బీసీసీఐ ఎస్‌జీఎం 19న! | BCCI calls for SGM to discuss Lodha recommendations | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ఎస్‌జీఎం 19న!

Published Mon, Feb 8 2016 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

బీసీసీఐ ఎస్‌జీఎం 19న!

బీసీసీఐ ఎస్‌జీఎం 19న!

ముంబై: లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేసే విషయంపై చర్చించేందుకు బీసీసీఐ తమ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్‌జీఎం) ఏర్పాటు చేయనుంది. ఈ ఎస్‌జీఎం ఈనెల 19న జరిగే అవకాశముంది. ఆ తర్వాతే సుప్రీంకోర్టుకు తమ స్పందన తెలుపనుంది. ఆదివారం జరిగిన బోర్డు లీగల్ ప్యానెల్ సమావేశంలో అధ్యక్షుడు శశాంక్ మనోహర్, పీఎస్ రామన్ (తమిళనాడు, చైర్మన్), డీవీఎస్‌ఎస్ సోమయాజులు (ఆంధ్ర), అభయ్ ఆప్టే (మహారాష్ట్ర), కోశాధికారి అనిరుధ్ చౌధరి పాల్గొన్నారు.

కమిటీకి సంబంధిన ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర యూ నిట్ల తో ఎస్‌జీఎంలో చర్చించాలని సమావేశం లో నిర్ణయించారు. బోర్డు అధ్యక్షుడిగా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని 10 రోజుల్లో ఎస్‌జీఎం ఏర్పాటుకు శశాంక్ మనోహర్ నోటీసు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతకుముందు బోర్డులో ప్రక్షాళన కోసం లోధా కమిటీ చేసిన సూచనలను అమలుపరచాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement