వచ్చే నెల 2న బీసీసీఐ ఎస్‌జీఎం | Lodha debate on the committee report | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 2న బీసీసీఐ ఎస్‌జీఎం

Published Tue, Nov 29 2016 12:08 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

వచ్చే నెల 2న బీసీసీఐ ఎస్‌జీఎం - Sakshi

వచ్చే నెల 2న బీసీసీఐ ఎస్‌జీఎం

లోధా కమిటీ నివేదికపై చర్చ 

మొహాలీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికపై చర్చించేందుకు బీసీసీఐ వచ్చే నెల 2న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) ఏర్పాటు చేయనుంది. తమ ప్రతిపాదనలను బేఖాతరు చేస్తున్న బీసీసీఐపై కోర్టుకు మూడో నివేదికను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న ఆఫీస్ బేరర్లందరినీ తొలగించి బోర్డు పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించేందుకు అనుమతించాలని ప్యానెల్ కోర్టును కోరింది.

‘వచ్చే నెల 2న న్యూఢిల్లీలో ఎస్‌జీఎం జరపనున్నాం. లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించడమే మా అజెండా’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే లోధా కమిటీ సూచించిన నూతన సవరణలపై వచ్చే నెల 3న బోర్డు తమ అంగీకార పత్రాన్ని కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement