
85 శాతం ప్రతిపాదనలు అమలు చేయొచ్చు
లోధా కమిటీ ప్రతిపాదనల్లో 85 శాతం అమలు చేయడానికి ఇబ్బంది లేదని, బీసీసీఐ వాటికి ఒప్పుకోవచ్చని మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అన్నారు. ‘బీసీసీఐలో పరిపాలన, నిర్వహణ, ఎన్నికల ప్రక్రియ, ఆర్ధిక వనరులు ఇలాంటి విషయాలన్నింటినీ కమిటీ ప్రతిపాదనల మేరకు అమలు చేయొచ్చు. అరుుతే ఒక 15 శాతం ప్రతిపాదనలు అమలు చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. ఈ విషయంలో అటు బోర్డు, ఇటు కమిటీ సభ్యులు కూడా పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించాలి’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.