నాకు అన్యాయం చేశారు: కుంద్రా | Disappointed with IPL verdict, says Raj Kundra | Sakshi
Sakshi News home page

నాకు అన్యాయం చేశారు: కుంద్రా

Published Thu, Jul 16 2015 3:19 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

Disappointed with IPL verdict, says Raj Kundra

న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో లోధా కమిటీ తనకు తీవ్ర అన్యాయం చేసిందని రాజస్తాన్ ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్ కుంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. 'నాకు చాలా నిరాశ కలిగించిన రోజు. నా నిజాయితీకి సవాలు ఎదురైంది. విచారణలో నేను ఇచ్చిన మద్దతే నాకు వ్యతిరేకంగా పని చేసింది. సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ నా కేసు విషయంలో ఇప్పుడు దాన్ని శంకించాల్సి వస్తోంది. నాకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. వాటిని చూసైనా శిక్ష విషయంలో కాస్త సంతృప్తి పడతా' అని కుంద్రా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement