లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నారా?లేదా? | Will the BCCI be able to adhere to the Lodha Committee timelines? | Sakshi
Sakshi News home page

లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నారా?లేదా?

Published Sat, Sep 17 2016 1:51 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నారా?లేదా?

లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నారా?లేదా?

వివరణ ఇవ్వాలని హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు శుక్రవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలను నిర్వహించేలా అసోసియేషన్ నిబంధనలను హెచ్‌సీఏ సవరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీనిని విచారించిన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేస్తున్నారో లేదో హెచ్‌సీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement