మరో 5 నెలలు ఇవ్వండి! | Lodha Committee appealed to the Supreme Court | Sakshi
Sakshi News home page

మరో 5 నెలలు ఇవ్వండి!

Published Wed, Jul 22 2015 1:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Lodha Committee appealed to the Supreme Court

సుప్రీంకోర్టుకు లోధా కమిటీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ:
ఐపీఎల్‌లో అవినీతికి సంబంధించి తుది నివేదిక ఇచ్చేందుకు తమకు మరో ఐదు నెలలు గడువు ఇవ్వాలని లోధా కమిటీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి సోమవారం ఒక దరఖాస్తు దాఖలు చేసింది. తొలి నివేదిక ప్రకారం రెండు ఐపీఎల్ జట్లతో పాటు కుంద్రా, మెయప్పన్‌లపై నిషేధం విధించాలని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసింది. రాబోయే రెండో నివేదికలో ప్రధానంగా బీసీసీఐ ఎలా పని చేయాలనేదానిపై తగిన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణతో పాటు బోర్డులో సంస్కరణల గురించి కూడా తగిన సలహాలు ఇవ్వాలని గతంలోనే సుప్రీం కోర్టు కమిటీని ఆదేశించింది. దాంతో ఇప్పుడు ఆ కమిటీ మరింత సమయం కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement