
బీసీసీఐ అదే ధోరణి...
లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడం లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధోరణిలో మార్పు రాలేదు.
ముంబై: లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడం లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధోరణిలో మార్పు రాలేదు. ఈ ప్రతిపాదనలపై చర్చించడానికి శనివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ముగ్గురు సెలక్టర్లు, 70 ఏళ్ల వయో పరిమితి, ఒక రాష్ట్రానికి ఒక ఓటు లాంటి కీలక ప్రతిపాదనలపై ఇందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అరుుతే అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఐపీఎల్ కౌన్సిల్‌లో కూడా కాగ్ సభ్యుడికి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని సమావేశంలో నిర్ణరుుంచారు. జాతీయ జట్టు మ్యాచ్‌లకు, ఐపీఎల్‌కు 15 రోజుల విరామం ఉండాలనే ప్రతిపాదన 2017లో అమలు చేయడం సాధ్యం కాదని బీసీసీఐ తెలిపింది.