► బీసీసీఐలో మార్పుల గురించి లోధా కమిటీ సూచనలు
► నివేదిక జనవరి 4న కోర్టు ముందుకు
న్యూఢిల్లీ: బీసీసీఐ నిర్వహణలో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉండకూడదు... ఒక్క రాష్ట్రానికి ఒక్కటే క్రికెట్ సంఘం ఉండాలి... బీసీసీఐలో ఉండే వ్యక్తులు రాష్ట్ర సంఘాల్లో ఎలాంటి పదవుల్లో ఉండకూడు... సుప్రీం కోర్టుకు జస్టిస్ లోధా కమిటీ సమర్పించబోతున్న నివేదికలోని కొన్ని అంశాలు ఇవి. జనవరి 4న కమిటీ తన తుది నివేదికను కోర్డుకు సమర్పించబోతోంది.
విశ్వసనీయ సమచారం ప్రకారం... ఆ నివేదికలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని లోధా కమిటీ సూచించబోతోంది. ప్రస్తుతం బీసీసీఐ 1975 తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజస్టర్ అయి ఉంది. దీనిని పబ్లిక్ ట్రస్ట్ లేదా కంపెనీగా మార్చాలనేది సూచన. ఈ నివేదిక రూపొందించేందుకు క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు, లాయర్లు, ప్రముఖ వ్యక్తులతో వివిధ అంశాలతో కమిటీ చర్చించింది. ‘కమిటీ ప్రతిపాదనలు మెజారిటీ అభిప్రాయాన్ని వ్యక్తపరచనున్నాయి. క్రికెటర్లు కానివారికి ఇవి రుచించకపోవచ్చు. ఆయా క్రికెట్ సంఘాలకు వారే అధ్యక్షులుగా ఉంటున్నారు. పలుకుబడి ఉన్నవారి స్టేట్‌కే ప్రధాన మ్యాచ్‌లు వెళుతున్నాయి’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
ఒక్క రాష్ట్రానికి ఒక్కటే సంఘం!
Published Mon, Dec 28 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM
Advertisement