టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పో | OPPO Digital strikes Rs 1079 crore deal as India national cricket ... | Sakshi
Sakshi News home page

టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పో

Published Wed, Mar 8 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పో

టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పో

రూ.1,079 కోట్లతో భారీ ఒప్పందం  

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ ఆటగాళ్ల జెర్సీలపై ఇక ఒప్పో మొబైల్‌ బ్రాండ్‌ లోగో కనిపించనుంది. ఇప్పటిదాకా కొనసాగిన స్టార్‌ ఇండియా గ్రూప్‌ తమ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదు.దీంతో ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తిదారు ఒప్పో కంపెనీతో బీసీసీఐ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

వచ్చే నెల 1 నుంచి అమలయ్యే ఐదేళ్ల ఈ ఒప్పందానికి ఒప్పో కంపెనీ ఏకంగా రూ.1,079 కోట్లు చెల్లించనుంది. ఇది స్టార్‌ ఇండియా గ్రూప్‌ చెల్లించినదానికి ఐదు రెట్లు ఎక్కువ. జూన్‌ 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో తొలిసారిగా భారత ఆటగాళ్లు తమ జెర్సీలపై ఒప్పో లోగోలతో కనిపించనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement