
కొన్ని సూచనలు మరీ అతిగా ఉన్నాయి
లోధా కమిషన్‌పై కపిల్, గావస్కర్
కాన్పూర్: భారత క్రికెట్ ప్రక్షాళన కోసం జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలపై పలువురు సీనియర్ క్రికెటర్లు తమ నిరసన గళం విప్పుతున్నారు. వారు పేర్కొన్న కొన్ని సూచనలు మరీ కఠినంగా ఉన్నాయని మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ అన్నారు. ఒక రాష్ట్రానికి ఒక ఓటు, కూలింగ్ పీరియడ్ అమలు సరికాదన్నారు. ఇంతకుముందే మాజీ కెప్టెన్ రవిశాస్త్రి కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘లోధా ప్యానెల్‌పై వారి ప్రతిపాదనలపై నాకు అపార గౌరవం ఉంది. అయితే ఒక రాష్ట్రం, ఒక ఓటు అనేది ఆయా రాష్ట్ర సంఘాలకే కాకుండా బీసీసీఐకి కూడా కాస్త కఠినంగానే ఉంది.
ఇంగ్లండ్‌లో ప్రతీ కౌంటీ జట్టు ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనవు. అలాగే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో కూడా ప్రతీ ఆస్ట్రేలియా రాష్ట్ర జట్టు పాల్గొనదు. అదే ఇక్కడ ప్రతీ రాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీలో పాల్గొంటే క్రికెట్ ప్రమాణాలు పడిపోతారుు. ఇది అంతర్జాతీయస్థాయిలో మనకు మేలు చేయదు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం జూనియర్ స్థాయిలో మెరుగ్గా రాణించిన జట్టు పైస్థాయికి ప్రమోట్ అవుతుంది. అంతేకానీ నేరుగా రంజీ ట్రోఫీకి అర్హత ఇవ్వడం సరికాదు’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు లోధా కమిటీ సూచనలు కొన్ని బాగానే ఉన్నా మరికొన్ని మాత్రం పంటి కింద రారుులా ఇబ్బంది పెడుతున్నాయని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.