భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిపాలనా వ్యవహారాలను సంస్కరించడంలో భాగంగా చేపట్టిన కార్యక్రమానికి ఇప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మద్దతు పలికింది. బోర్డులో చేయాల్సిన మార్పుల గురించి జస్టిస్ లోధా కమిటీ చేసిన కీలక సిఫారసులకు సుప్రీం సోమవారం ఆమోద ముద్ర వేసింది. కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాల్సిందిగా బీసీసీఐని ఆదేశించింది. అందుకు ఆరు నెలల గడువు విధించింది.