భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రక్షాళన కోసం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయకపోతే ఏకంగా బోర్డునే మార్చాల్సి వస్తుందంటూ సుప్రీం అల్టిమేటం జారీ చేసింది. ఆ ప్రతిపాదనలను రేపటిలోగా అమలు చేయాలంటూ బోర్డుకు తుది గడువు ఇచ్చింది.