త్వరలో లోధా కమిటీతో భేటీ.. | BCCI president ready to meet Lodha panel members after November 9 | Sakshi
Sakshi News home page

త్వరలో లోధా కమిటీతో భేటీ..

Published Mon, Nov 7 2016 3:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

త్వరలో లోధా కమిటీతో భేటీ..

త్వరలో లోధా కమిటీతో భేటీ..

ముంబై:  మరో రెండు రోజుల తరువాత లోధా కమిటీని కలిసి వారు సూచించిన సిఫారుసులపై తమ భవిష్య కార్యచరణను వివరించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమవుతోంది. ఈ మేరకు లోధా కమిటీకి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలు లేఖ రాసినట్లు బోర్డు అధికారి ఒకరు తెలియజేశారు.

 

'ఈనెల9వ తేదీ దాటిన తరువాత లోధా కమిటీని అనురాగ్, షిర్కేలు కలుస్తారు. లోధా సిఫారుసుల అమలుకు సంబంధించి బీసీసీఐ ప్రణాళికను ఆ కమిటీ ముందు ఉంచుతుంది. ఈ బుధవారమే లోధా కమిటీని అనురాగ్ ఠాకూర్ కలవాలి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుంది. దీనిపై అనురాగ్ దాఖలు చేసిన అఫిడవిట్లో క్షమాపణలు కూడా తెలియజేశారు. మరో రెండు రోజుల దాటిన తరువాత ఎప్పుడైనా లోధా కమిటీని అనురాగ్ కలిసే అవకాశం ఉంది' అని  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement