SGM
-
BCCI: కీలక పదవుల భర్తీకి సన్నాహకాలు
బోర్డులో ఇటీవల ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ముంబైలో వచ్చే నెల 12న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్‌జీఎమ్) ఏర్పాటు చేసింది. బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వెళ్లారు.మరోవైపు.. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. బోర్డు నియమావళి ప్రకారం ఏదైన పదవి ఖాళీ అయితే 45 రోజుల్లోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్‌జీఎమ్ నిర్వహించాలి.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో జనవరి 12న ఎస్‌జీఎమ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారమిచ్చినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా మరో ఏడాది పదవీకాలం మిగిలున్నప్పటికీ జై షా, ఆశిష్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అస్సామ్కు చెందిన బోర్డు సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉండగా, కోశాధికారి పదవి బాధ్యతల్ని ఎవరికీ కట్టబెట్టలేదు. చదవండి: అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
ఐఓఏలో వైరం... ఎస్జీఎం చక్కదిద్దేనా?
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లోని సహచరులతో ఏర్పడిన వైరంతో ఇబ్బంది పడుతున్న ఐఓసీ అధ్యక్షురాలు పీటీ ఉష ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 25న జరగబోయే ఈ మీటింగ్‌లో సమస్యలు, విబేధాలు, ఇతరత్రా అంశాలపై చర్చిద్దామని ఆమె పేర్కొంది. ‘వివాదానికి దారి తీసిన అంశాలు, అసాధారణ సమస్యలు... ఇలా అన్నింటిపై చర్చించేందుకు ఎస్జీఎం నిర్వహించాలని నిర్ణయించాను. ఈ నెల 25న ఆఫీస్ బేరర్లు, స్టేక్ హోల్డర్లంతా హాజరు కావాలని కోరుతున్నాను. ఈ ఎస్జీఎం హైబ్రిడ్ మీటింగ్. అంటే నియమావళిలోని ఆర్టికల్ 8.3 ప్రకారం ఎవరైనా సభ్యులు ప్రత్యక్షంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటే ఆన్లైన్ మీటింగ్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఐఓఏ వెబ్సైట్లో ఉంటుంది’ అని ఉష ఐఓఏ సభ్యులకు ఈ–మెయిల్ పంపారు. ముఖ్యంగా ఒలింపిక్ సంఘానికి సీఈఓగా రఘురామ్ అయ్యర్‌ను నియమించడాన్ని ఎగ్జిక్యూటివ్ (ఈసీ) సభ్యులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోతున్నారు. తాము ఎంతగా వ్యతిరేకించినా ఆయనకు పదవిని కట్టబెట్టడంపై ఈసీ సభ్యులంతా గుర్రుగా ఉన్నారు. కోశాధికారి సహదేవ్ యాదవ్‌పై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా చర్చనీయాంశమైంది. ఈ లుకలుకలతో ఐఓఏ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు ఐఓఏను ఒక ప్రొఫెషనల్ దృక్పథంలో నడిపించేందుకు సీఈఓ అవసరం ఎంతో ఉందని ఉష వాదిస్తోంది. అయ్యర్‌కు సీఈఓ పదవేమీ పూర్తిగా కొత్తేం కాదు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలతో పాటు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ లీగ్, అల్టీమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లకు సీఈఓ పనిచేసిన విశేషానుభవం రఘురామ్ అయ్యర్ సొంతం. ఐఓఏ నిర్వహించే ఎస్‌జీఎంలో స్పోర్ట్స్ కోడ్‌పై కూడా చర్చ జరిగే అవకాశముంది. గరిష్ట వయోపరిమితిపై ప్రధానంగా చర్చిస్తారు. -
‘లోధా’ సిఫార్సులకు హెచ్‌సీఏ ఓకే
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ సూచించిన సిఫార్సుల అమలుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆమోద ముద్ర వేసింది. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐతో పాటు ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలలో సంస్కరణల నిమిత్తం సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బీసీసీఐను ప్రక్షాళన చేస్తూ పలు సంస్కరణలను సూచించింది. ఆరంభం నుంచి లోధా కమిటీ సిఫార్సుల అమలుకు సుముఖంగానే ఉంది. అయితే ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వాటికి ఆమోద ముద్ర వేసింది. మీరెలా ఎన్నికయ్యారు? లోధా సిఫార్సుల అమలు కోసం సమావేశమైన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో రభస జరిగింది. ఇటీవలే జి. వివేక్ అధ్యక్షతన ఎన్నికైన హెచ్‌సీఏ నూతన కార్యవర్గం ఎంపికను ప్రశ్నిస్తూ పలువురూ చర్చను లేవనెత్తారు. లోధా సిఫార్సుల ప్రకారం తమ ఎన్నిక జరిగిందని చెప్పుకుంటున్న నూతన హెచ్‌సీఏ పెద్దలు... ఇన్నాళ్ల తర్వాత లోధా సిఫార్సులకు ఆమోద ముద్ర వేయడం ఏమిటని వ్యతిరేక వర్గం ప్రశ్నించింది. అంటే లెక్క ప్రకారం నూతన కార్యవర్గం ఎంపిక చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలకు హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు సంతృప్తికర వివరణ ఇవ్వలేకపోయారు. -
ఎస్జీఎం రేపటికి వాయిదా
ముంబై: లోధా కమిటీ సూచించిన సిఫారుసుల అమలుకు సంబంధించి భేటీ అయిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎం) ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే వాయిదా పడింది. ప్రధానంగా బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మొత్తం 30 యూనిట్లు సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఇందులో 10 యూనిట్లకు బీసీసీఐలో అధికారిక హోదా కల్పిస్తూ ఎటువంటి లేఖలు జారీ చేయకపో్వడంతో ఎస్‌జీఎంను రేపటికి వాయిదా వేశారు. లోథా సూచించిన ప్రతిపాదనల ప్రకారం ఆ పది యూనిట్లను అధికారికంగా స్వీకరిస్తూ మెమోరండమ్ జారీ చేయాల్సి వుంది. దీనికి శుక్రవారమే తుది గడువు. అయితే ఈ అంశంపై ఎటువంటి స్పష్టత లేకుండానే ఎస్‌జీఎంను వాయిదా వేశారు. తమ కమిటీ సూచించిన ప్రతిపాదనలపై బీసీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చీఫ్ అనురాగ్ ఠాకూర్ సహా మిగతా సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లోధా కమిటీ సుప్రీంకోర్టుకు విన్నవించింది. దీనిపై బీసీసీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని అమలు చేయాల్సిందేనని స్సష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 6వ తేదీన జరిగే విచారణ నాటికి లోధా ప్రతిపాదనల అమలుపై స్పష్టత ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ముందు రెండే ఆప్షన్లు మిగిలి వున్నాయి. ఒకటి లోధా ప్రతిపాదనలు అమలు చేయడం?లేక పోరాటాన్ని కొనసాగించడం. రేపటి సమావేశంలో లోధా ప్రతిపాదనల అమలుపై కొంత వరకూ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బీసీసీఐ ఎస్జీఎం 19న!
ముంబై: లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేసే విషయంపై చర్చించేందుకు బీసీసీఐ తమ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్జీఎం) ఏర్పాటు చేయనుంది. ఈ ఎస్జీఎం ఈనెల 19న జరిగే అవకాశముంది. ఆ తర్వాతే సుప్రీంకోర్టుకు తమ స్పందన తెలుపనుంది. ఆదివారం జరిగిన బోర్డు లీగల్ ప్యానెల్ సమావేశంలో అధ్యక్షుడు శశాంక్ మనోహర్, పీఎస్ రామన్ (తమిళనాడు, చైర్మన్), డీవీఎస్ఎస్ సోమయాజులు (ఆంధ్ర), అభయ్ ఆప్టే (మహారాష్ట్ర), కోశాధికారి అనిరుధ్ చౌధరి పాల్గొన్నారు. కమిటీకి సంబంధిన ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర యూ నిట్ల తో ఎస్‌జీఎంలో చర్చించాలని సమావేశం లో నిర్ణయించారు. బోర్డు అధ్యక్షుడిగా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని 10 రోజుల్లో ఎస్జీఎం ఏర్పాటుకు శశాంక్ మనోహర్ నోటీసు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతకుముందు బోర్డులో ప్రక్షాళన కోసం లోధా కమిటీ చేసిన సూచనలను అమలుపరచాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది.