భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లెక్కలేనితనం దేశ అత్యున్నత న్యాయ స్థానానికే ఆగ్రహం తెప్పించింది. బోర్డును సంస్కరించే దిశగా కొత్తగా చేసిన సూచనలను పట్టించుకోకపోవడంతో పాటు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లో అసహనాన్ని పెంచింది. అసలు మీ గురించి మీరేం అనుకుంటున్నారు అంటూ తీవ్రంగా ప్రశ్నించిన కోర్టు... ఇలాంటి వాటిని ఎలా సరిదిద్దాలో తమకు బాగా తెలుసంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు పరిపాలనలో ప్రక్షాళన గురించి సిఫారసు చేసిన లోధా కమిటీ కూడా బోర్డు అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గాన్ని కూడా వెంటనే తప్పించాలంటూ కోరడం మరో కోణం. మొత్తంగా బీసీసీఐ, సుప్రీంకోర్టు మధ్య వివాదం ముదరడం అనూహ్య పరిణామం.
Published Thu, Sep 29 2016 8:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement