హర్భజన్పై ధోనీ ఫ్యాన్స్ ఎటాక్ | MS Dhoni fans attack Harbhajan Singh | Sakshi
Sakshi News home page

హర్భజన్పై ధోనీ ఫ్యాన్స్ ఎటాక్

Published Sat, Jul 9 2016 12:40 PM | Last Updated on Thu, Sep 12 2019 8:55 PM

హర్భజన్పై ధోనీ ఫ్యాన్స్ ఎటాక్ - Sakshi

హర్భజన్పై ధోనీ ఫ్యాన్స్ ఎటాక్

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను టార్గెట్ చేశారు.

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ధోనీ అభిమానులు భజ్జీపై మాటల యుద్ధంతో దాడి చేశారు. ఇంతకీ ధోనీ అభిమానులు భజ్జీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ బర్త్ డే పరోక్షంగా కారణమైంది.

శుక్రవారం దాదా డే బర్త్ సందర్బంగా భజ్జీ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెబుతూ టీమిండియా అత్యుత్తమ కెప్టెన్గా అభివర్ణించాడు. ఈ వ్యాఖ్యలే ధోనీ అభిమానులకు కోపం తెప్పించాయి. భజ్జీని విమర్శిస్తూ ధోనీ అభిమానులు ట్వీట్ చేశారు. ధోనీ భజ్జీని వాటర్ బాయ్ చేశాడని, జట్టులో లేకుండా చేసినందుకు నైరాశ్యంలో ఉన్నాడంటూ.. ధోనీ భజ్జీని పక్కనబెట్టి అశ్విన్కు ప్రాధాన్యం ఇచ్చినందుకు ఈర్ష్య పడుతున్నాడంటూ.. దాదా బెస్ట్ కెప్టెన్ అయితే, ధోనీ ఎవరు? అంటూ.. భజ్జీ ఇలా ట్వీట్ చేసినందుకు టీమిండియాకు మళ్లీ ఎంపికకాడంటూ.. భారత క్రికెట్లో రమేష్ పవార్ అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ అంటూ... నెటిజెన్లు సెటైర్లు వేశారు.

దాదా తన నాయకత్వంలో భజ్జీ, యువరాజ్, సెహ్వాగ్, జహీర్ వంటి ఆటగాళ్లను ప్రోత్సహించాడు. భజ్జీకి కూడా దాదాతో ప్రత్యేక అనుబంధముంది. టీమిండియా కెప్టెన్లుగా ధోనీ, గంగూలీ ఇద్దరూ విజయవంతయ్యారు.. జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఎన్నో విజయాలు అందించారు.. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement