లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తాం | we will follow recommendations of lodha committee, hca to high court | Sakshi
Sakshi News home page

లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తాం

Published Tue, Sep 27 2016 12:23 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

we will follow recommendations of lodha committee, hca to high court

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), దాని అనుబంధ సంఘాలకు జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల మేరకే ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్‌సీఏ సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని నమోదు చేసుకున్న జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, దానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలను జరిపేలా అసోసియేషన్ నిబంధనలను హెచ్‌సీఏ సవరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

 

దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేస్తున్నారో లేదో చెప్పాలని హెచ్‌సీఏను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సోమవారం హెచ్‌సీఏ తాము లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తామని, దాని ప్రకారమే ఎన్నికలు జరుపుతామని సమాధానమిచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement