న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి బీసీసీఐ వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. జులై 18న ఇచ్చిన తీర్పుతో పాటు జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను విచారణ నుంచి తప్పించాలంటూ బోర్డు రివ్యూ పిటిషన్ వేసింది. ఓపెన్ కోర్టు విచారణను కూడా ఇందులో బీసీసీఐ డిమాండ్ చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, ఎస్‌ఏ బోబ్డేలతో కూడిన బెంచీ ముందు ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రావాల్సింది. అయితే దీనిని మరో రెండు వారాల తర్వాత విచారించేందుకు వాయిదా వేశారు. బీసీసీఐ సీనియర్లు నిరంజన్‌షా, చందూ బోర్డేలు విడివిడిగా వేసిన పిటిషన్‌లపై కూడా విచారణ జరగలేదు.