
9 ఏళ్ల తర్వాత...
ఆగస్టు 18, 2008... విరాట్ కోహ్లి భారత్ తరఫున తొలి వన్డే ఆడిన రోజు. దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి కోహ్లి 12 పరుగులు చేశాడు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత కోహ్లి ఒక సూపర్ స్టార్. ఒకదాని తర్వాత మరో రికార్డును బద్దలు కొడుతూ ఈతరంలో నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్యాట్స్‌మన్. మరోసారి దంబుల్లాలో మ్యాచ్‌కు సిద్ధమైన వేళ కోహ్లి తన తొలి మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ తాను ఆనాడు కూర్చున్న కుర్చీతో ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.
‘ఇదే రోజు ఇదే మైదానంలో ఇదే కుర్చీతో అలా ప్రస్థానం మొదలైంది. భారత క్రికెట్‌తో తొమ్మిదేళ్లు! చాలా గొప్పగా అనిపిస్తోంది’ అని కోహ్లి వ్యాఖ్య జోడించాడు. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం దంబుల్లా మైదానంలో జరిగే తొలి వన్డేతో ప్రారంభమవుతుంది.