చెన్నైపై నిషేధమే.. | Chennai ban .. | Sakshi
Sakshi News home page

చెన్నైపై నిషేధమే..

Oct 7 2016 11:40 PM | Updated on Sep 4 2017 4:32 PM

చెన్నై సూపర్ కింగ్‌‌సపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం

స్వామి పిటిషన్ కొట్టివేత 
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్‌‌సపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బెట్టింగ్ స్కామ్ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్‌తో పాటు సీఎస్‌కేపై రెండేళ్ల పాటు నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్, ఆ జట్టు ఆటగాళ్లు ఎలాంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఈ క్రమంలో ఆర్‌ఎం లోధా కమిటీ విధించిన నిషేధం అక్రమమని స్వామి వాదించారు. అయితే లోధా ప్యానెల్ తీర్పు ఫైనల్ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన త్రిసభ్య బెంచ్ స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement