటో చూద్దాం.... 1 ప్రతిపాదన: 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదు. ప్రభావం: ఇది అమల్లోకి వస్తే శరద్‌పవార్ (75 ఏళ్లు), శ్రీనివాసన్ (71), నిరంజన్ షా (71)లతో పాటు పాండోవ్, ఐఎస్ బింద్రా లాంటి అనేకమంది క్రికెట్ పరిపాలనకు దూరమవుతారు. 2 ప్రతిపాదన : ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే. ప్రభావం: ఇది అమల్లోకి వస్తే శశాంక్ మనోహర్ కనీసం బీసీసీఐ సమావేశంలో ఓటు వేయలేరు. మహారాష్ట్ర సంఘానికి మాత్రమే ఓటు ఉంటుంది. విదర్భ, ముంబై సంఘాలు నామమాత్రంగా మారిపోతాయి. ఇలాగే గుజరాత్‌లోనూ జరుగుతుంది. నగరం ఆధారంగా ఉన్న సంఘాలు పోయి చత్తీస్‌గఢ్, తెలంగాణ, బీహార్‌లకు ఓటు హక్కువస్తుంది. 3 ప్రతిపాదన: ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలి. అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలి. ప్రభావం: అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం బోర్డు కార్యదర్శి. తన పదవీకాలం పూర్తి కాగానే తిరిగి అధ్యక్ష పదవికో, కార్యదర్శి పదవికో పోటీ చేయలేరు. మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. 4.ప్రతిపాదన: బీసీసీఐ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే (మూడేళ్ల చొప్పున) పదవిలో ఉండాలి. ఆ త ర్వాత మరే పదవిలోనూ ఉండకూడదు. ప్రభావం: శశాంక్ మనోహర్ ప్రస్తుత పదవీకాలం ముగిస్తే ఆరేళ్లు పూర్తవుతుంది. ఇక ఆ యన బీసీసీఐలో ఎలాంటి పదవిలోనూ ఉండరు. 5.ప్రతిపాదన: ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదు. ప్రభావం: ప్రస్తుతం బీసీసీఐలో ఉన్న పెద్దలంతా తమ రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు. వారంతా ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. 6.ప్రతిపాదన: సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. వాళ్లు కూడా కచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడినవారై ఉండాలి. ప్రభావం: ప్రస్తుత సెలక్టర్లలో ఖోడా కేవలం వన్డేలు ఆడాడు. కాబట్టి తను అనర్హుడు. అలాగే రాథోడ్, సాబా కరీమ్, ఎమ్మెస్కే ప్రసాద్, సందీప్ పాటిల్ (చైర్మన్)లలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. 7.ప్రతిపాదన: బెట్టింగ్‌ను చట్టబద్దం చేయడం ప్రభావం: విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లండ్‌లోని ప్రముఖ బెట్టింగ్ కంపెనీలు భారత్‌లోనూ తమ కార్యకలాపాలు చేపడతాయి. 8. ప్రతిపాదన: బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తేవాలి. ప్రభావం: ఇకపై సామాన్యులు కూడా బీసీసీఐ వ్యవహారాలను, చెల్లింపులను తెలుసుకోవచ్చు. ఏం జరుగుతుంది? లోధా కమిటీ ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రమే చేసి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇవన్నీ కచ్చితంగా అమలు కావాలని నిబంధన ఏమీ లేదు. ముందుగా ఈ నివేదికపై సుప్రీంకోర్టు బీసీసీఐ అభిప్రాయాన్ని కోరుతుంది. వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి బోర్డు తరఫున వివరణ ఇచ్చుకునే అవకాశం ఇస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే బోర్డు పెద్దలకు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా వయో పరిమితి, రెండు సార్లు ఎన్నిక కావడానికి మధ్య విరామం ఇవ్వాలనే అంశాలే బోర్డు పెద్దలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై బోర్డు గట్టిగా వాదించే అవకాశం ఉంది. ‘నివేదికను పూర్తిగా చదివిన తర్వాతే నా అభిప్రాయం చెబుతాను’ అని బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వెల్లడించారు. అయితే శరద్‌పవార్‌లాంటి వారు ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని, 70 ఏళ్లు దాటారని పని చేయకూడదా అని ఒక బోర్డు సభ్యుడు ప్రశ్నిస్తే... బాగా పని చేసినప్పుడు వరుసగా ఎన్నిక కాకుండా ఎందుకు నిరోధించాలని మరొకరు అడుగుతున్నారు. అన్నింటికి మించి ముగ్గురు సెలక్టర్లు 27 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను ఎలా చూడగలరనేది మరొకరి సందేహం. మొత్తానికి సుప్రీం కోర్టులో బీసీసీఐ ఎలాంటి వాదన వినిపిస్తుందనేది ఆసక్తికరం. బోర్డు తన వాదనలు వినిపించి సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేయడానికి బాగానే సమయం పట్టొచ్చు. మరికొన్ని ప్రతిపాదనలు... ♦ బోర్డు అధ్యక్ష పదవిని రొటేషన్ పద్ధతిలో ఒక్కో జోన్‌కు కేటాయిస్తున్నారు. ఈ విధానాన్ని తొలగించాలి. బోర్డు ఎన్నికల సమయంలో అధ్యక్షుడికి ఇప్పుడు మూడు ఓట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి తప్పించాలి. ♦రోజూవారీ కార్యకలాపాలను పర్యవేక్షించించేందుకు సీఈఓను నియమించాలి. ఆటగాళ్ల తరఫున మాట్లాడేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ప్లేయర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. 9 మంది సభ్యులతో అపెక్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి ఒక మహిళ సహా ముగ్గురు ఆటగాళ్లు అందులో సభ్యులుగా ఉండాలి. ♦ 9 మంది సభ్యులతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను విస్తరించి అందులో ఇద్దరు ఫ్రాంచైజీల తరఫున, ఒకరు ప్లేయర్స్ అసోసియేషన్ తరఫున ఉండేలా చూడాలి. మరొకరు ప్రభుత్వ ప్రతినిధిగా ‘కాగ్’ నామినేట్ చేసిన వ్యక్తిని నియమించాలి. ♦ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’పై దృష్టి పెట్టేందుకు ఒక నైతిక విలువల అధికారిని నియమించాలి. సుందర్ రామన్‌కు క్లీన్ చిట్ బుకీలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎల్ మాజీ సీఓఓ సుందర్ రామన్‌కు కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. అతడిని దోషిగా తేల్చేందుకు ఎలాంటి ఆధారం లభించలేదని కమిటీ పేర్కొంది. అతనిపై వచ్చిన ఏడు రకాల ఆరోపణల్లో ఒక్కదాంట్లోనూ బలం లేదని, కాబట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. త్వరలో బోర్డు ఎస్జీఎం న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు వారాల్లోపే ఎస్‌జీఎంను సమావేశపరచాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం కోసం నేడు (మంగళవారం) ఉన్నతాధికారులంతా ముంబైకి రానున్నారు. ఇక్కడే ఎస్జీఎం ఎప్పుడనేది తేలనుంది. నివేదికలోని కొన్ని అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. మరోవైపు ఈ రిపోర్టుపై బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కడే 652 నాటౌట్! స్కూల్ కుర్రాడి ప్రపంచరికార్డు ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే సంచలనం సృష్టించాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సోమవారం ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ బ్యాట్స్‌మన్ ప్రణవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 199 బంతుల్లో అతను 652 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. మైనర్ క్రికెట్లో ఈ రికార్డు నమోదు చేసినా... ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉంది. ఇప్పుడు ప్రణవ్ 116 సంవత్సరాల ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పృథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది. -
ఒక్క రాష్ట్రానికి ఒక్కటే సంఘం!
► బీసీసీఐలో మార్పుల గురించి లోధా కమిటీ సూచనలు ► నివేదిక జనవరి 4న కోర్టు ముందుకు న్యూఢిల్లీ: బీసీసీఐ నిర్వహణలో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉండకూడదు... ఒక్క రాష్ట్రానికి ఒక్కటే క్రికెట్ సంఘం ఉండాలి... బీసీసీఐలో ఉండే వ్యక్తులు రాష్ట్ర సంఘాల్లో ఎలాంటి పదవుల్లో ఉండకూడు... సుప్రీం కోర్టుకు జస్టిస్ లోధా కమిటీ సమర్పించబోతున్న నివేదికలోని కొన్ని అంశాలు ఇవి. జనవరి 4న కమిటీ తన తుది నివేదికను కోర్డుకు సమర్పించబోతోంది. విశ్వసనీయ సమచారం ప్రకారం... ఆ నివేదికలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని లోధా కమిటీ సూచించబోతోంది. ప్రస్తుతం బీసీసీఐ 1975 తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజస్టర్ అయి ఉంది. దీనిని పబ్లిక్ ట్రస్ట్ లేదా కంపెనీగా మార్చాలనేది సూచన. ఈ నివేదిక రూపొందించేందుకు క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు, లాయర్లు, ప్రముఖ వ్యక్తులతో వివిధ అంశాలతో కమిటీ చర్చించింది. ‘కమిటీ ప్రతిపాదనలు మెజారిటీ అభిప్రాయాన్ని వ్యక్తపరచనున్నాయి. క్రికెటర్లు కానివారికి ఇవి రుచించకపోవచ్చు. ఆయా క్రికెట్ సంఘాలకు వారే అధ్యక్షులుగా ఉంటున్నారు. పలుకుబడి ఉన్నవారి స్టేట్‌కే ప్రధాన మ్యాచ్‌లు వెళుతున్నాయి’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. -
మరో 5 నెలలు ఇవ్వండి!
సుప్రీంకోర్టుకు లోధా కమిటీ విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఐపీఎల్లో అవినీతికి సంబంధించి తుది నివేదిక ఇచ్చేందుకు తమకు మరో ఐదు నెలలు గడువు ఇవ్వాలని లోధా కమిటీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి సోమవారం ఒక దరఖాస్తు దాఖలు చేసింది. తొలి నివేదిక ప్రకారం రెండు ఐపీఎల్ జట్లతో పాటు కుంద్రా, మెయప్పన్‌లపై నిషేధం విధించాలని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసింది. రాబోయే రెండో నివేదికలో ప్రధానంగా బీసీసీఐ ఎలా పని చేయాలనేదానిపై తగిన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణతో పాటు బోర్డులో సంస్కరణల గురించి కూడా తగిన సలహాలు ఇవ్వాలని గతంలోనే సుప్రీం కోర్టు కమిటీని ఆదేశించింది. దాంతో ఇప్పుడు ఆ కమిటీ మరింత సమయం కోరింది. -
ధోని ఏం చేశాడని!
ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌ను రెండేళ్ల పాటు నిషేధించాలనే లోధా కమిటీ తీర్పు రాగానే విమర్శకులంతా ఒళ్లు విరుచుకున్నారు. అదేంటో ఎవరి మీదా లేనట్లు ధోనిని నిందించడం మొదలుపెట్టారు. కొందరు సోకాల్డ్ ‘నిపుణులు’ అసలు అతనికి చిత్తశుద్ధి లేదనే వాదన తీసుకొచ్చారు. అసలు ధోని చేసిన తప్పేంటి? ఫ్రాంచైజీల యజమానులు పందేలు కాసుకుంటే అతనేం చేస్తాడు? సాక్షి క్రీడావిభాగం ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఐపీఎల్ తొలి సీజన్ నుంచి కూడా ఈ లీగ్‌కు ప్రధాన శక్తి ధోని. భారత్‌కు 2007లో టి20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా... ఐపీఎల్లో ఖరీదైన తొలి క్రికెటర్‌గా... ఓ రకంగా ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని ఈ ఎనిమిదేళ్లూ వ్యవహరించాడు. ధోని కంటే గొప్ప క్రికెటర్లు, అతనికంటే నైపుణ్యం ఉన్న వాళ్లు లీగ్‌లో ఆడి ఉండొచ్చు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ అనే జట్టు మిగిలిన అన్ని జట్ల కంటే విజయవంతం కావడానికి కారణం ధోని. ఇప్పుడు చెన్నై జట్టు లీగ్ నుంచి తొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల తొలుత నష్టపోయేది కూడా ధోనియే. అయినా సరే... మీడియాలో కొన్ని శక్తులు, బోర్డులో కొందరు పెద్దలు కలిసి ధోని మీద దుష్ర్పచారం మొదలుపెట్టారు. ► ఒకవేళ ఈ స్టార్ క్రికెటర్ తప్పు చేసి ఉంటే ఈపాటికి పతనమయ్యేవాడు. కానీ ఇప్పటివరకూ ఎక్కడైనా ఊహాగానాలే తప్ప ధోని ఏదైనా తప్పు చేసినట్లు ఎక్కడా బయటకు రాలేదు. ముద్గల్ కమిటీ తమ నివేదికలో క్రికెటర్ల పేర్లు పేర్కొందనే వార్త రాగానే... అందులో ధోని ఉన్నాడంటూ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా లోధా కమిటీ తీర్పు వచ్చిన వెంటనే జార్ఖండ్ డైనమైట్ వైపు బాణాలు ఎక్కుపెట్టారు. ► భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోని. అతను సాధించని ఘనత లేదు. ఇప్పుడు అతణ్ని నిందిస్తున్న వాళ్లంతా మొన్నటిదాకా ధోని ప్రాపకం కోసం తాపత్రయపడ్డవారే. అయితే భారత క్రికెట్లో క్రమంగా కొత్త శకం మొదలవుతోందనే సంకేతం ఇప్పుడు వచ్చింది. శ్రీనివాసన్ బోర్డులో లేకపోవడం, టెస్టు ఫార్మాట్ నుంచి ధోని తప్పుకోవడం వల్ల భారత క్రికెట్లో సమీకరణాలు చాలా మారాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితి కోసం ఎదురుచూస్తున్న వాళ్లంతా ఇప్పుడు చెలరేగుతున్నారు. ► గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ చేయడం చెన్నై జట్టుకు వచ్చిన ప్రధాన నష్టం. యజమాని బెట్టింగ్ చేస్తున్న విషయం ధోనికి ఎలా తెలుస్తుంది. ఒకవేళ మెయ్యప్పన్ మ్యాచ్‌లు ఫిక్స్ చేసి ఉంటే దానికి ధోని మద్దతు అవసరమయ్యేది. కానీ మెయ్యప్పన్ ఎక్కడా ఫిక్సింగ్ చేయలేదు. కేవలం బెట్టింగ్ మాత్రమే చేశాడు. అందుకే అతను నష్టపోయాడు. ఇంత చిన్న లాజిక్‌ను కూడా మరచిపోయి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ► మెయ్యప్పన్‌తో చెన్నై జట్టుకు సంబంధం లేదనే వాదన వినిపించింది ఆ జట్టు యాజమాన్యం. ఈ మాటను ధోని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ముద్గల్ కమి టీ ముందు విచారణకు హాజరైన ధోని ఏం చెప్పాడో బయటివాళ్లకు తెలి యదు. యాజమాన్యం ఎలాంటి వాదన చేసినా ముద్గల్, లోధా కమిటీలు మెయ్యప్పన్‌ను జట్టు యజమానిగానే ఖాయంచేసి శిక్ష విధించాయి. విచారణలో క్రికెటర్లు మెయ్యప్పన్ తమ యజమాని అని ఒప్పుకున్నట్లే. ► ఏమైనా ఈ వ్యవహారంలో క్రికెటర్లకు సంబంధం లేదు. సంబం ధం ఉన్న ముగ్గురూ ఇప్పటికే శిక్ష ఎదుర్కొంటున్నారు. రైనా, బ్రేవో లాంటి ఆటగాళ్లను లలిత్ మోడి నిందించాలని చూసినా ఐసీసీయే వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీశాంత్ తప్పు చేశాడని ఆ జట్టు మెంటార్‌గా ఉన్న ద్రవిడ్‌ను నిందించడం ఎంత మూర్ఖత్వమో ఇప్పుడు చెన్నై జట్టుపై నిషేధం పడగానే ధోనిని నిందించడం అంతే మూర్ఖత్వం. డెక్కన్ చార్జర్స్‌లో కొత్త ఆశలు ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిపోయిన జట్టు డె క్కన్ చార్జర్స్ మళ్లీ పునరాగమనంపై ఆశలు పెంచుకుంది. ఈ జట్టుకు బీసీసీఐకి మధ్య ఉన్న కేసును ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరులో ఆర్బిట్రేటర్ తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల కొచ్చి టస్కర్స్ విషయంలో ఆర్బిట్రేటర్ ఐపీఎల్ జట్టుకు అనుకూలంగా తీర్పు ఇచ్చి రూ.550 కోట్లు పరిహారం ఇవ్వాలని బీసీసీఐని ఆదేశించారు. కాబట్టి తమ జట్టు విషయంలో కూడా తీర్పు అనుకూలంగానే ఉంటుందని డీసీ జట్టు వర్గాలు భావిస్తున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌కు వేరే జట్టు ఉన్నందున... మరో నగరం నుంచి అయినా సరే డెక్కన్ చార్జర్స్‌ను నడపాలనేది ఆలోచన. మరి వీళ్ల అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
నాకు అన్యాయం చేశారు: కుంద్రా
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో లోధా కమిటీ తనకు తీవ్ర అన్యాయం చేసిందని రాజస్తాన్ ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్ కుంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. 'నాకు చాలా నిరాశ కలిగించిన రోజు. నా నిజాయితీకి సవాలు ఎదురైంది. విచారణలో నేను ఇచ్చిన మద్దతే నాకు వ్యతిరేకంగా పని చేసింది. సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ నా కేసు విషయంలో ఇప్పుడు దాన్ని శంకించాల్సి వస్తోంది. నాకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. వాటిని చూసైనా శిక్ష విషయంలో కాస్త సంతృప్తి పడతా' అని కుంద్రా పేర్కొన్నారు. -
బీసీసీఐకి లోధా కమిటీ ప్రశ్నావళి
న్యూఢిల్లీ: బీసీసీఐలో పరిపాలనా సంస్కరణల కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన లోధా కమిటీ కార్యరంగంలోకి దిగింది. దీంట్లో భాగంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ 80కి పైగా ప్రశ్నలను బోర్డుకు పంపింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జీలు అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ... బోర్డుకు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, ఆడిట్స్, ఖాతాల నిర్వహణ, కమిటీలు.. ఎన్నికలు, ఆటగాళ్ల సంక్షేమం, పారదర్శకత, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఏడు ఉప శీర్షికలతో ఈ ప్రశ్నావళిని రూపొందించింది. వీటికి బీసీసీఐ ఉన్నతాధికారులు సమాధానమివ్వాల్సి ఉంటుంది.